పనస / Jackfruit

From LTRC
పనస / Jackfruit
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Rosales
Family Moraceae
Genus Artocarpus
Scientific Name / Latin Name Artocarpus heterophyllus Lam.

చక్కని సువాసన కలిగి అతి మధురంగా ఉండే ఫలము పనస. పనస శీతగుణము కలిగి ఉంది. ఇది పిత్తహరము, మధురము, బలకరము, శుక్రకరము. ఇది రక్తపిత్త వ్రణములను తగ్గించును.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : కంటకఫల / మృదంఘఫల ;
  • హిందీ : కాఫల్ ;
  • తెలుగు : పనసపండు ;
  • ఇంగ్లీష్ : జాక్ప్రూట్ ;
  • లాటిన్ : విట్రోకార్పస్ ఇంటిగ్రిఫోలియా ;
  • కుటుంబము : Moraceae *(వ్యాసంలో కుటుంబం పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు, బాటానికల్ వర్గీకరణ ప్రకారం జోడించబడింది)*

పోషక విలువలు

పనస పండు యందు:

  • తేమ : 77.2
  • కార్బోహైడ్రేట్లు : 26 గ్రాములు
  • ప్రొటీన్లు : 1.9 గ్రాములు
  • క్రొవ్వు : 0.3 గ్రాములు
  • ఫైబర్ : 1.1 గ్రాములు
  • మిసరల్మేటర్ : 0.8 గ్రాములు
  • కాల్షియం : 22 మి.గ్రా
  • పాస్పరస్ : 38 మి.గ్రా
  • ఐరన్ : 0.5 మి.గ్రా
  • పొటాషియం : 407 మి.గ్రా
  • సోడియం : 2 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 540 I.U
  • విటమిన్ - బి 1 : 30 మై.గ్రా
  • విటమిన్ - సి : 10 మి.గ్రా
  • నియాసిన్ : 10 మి.గ్రా
  • కేలరీలు : 110 మి.గ్రా కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • ఆహార ఉపయోగాలు & బలాన్ని పెంచడం: పచ్చి పనసను చక్కగా తరిగి కూర వందుకు తింటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. కడుపునొప్పి కలిగిస్తుంది. వీర్యపుష్టిస్తుంది. బరువును పెంచుతుంది. అజీర్ణమును కలిగిస్తుంది. పనస తింటే తృప్తి కలుగుతుంది. ఎక్కువ తింటే వాతము చేస్తుంది.
  • వ్యాధుల నివారణ: హైపర్ టెన్సన్, క్షయ, అర్శమోసులు మరియు స్త్రీల వ్యాధులందు ఎంతో ఉపయోగకరం. పనస బలాన్ని కలిగిస్తుంది శుక్రాన్ని వృద్ధి చేస్తుంది.
  • వివిధ సమస్యలు & రసాల ఉపయోగాలు: లేత పనస ఆకులు మరియు మూలం (వేర్లు) ల రసము పాముకాటు, అతిసారము, జిగురు విరేచనాలు, ఛాతి నొప్పి మొదலగు జబ్బులలో వాడుదురు.
  • తలనొప్పి నివారణ: పనస వేరు రసం తీసి నస్యం చేసిన లేదా నేసల్ డ్రాప్స్లాగ 3-4 చుక్కలు ముక్కులో వేసిన తలనొప్పి తగ్గుతుంది.
  • పానీయాలు & గింజల గుణాలు: పనసతో అతి చక్కని శీతల పానీయం చేసుకొని త్రాగొచ్చు. పనస గింజలు శుక్రాన్ని పెంచుతాయి. మలబద్ధకము కలిగిస్తాయి. మూత్రమును సాఫీగా వెదలనట్లు చేస్తాయి. పనస గింజలోని మజ్జ నపుంసకత్వమును తొలగిస్తుంది. లైంగిక శక్తిని పెంచుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 537-538) - రచయిత: డా|| టి. భిక్షపతి