పనస / Jackfruit
From LTRC
| పనస / Jackfruit | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Rosales |
| Family | Moraceae |
| Genus | Artocarpus |
| Scientific Name / Latin Name | Artocarpus heterophyllus Lam. |
చక్కని సువాసన కలిగి అతి మధురంగా ఉండే ఫలము పనస. పనస శీతగుణము కలిగి ఉంది. ఇది పిత్తహరము, మధురము, బలకరము, శుక్రకరము. ఇది రక్తపిత్త వ్రణములను తగ్గించును.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : కంటకఫల / మృదంఘఫల ;
- హిందీ : కాఫల్ ;
- తెలుగు : పనసపండు ;
- ఇంగ్లీష్ : జాక్ప్రూట్ ;
- లాటిన్ : విట్రోకార్పస్ ఇంటిగ్రిఫోలియా ;
- కుటుంబము : Moraceae *(వ్యాసంలో కుటుంబం పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు, బాటానికల్ వర్గీకరణ ప్రకారం జోడించబడింది)*
పోషక విలువలు
పనస పండు యందు:
- తేమ : 77.2
- కార్బోహైడ్రేట్లు : 26 గ్రాములు
- ప్రొటీన్లు : 1.9 గ్రాములు
- క్రొవ్వు : 0.3 గ్రాములు
- ఫైబర్ : 1.1 గ్రాములు
- మిసరల్మేటర్ : 0.8 గ్రాములు
- కాల్షియం : 22 మి.గ్రా
- పాస్పరస్ : 38 మి.గ్రా
- ఐరన్ : 0.5 మి.గ్రా
- పొటాషియం : 407 మి.గ్రా
- సోడియం : 2 మి.గ్రా
- విటమిన్ - ఎ : 540 I.U
- విటమిన్ - బి 1 : 30 మై.గ్రా
- విటమిన్ - సి : 10 మి.గ్రా
- నియాసిన్ : 10 మి.గ్రా
- కేలరీలు : 110 మి.గ్రా కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- ఆహార ఉపయోగాలు & బలాన్ని పెంచడం: పచ్చి పనసను చక్కగా తరిగి కూర వందుకు తింటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కడుపునొప్పి కలిగిస్తుంది. వీర్యపుష్టిస్తుంది. బరువును పెంచుతుంది. అజీర్ణమును కలిగిస్తుంది. పనస తింటే తృప్తి కలుగుతుంది. ఎక్కువ తింటే వాతము చేస్తుంది.
- వ్యాధుల నివారణ: హైపర్ టెన్సన్, క్షయ, అర్శమోసులు మరియు స్త్రీల వ్యాధులందు ఎంతో ఉపయోగకరం. పనస బలాన్ని కలిగిస్తుంది శుక్రాన్ని వృద్ధి చేస్తుంది.
- వివిధ సమస్యలు & రసాల ఉపయోగాలు: లేత పనస ఆకులు మరియు మూలం (వేర్లు) ల రసము పాముకాటు, అతిసారము, జిగురు విరేచనాలు, ఛాతి నొప్పి మొదலగు జబ్బులలో వాడుదురు.
- తలనొప్పి నివారణ: పనస వేరు రసం తీసి నస్యం చేసిన లేదా నేసల్ డ్రాప్స్లాగ 3-4 చుక్కలు ముక్కులో వేసిన తలనొప్పి తగ్గుతుంది.
- పానీయాలు & గింజల గుణాలు: పనసతో అతి చక్కని శీతల పానీయం చేసుకొని త్రాగొచ్చు. పనస గింజలు శుక్రాన్ని పెంచుతాయి. మలబద్ధకము కలిగిస్తాయి. మూత్రమును సాఫీగా వెదలనట్లు చేస్తాయి. పనస గింజలోని మజ్జ నపుంసకత్వమును తొలగిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 537-538)
- రచయిత: డా|| టి. భిక్షపతి
