అల్లము (Ginger)

From LTRC
Revision as of 12:30, 21 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin-left: 1em; width: 300px; font-size: 90%;" |+ style="background: #2e7d32; color: white; padding: 5px; font-size: 110%; font-weight: bold;" | అల్లము (Ginger) |- | colspan="2" style="text-align: center;" | '''శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification)''' |- | '''రాజ్యము (Kingdom):''' || Plantae |- | '''విభాగము (Division):''' || Tracheophyta |- | '''...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
అల్లము (Ginger)
శాస్త్రీయ వర్గీకరణ (Scientific Classification)
రాజ్యము (Kingdom): Plantae
విభాగము (Division): Tracheophyta
తరగతి (Class): Liliopsida
క్రమము (Order): Zingiberales
కుటుంబము (Family): Zingiberaceae
ప్రజాతి (Genus): Zingiber
శాస్త్రీయ నామం: Zingiber officinale

అల్లము (Ginger) అనేది అల్లం (Zingiberaceae) కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన దుంప మొక్క. దీని శాస్త్రీయ నామం జింజిబర్ ఆఫిసినాల్ రోస్కో (Zingiber officinale). ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా సాగుచేసే ఈ మొక్క నాలుకను తడిగా ఉంచుతుంది. అల్లం అపారమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నందున దీనిని "విశ్వభేషజం" అని కూడా పిలుస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: అల్లము
  • సంస్కృతం: ఆర్ద్రక
  • హిందీ: ఆద్రక్
  • లాటిన్: జింజిబర్ ఆఫిసినాల్ రోస్కో (Zingiber officinale)
  • కుటుంబము: Zingiberaceae

పోషక విలువలు

అల్లంలో అయోడిన్, ఫ్లోరిన్‌లతో పాటు గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లు కూడా ఉంటాయి.

ప్రతి 100 గ్రాముల అల్లంలో ఉండే పోషకాలు:

  • తేమ: 8.9 మి.గ్రా
  • ప్రోటీను: 2.3 మి.గ్రా
  • క్రొవ్వు: 0.9 మి.గ్రా
  • ఫైబర్ (నార): 2.4 మి.గ్రా
  • కార్బోహైడ్రేట్లు: 12.3 మి.గ్రా
  • మినరల్స్: 1.2 %
  • క్యాల్షియం: 60 మి.గ్రా
  • ఇనుము: 2.6 మి.గ్రా
  • రైబోఫ్లేవిన్: 0.03 మి.గ్రా
  • థైమిన్: 0.06 మి.గ్రా
  • కెరోటిన్: 40 మైక్రోగ్రాములు

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • గుణాలు: అల్లం కటురసము, గురురూక్ష తీక్ష్ణ గుణములు, మధుర విపాకము మరియు ఉష్ణవీర్య గుణాలను కలిగి ఉంటుంది. ఇది వాతకఫ హరము, దీపనము, భేదనము అనే చర్యలను కలిగి ఉంటుంది. దీనికి యాంటి హిస్టమిన్, యాంటి డిప్రసెంట్ మరియు ప్రోటియోలైటిక్ గుణాలు ఉన్నాయి.
  • అజీర్తి & కడుపుబ్బరం: అల్లమును ఆహారంలో ఉపయోగించడం వలన కడుపుబ్బరం తగ్గుతుంది. జీలకర్ర, సైంధవ లవణాలను అల్లం ముక్కలతో కలిపి 2-3 గ్రాములు ఉదయం-సాయంత్రం తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
  • శీతపిత్తం (దద్దుర్లు): అల్లము రసం, పాలు, బెల్లం కలిపి సేవిస్తే దద్దుర్లు తగ్గిపోతాయి.
  • ఉదర రోగాలు: అల్లము రసము మరియు పాలను సమాన భాగాలుగా కలిపి సేవిస్తే ఉదర రోగాలు తగ్గుతాయి. లేదా తైలమునకు పదిరెట్లు అల్లపురసము కలిపి తైలపాక విధిని తయారుచేసుకొని వాడవచ్చు.
  • శ్వాస (Asthma), కాస (Cough): అల్లపురసం మరియు తేనె కలిపి సేవిస్తే ఉబ్బసం, దగ్గు మరియు జలుబు తగ్గుతాయి. ఇది కఫమును హరిస్తుంది.
  • మధుమేహం (Diabetes): అల్లము రసము మధుమేహ వ్యాధి లక్షణాలను తగ్గించి, Hypoglycemic (రక్తంలో చక్కర శాతాన్ని తగ్గించే) గుణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో గమనించారు.
  • చెవి నొప్పి: అల్లము రసమును వేడిచేసి చెవిలో వేసిన చెవి పోటు తగ్గుతుంది.
  • కామెర్లు (Jaundice): అల్లము ముక్కలను బెల్లంతో కలిపి 7 రోజులు ఉదయమే సేవిస్తే కామెర్లు తగ్గును. దీనికి ముందు త్రిఫలా చూర్ణమును తేనె కలిపి ప్రతి సాయంత్రం సేవించడం ఉపయుక్తంగా ఉంటుంది. (ఈ సమయంలో ఆహారంలో క్రొవ్వు పదార్థాలు, కారం, మసాలా దినుసులు వాడరాదు).
  • అధిక రక్తపోటు (High BP): కాచి చల్లార్చిన నీటియందు అల్లము రసము, తేనె కలిపి ప్రతిరోజు ఉదయమున సేవిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • శొంఠి తయారీ: అల్లము పైన ఉండే పొట్టు తీసివేసి నీటితో కడిగి 8-12 రోజులు ఎండలో పెట్టి, తెలుపు రంగు కోసం ఒకరోజు సున్నము నీటిలో ఉంచి తిరిగి ఎండబెడితే శొంఠి అవుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 347, 348)
  • రచయిత: డా|| టి. భిక్షపతి
  • ఆధార గ్రంథం: నిఘంటువుల నుండి ద్రవ్యగుణ ప్రయోగ విజ్ఞానము (డా|| నిష్పేశ్వర్. కె)