క్యాబేజి / Cabbage

From LTRC
Revision as of 12:53, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''క్యాబేజి / Cabbage''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Plantae |- | '''Division''' | Tracheophyta |- | '''Class''' | Magnoliopsida |- | '''Order''' | Brassicales |- | '''Family''' | Brassicaceae (Cruciferae) |- | '''Genus''' | ''Brassica'' |- | '''Scientific Name''' | ''Br...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
క్యాబేజి / Cabbage
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Brassicales
Family Brassicaceae (Cruciferae)
Genus Brassica
Scientific Name Brassica oleracea var. capitata L.

ప్రతిచోట సాగుచేసేది కాబేజి. కాబేజి నందు దాదాపు 9-10 రకాలు ఉన్నాయి. అయితే విలువలు దాదాపు అన్నింటిలోను సమంగానే ఉన్నాయి. క్యాబేజిని కూరగా, పులుసుగా వండుకుంటారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: క్యాబేజి
  • హిందీ: బంద్‌గోబి
  • లాటిన్: బ్రాసికా ఒలరేసియా క్యాపిటా
  • కుటుంబము: Cruciferae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల క్యాబేజి నందు ఉండే పోషక విలువల వివరాలు:

  • ప్రోటీన్లు: 2 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 5 గ్రాములు
  • క్రొవ్వు: 0.3 గ్రాములు
  • ఫైబర్ (నార): 1.2 గ్రాములు
  • ఖనిజ లవణములు: 1.9 గ్రాములు
  • కేలరీలు: 30 గ్రాములు
  • కాల్షియం: 33 మి.గ్రా
  • పాస్ఫరస్: 47 మి.గ్రా
  • ఐరన్: 0.7 మి.గ్రా
  • సోడియం: 53 మి.గ్రా
  • పొటాషియం: 113 మి.గ్రా
  • మెగ్నీషియం: 20 మి.గ్రా
  • ఆక్సాలిక్ యాసిడ్: 19 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 2000 I.U
  • విటమిన్ - బి1: 100 మైక్రో.గ్రా
  • విటమిన్ - బి2: 31 మైక్రో.గ్రా
  • విటమిన్ - సి: 120 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • స్తన్యవృద్ధి కోసం: క్యాబేజి తినటం వలన మాతృస్తన్యము వృద్ధి అవుతుంది.
  • గడ్డలు: క్యాబేజిని ఆముదములో వేయించి పట్టువేస్తే గడ్డలు మెత్తబడతాయి.
  • శుక్రవర్ధకం: క్యాబేజిని తినడం వలన శుక్రం వృద్ధి అవుతుంది.
  • అల్సర్లు: క్యాబేజికి అల్సర్లను తగ్గించే గుణముంది.
  • పిల్లల ఎదుగుదలకు: చిన్నపిల్లలకు, పెరిగే పిల్లలకు క్యాబేజి చాలామంచిది. ఇది ఎదుగుదలకు సహకరిస్తుంది.
  • సిర్రోసిస్ లివర్, కామెర్లు, రక్తమొలల రోగులకు: క్యాబేజి జ్యూస్ (రసం) 2 స్పూన్లు, తేనె 2 చెంచాలు సేవించడం వలన కామెర్ల రోగులకు, రక్తమొలల రోగులకు, లివర్ పెరిగిన రోగులకు, అల్సర్ రోగులకు చాలా మంచిది.
  • కిడ్నీ వ్యాధులు మరియు స్టోన్స్: మూత్రంలో రాళ్ళు మరియు కిడ్నీవ్యాధుల రోగులు క్యాబేజిని తినకూడదు. డాక్టర్ల సలహా పాటించాలి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 391, 392)
  • రచయిత: డా|| టి. భిక్షపతి