కరివేపాకు / Curry Leaves

From LTRC
Revision as of 12:29, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''కరివేపాకు / Curry Leaves''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Plantae |- | '''Division''' | Tracheophyta |- | '''Class''' | Magnoliopsida |- | '''Order''' | Sapindales |- | '''Family''' | Rutaceae |- | '''Genus''' | ''Murraya'' |- | '''Scientific Name''' | ''Murraya koeni...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
కరివేపాకు / Curry Leaves
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Sapindales
Family Rutaceae
Genus Murraya
Scientific Name Murraya koenigii (L.) Spreng.

మన పరిసర ప్రాంతాల్లో అన్నిచోట్లా పెరిగే మొక్క కరివేపాకు. ఆహార పదార్థాలకు సువాసన అందించటానికే కాదు, అన్ని రకములైన ఔషధ విలువలు కలిగినది కరివేపాకు. ఇందులో Koenigin అనే గ్లైకోసైడ్ కూడా ఉంటుంది. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: కరివేపాకు
  • సంస్కృతం: కాలశాక
  • హిందీ: మీఠానీమ్
  • లాటిన్: మురయా కొయినిగిని (Murraya koenigii)
  • కుటుంబము: రూటేసి (Rutaceae)

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల కరివేపాకులో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 66.3 మి.గ్రా
  • ప్రోటీన్లు: 6.1 మి.గ్రా
  • క్రొవ్వు: 1.0
  • కార్బోహైడ్రేట్లు: 16.0 మి.గ్రా
  • ఫైబర్ (నార): 6.4 మి.గ్రా
  • మినరల్స్: 4.2 %
  • కాల్షియం: 810 మి.గ్రా
  • పాస్పరస్: 600 మి.గ్రా
  • ఐరన్: 4 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 12,600 I.U
  • విటమిన్ - సి: 4 మి.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్: 2.3 మి.గ్రా

వీటితో పాటు ఇంకా ఆర్జినిన్, గ్లైసిన్, సిరిన్, ఆస్పార్టిక్ ఆసిడ్, గ్లుటామిక్ ఆసిడ్, థ్రియోనిన్, అలనిన్, ప్రోలిన్, టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఆమైనో బుటరిక్ ఆసిడ్, ఫినైలాలనిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్‌లు ఇందులో ఉన్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • వాంతులు మరియు నాసియా (Morning Sickness): తాజా కరివేపాకురసము 1 స్పూన్, నిమ్మరసం 1 స్పూన్, పంచదార 1 స్పూన్ కలిపి రోజుకు 2 సార్లు ఇచ్చిన వాంతి వచ్చినట్లుండుట (నాసియా), వాంతులు (Vomitings) మరియు వేవిళ్లలో వచ్చు వాంతులు మొదలగువాని యందు ఉపశమనము కలుగును.
  • అర్షమొలలు: లేత కరివేపాకుల రసము మరియు తేనె కలిపి సేవించిన అర్షమొలల్లో ఉపయుక్తంగా ఉంటుంది. కరివేపాకు చూర్ణమును మజ్జిగలో కలిపి త్రాగితిన మలబద్ధకము తొలగి అర్షమొలల రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉండును.
  • జ్వరాలు: కరివేపాకులతో కషాయం కాచి దానిని త్రాగించిన జ్వరాలు ఉపశమిస్తాయి.
  • జీర్ణశక్తికోసము: ధనియాలు, జీలకర్ర, ఎండిన కరివేపాకులను నెయ్యిలో వేయించి దానిని మెత్తగా చూర్ణించి అందులో సైంధవ లవణం కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. దీనిని ఉదయము బ్రేక్‌ఫాస్ట్‌లో మరియు మధ్యాహ్నం, సాయంకాల భోజనంలో వాడినా జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది కలరా రోగులకు కూడా చాలా మంచిది.
  • జలుబు - తుమ్ములు - ఉబ్బసం మరియు దగ్గు: ఈ వ్యాధులతో బాధపడు రోగులు ప్రతిరోజు ఉదయం - సాయంత్రం కరివేపాకు చూర్ణమును (పొడి) వాడిన చక్కని ఉపశమనము కలుగుతుంది.
  • చెమట దుర్గంధం - దుర్వాసన: కరివేపాకు వేడిని కలిగిస్తుంది, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. దీని చూర్ణమును ఆహారంలో సేవించటం వలన చెమట వలన కలిగే చెడువాసన తగ్గుతుంది.
  • అమీబియాసిస్ మరియు డీసెంట్రీ: కరివేపాకు పొడి మరియు తేనె కలిపి వాడినా అమీబియాసిస్ మరియు డీసెంట్రీ రోగులకు ఉపశమనము కలుగుతుంది.
  • కడుపుబ్బరం - కడుపులో మంట: కడుపుబ్బరం, కడుపులో మంటతో బాధపడే వ్యక్తులు కరివేపాకును ఎండించి చూర్ణము చేసుకొని దానిని మజ్జిగతో కలిపి సేవించిన ఈ ఇబ్బందులు తొలగిపోతాయి.
  • డయాబెటీస్ రాకుండా ఉండాలంటే: చక్కని వ్యాయామము, ఆహారనియమాలు పాటిస్తూ రోజుకు 8-10 కరివేపాకు ఆకులను 3 నెలల వరకు తిన్న యెడల మధుమేహం రాకుండా నిరోధించబడుతుంది.
  • క్యాటరాక్ట్ తొందరగా రాకుండా ఉండాలంటే: తాజా కరివేపాకుల రసమును కళ్ళలో చుక్కల మందులాగ వాడిన యెడల చక్కని కంటిచూపు మన సొంతమౌతుంది. క్యాటరాక్ట్ తొందరగా రాకుండా ఉంటుంది.
  • విష క్రిములు కుడితే: కరివేపాకు పళ్ళను నిమ్మరసంలో కలిపి నూరి విషక్రిములు కుట్టిన చోట రాసిన బాధ నివారించబడుతుంది. గజ్జి, దద్దుర్లలో కూడా ఉపశమనము కలుగుతుంది.
  • అధిక రక్తపోటు ఉపద్రవాలు: కరివేపాకు పళ్ళను లేదా కరివేపాకు బెరడును కషాయంగా కాచి సేవిస్తే అధిక రక్తపోటు వలన వచ్చే రుగ్మతలు నివారించబడతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 381, 382, 383)
  • రచయిత: డా|| టి. భిక్షపతి