ఉలవలు / Horse Gram

From LTRC
Revision as of 10:20, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''ఉలవలు / Horse Gram''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Plantae |- | '''Division''' | Tracheophyta |- | '''Class''' | Magnoliopsida |- | '''Order''' | Fabales |- | '''Family''' | Fabaceae |- | '''Genus''' | ''Macrotyloma'' / ''Dolichos'' |- | '''Scientific Name''' | ''Dolichos bi...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ఉలవలు / Horse Gram
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Fabales
Family Fabaceae
Genus Macrotyloma / Dolichos
Scientific Name Dolichos biflorus L.

భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉలవలను పండిస్తున్నారు. ఉలవలు చాలా బలకరమైన ఆహారం. తెలుగువారికి ఉలవచారంటే చాలా ఇష్టం. ఉలవలు కషాయరసము, ఉష్ణవీర్యము, లఘురూక్ష గుణములు మరియు కటువిపాకమును కలిగి ఉంటాయి. ఉలవలు వాతహరము, మేదోహరము, శుక్రహరము, విదాహిఫకరము, స్వేద సంగ్రాహ కర్మలను కలిగి ఉన్నాయి. వీటిని మూత్రంలో రాళ్ళు, ఆస్త్మా, దగ్గు, ఎక్కిళ్ళు, క్రిములు, జ్వరం మరియు జలుబు రోగాల్లో విరివిగా ఉపయోగిస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఉలవలు
  • సంస్కృతం: కులుద్ధ
  • హిందీ: కులథీ
  • లాటిన్: డాలిక్స్ బ్లైఫ్లోరస్ లిన్నెయస్ (Dolichos biflorus)
  • కుటుంబము: Fabaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల ఉలవల్లో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 11.8%
  • ప్రోటీన్లు: 22.0 మి.గ్రా
  • క్రొవ్వు: 5 మి.గ్రా
  • ఇనుము (ఐరన్): 7.6 మి.గ్రా
  • నికోటినిక్ ఆమ్లము: 1.5 మి.గ్రా
  • కెరోటిన్: 119 I.U
  • మినరల్స్: 3.1 మి.గ్రా
  • కార్బోహైడ్రేట్లు: 57.3 మి.గ్రా
  • కాల్షియం: 0.25 మి.గ్రా
  • పాస్పరస్: 0.39 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీరపుష్టికి: ఉలవలు సేవించిన శక్తి మరియు పుష్టి కలుగుతుంది.
  • మూత్రపిండాల్లో రాళ్ళు: ఉలవల కషాయం సేవించిన మూత్ర పిండాల్లో రాళ్ళు తగ్గుతాయి. ఉలవలు, గోక్షుర మరియు వరుణలను కలిపి సేవించిన ప్రొస్టేట్ గ్రంధివాపునందు హితంగా ఉండును.
  • వాపులు: ఉలవల కషాయము దోసకాయ రసము మరియు కొబ్బరి నీళ్ళు కలిపి త్రాగిన మూత్రం సాఫీగా అవుతుంది. మూత్రంలో మంట తగ్గుతుంది. వాపు తగ్గుతుంది. గుండె జబ్బుల వలన వచ్చే వాపుల్లో ఇవి ఉపయోగకరం.
  • గడ్డలు / పుండ్లు: ఉలవ ఆకులు మరియు పసుపు కలిపి గడ్డలు మరియు పుండ్లు ఉన్న భాగంలో రాసిన గడ్డలు, పుండ్లు తగ్గుతాయి.
  • అతిసారము, జిగురు విరేచనాలు: ఉలవ ఆకులు, ఆపిల్ జ్యూస్ మరియు కొద్దిగా పండిన అరటిపండు కలిపి తినిపించిన అతిసారము, జిగురు విరేచనాలు తగ్గుతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 369, 370)
  • రచయిత: డా|| టి. భిక్షపతి