ఈతచెట్టు / ఈతపండు / Phalsa

From LTRC
Revision as of 10:14, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''ఈతచెట్టు / ఈతపండు / Phalsa''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Plantae |- | '''Division''' | Tracheophyta |- | '''Class''' | Magnoliopsida |- | '''Order''' | Malvales |- | '''Family''' | Tiliaceae |- | '''Genus''' | ''Grewia'' |- | '''Scientific Name''' | ''Gre...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ఈతచెట్టు / ఈతపండు / Phalsa
Scientific Classification
Kingdom Plantae
Division Tracheophyta
Class Magnoliopsida
Order Malvales
Family Tiliaceae
Genus Grewia
Scientific Name Grewia asiatica L.

ఈత చెట్లు అన్నిచోట్లా పెరుగుతాయి. మన పల్లెల్లో పంట పొలాల గట్లమీద, రోడ్ల ప్రక్కన మరియు ఖాళీ ప్రదేశాలలో ఈతచెట్లు కనబడతాయి. ఈతపండ్లు చిన్నగా ఉన్న చాలా రుచిగా ఉంటాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: ఈతపండు
  • సంస్కృతం: పరూషిక భేదము
  • హిందీ: ఫాల్సా
  • లాటిన్: గ్రేవియా ఏసియాటికా లిన్నెయస్ (Grewia asiatica)
  • కుటుంబము: Tiliaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల ఈతపండ్లలో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 59.2%
  • ప్రోటీన్లు: 1.2%
  • క్రొవ్వు: 0.4%
  • కార్బోహైడ్రేట్లు: 33.8%
  • ఫైబర్ (నార): 3.7%
  • మినరల్ మేటర్: 1.7%
  • కాల్షియం: 0.022 మి.గ్రా
  • పాస్ఫరస్: 0.38 మి.గ్రా

ఇది మధురరసము, శీతవీర్యము, లఘుస్నిగ్ధ గుణము, మధురవిపాకములను కలిగి ఉంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • పంటినొప్పి: ఈతచెట్టు వేళ్లను కషాయంగా కాచి పుక్కిట పట్టి ఊచేసిన పంటినొప్పి తగ్గుతుంది.
  • వీర్యపుష్టి & బలం: ఈతపళ్ళు వీర్యపుష్టిని కలిగిస్తాయి. క్షయరోగతులకు ఉపయుక్తంగా ఉంటాయి.
  • రక్త దోషాలు: ఈతపళ్ళు దప్పికను తీరుస్తాయి. రక్త దోషాలు ఉపశమించడానికి తోడ్పడతాయి.
  • యాంటీ బాక్టీరియల్ గుణాలు: చిట్టీత యొక్క Ether extract నాకు Anti-Staphylococcus & E-coli నిరోధక గుణాలు కలిగి ఉంది.

నీరా మరియు ఈతకల్లు

నీరా (Neera)

ఈతచెట్టునుండి “నీరా” అనే అతి చక్కటి స్వీట్ డ్రింక్ తీస్తారు. ఇందులో విటమిన్ - బి, ఆస్కార్బిక్ యాసిడ్స్ ఎక్కువ పాళ్లలో ఉన్నాయి. అయితే దీనిని సూర్యోదయానికి ముందే త్రాగాలి. సూర్యోదయం అయితే అది పులిసిపోయి పుల్లగా అవుతుంది.

ఈతకల్లు (Toddy / Taddy)

నీరా పులిసిన ద్రవాన్ని కల్లు లేక Toddy అంటారు.

  • పోషకాలు & కాంపౌండ్స్: దీనిలో రైబోఫ్లేవిన్ ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు పాస్ఫరస్, నైట్రోజన్, గ్లిసరాలో, ఆష్, సుక్రోజ్, రెడ్డి సుగర్, యాసిడ్ మరియు ఆల్కహాల్‌లు కూడా కలవు.
  • హెచ్చరిక: అదే పనిగా కల్లు త్రాగటం ఆరోగ్యానికి మంచిదికాదు. అతి ఎప్పుడూ అనర్థదాయకమే!

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 365, 366)
  • రచయిత: డా|| టి. భిక్షపతి