కాకరకాయ / Bitter Gourd

From LTRC
Revision as of 12:39, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''కాకరకాయ / Bitter Gourd''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Plantae |- | '''Division''' | Tracheophyta |- | '''Class''' | Magnoliopsida |- | '''Order''' | Cucurbitales |- | '''Family''' | Cucurbitaceae |- | '''Genus''' | ''Momordica'' |- | '''Scientific Name''' | ''Momordica...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
కాకరకాయ / Bitter Gourd
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Momordica
Scientific Name Momordica charantia L.

కాకరకాయను భారతదేశంలో పండిస్తున్నారు. కాకరకాయను ఆహారంగా, ఔషధంగా వినియోగిస్తున్నారు. కాకరకాయ తిక్తకటురసము, శీతవీర్యము, లఘురూక్షగుణము మరియు కటువిపాకములను కలిగి ఉండును. ఇది కఫపిత్త శామకము, దీపనము మరియు భేదనలో అనే కర్మలు కలిగి ఉంది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: కాకరకాయ
  • సంస్కృతం: కారవేల్లక
  • హిందీ: కరేలా
  • లాటిన్: మెమొర్డికా చారన్సియా లిన్నెయస్ (Momordica charantia)
  • కుటుంబము: కుకుర్బిటేసి (Curcurbitaceae)

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల కాకరకాయలో ఉండే పోషక విలువల వివరాలు:

  • ప్రోటీన్లు: 1.6 గ్రా
  • శక్తి: 25 కేలరీలు
  • కాల్షియం: 20 మి.లీ
  • ఐరన్: 1.8 గ్రా
  • విటమిన్ - ఎ: 21 I.U
  • విటమిన్ - బి1(థైమిన్): 0.07 మి.గ్రా
  • రైబోఫ్లోవిన్: 0.09 మి.గ్రా
  • నియాసిన్: 0.5 మి.గ్రా
  • విటమిన్ - సి: 88
  • పాస్పరస్: 140 మి.గ్రా
  • క్రొవ్వు: 1 గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మధుమేహము (Diabetes mellitus): కాకరకాయ రసము త్రాగటం వలన పాంక్రియాస్‌లోని (ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హాన్స్) బీటాసెల్స్ బాగా స్టిములేషన్‌కు లోనయి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా మధుమేహం అదుపులో ఉంచబడుతుంది. అయితే ఆహారం యొక్క పరిమితి, వ్యాయామం మొదలైనవి కూడా చాలా అవసరం.
  • దుష్టవ్రణాలు మరియు చర్మ వ్యాధులు: కాకరకాయ రసము మరియు నిమ్మరసము కలిపి 1 చెంచా ప్రతిరోజు పరగడుపున కొద్దిరోజులు వరుసగా సేవించిన చర్మవ్యాధులు మరియు దుష్టవ్రణములు తగ్గుతాయి. కాకరకాయ రసమునకు పసుపు కలిపి పై పూతగా రాసిన దీర్ఘకాలిక వ్రణాలు తగ్గిపోతాయి. దీనితో పాటు చికెన్ పాక్స్ (Chicken pox) వలన ఏర్పడిన మచ్చలు కూడా తొలగిపోతాయి. ఇది సోరియాసిస్ మరియు ఫంగస్ రోగులకు కూడా మంచిది.
  • దగ్గు, అల్సర్ మరియు జాండీస్: కాకరకాయ రసము మరియు తేనెలను కలిపి రోజుకు 2-3 సార్లు త్రాగిన బ్రాంకైటీస్, అల్సర్ రోగుల వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి. ఇది జాండీస్‌లో కూడా మంచిదే.
  • అర్షమొలలు: కాకరకాయ రసము 2 చెంచాలు మజ్జిగ గ్లాస్ (250 మి.లీ) చొప్పున 3 నెలలు సేవించిన అర్షమొలల రోగులకు చక్కని రిలీఫ్ కలుగుతుంది.
  • ఆస్త్మా - గొంతు గరగర: కాకరకాయ వేరును మెత్తగా నూరి అందులో తులసి రసము మరియు తేనె కలిపి ప్రతిరోజు రాత్రిపూట త్రాగించిన ఆస్త్మా, బ్రాంకైటీస్, జలుబు మరియు గొంతుగరగరలు తగ్గుతాయి. కాకరకాయ వేరును మెత్తగా నూరి రాసిన పైల్స్‌మాస్‌లో ఉపయుక్తంగా ఉంటుంది.
  • కాళ్ళు చేతుల మంటలు: కాకర ఆకులరసము రాసిన కాళ్ళు చేతుల మంట తగ్గుతుంది.
  • వేసవిలో వచ్చే విరేచనాలు: కాకర ఆకుల రసము 2 చెంచాలు, నిమ్మరసము 1 చెంచా మరియు తెల్ల ఉల్లిపాయల రసము 1 చెంచా కలిపి ఉదయం, సాయంత్రం త్రాగించిన వేసవిలో వచ్చే విరేచనాలలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
  • జ్వరహరము (ఫెబ్రిఫ్యూజ్ ప్రాపర్టీస్): కాకర పండ్లు సేవించిన జ్వరాలను నిరోధించే గుణము కలిగి ఉంది.
  • కడుపులో క్రిములు: కాకరకాయ రసము లేదా కాకరకాయ కూరగా చేసుకొని సేవించటం వలన కడుపులోని క్రిములు నశిస్తాయి.
  • కీళ్ళజబ్బులు - గౌట్: మరియు లివర్, స్ప్లీన్ రోగులు కాకరకాయ వాడటం ఎంతో ఉపయోగకరం.
  • దెబ్బలు - కాలిన గాయాలు: కాకరకాయ రసము ఆంటిసెప్టిక్ (antiseptic) గుణాలు కలిగి ఉంది. దెబ్బలు తగిలిన చోట దీని రసము రాసిన యెడల ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే కాలిన చర్మముపై కూడా దీనిని రాయవచ్చు. దీనిని ఇంకా పాండు (రక్తహీనత)నందు కూడా వాడుదురు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 388, 389)
  • రచయిత: డా|| టి. భిక్షపతి