బెండకాయ / Lady's Finger

From LTRC
Revision as of 07:47, 11 September 2026 by Abhinaya (talk | contribs) (→మూలాలు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
బెండకాయ / Lady's Finger
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Malvales
Family Malvaceae
Genus Abelmoschus
Scientific Name / Latin Name Abelmoschus esculentus (L.) Moench

బెండకాయను చాలా దేశాల్లో సాగుచేస్తున్నారు. అందమైన ఆడవాళ్ళ చేతివేళ్ళలాగ ఇవి ఉంటాయి కాబట్టి లేడీస్ ఫింగర్ అంటారు. జిగటగా కొద్దిగా తియ్యగా ఉండే బెండకాయను భారతదేశమంతటా సాగుచేస్తున్నారు. బెండకాయ కూర రుచిగా ఉంటుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : భేట్టి / భిండా ;
  • హిందీ : బెందీ ;
  • తెలుగు : బెండకాయ ;
  • లాటిన్ : ఎబెల్ మెశ్చీన్ ఎస్క్యెలెంటస్ / ఎవిసకస్ ఎస్క్యెలెంటస్ ;
  • ఇంగ్లీష్ : లేడీస్ ఫింగర్ ;
  • కుటుంబము : Malvaceae ;

పోషక విలువలు

బెండకాయ యందు (ప్రతి 100 గ్రాములకు):

  • ప్రొటీన్లు : 6.9 గ్రా
  • కార్బోహైడ్రేట్లు : 7.3 గ్రా
  • క్రొవ్వు : 0.4 గ్రా
  • ఫైబర్ : 1.2 గ్రా
  • కాల్షియం : 88 మి.గ్రా
  • మెగ్నీషియం : 43 మి.గ్రా
  • కాఫర్ : 0.19 మి.గ్రా
  • సల్ఫర్ : 30 మి.గ్రా
  • పాస్పరస్ : 56 మి.గ్రా
  • సోడియం : 54మి.గ్రా
  • పొటాషియం : 323 మి.గ్రా
  • ఐరన్ : 1.4 మి.గ్రా
  • ఖనిజలవణములు : 0.7 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 88 I.U
  • విటమిన్ - బి 1 : 61 మి.గ్రా
  • విటమిన్ - సి : 14 మి.గ్రా
  • ఆగ్జాలిక్ ఆసిడ్ : 10.3 మై.గ్రా
  • నికోటినిక్ ఆసిడ్ : 0.6 మి.గ్రా ల పోషక విలువలను కలిగి ఉంది.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • సాధారణ గుణాలు: బెండకాయ వాత కఫములను పెంచును చలువచేస్తుంది. ఎక్కువ తింటే మలబద్ధకము చేస్తుంది. లేత బెండకాయ వాతహరము. బెండకాయ కూర సేవించడం వలన శీఘ్రస్కలనాన్ని నిరోధించబడుతుంది.
  • జీర్ణకోశ సమస్యలు & మ్యూసిలేజ్: బెండకాయలోని జిగురు (మూసిలేజ్) ప్లాస్మా రిప్లేస్మెంట్గా పనిచేస్తుంది. ఇది డయూరియా, గ్యాస్ట్రిక్ అల్సర్ మరియు జిగురు విరేచనాలందు ఉపయుక్తంగా ఉంటుంది.
  • వివిధ వ్యాధుల నివారణ: లేత బెండకాయ జిగురునందు అరటిపండు మరియు 250 మి.లీ మజ్జిగ కలిపి రోజుకు 3 సార్లు త్రాగించిన కామెర్లు, గనేరియా, టైపాయిడ్, అతిసారము జిగురు విరేచనాలు మరియు గర్భిణీస్త్రీలకు టానిక్లాగా పనిచేస్తుంది.
  • స్త్రీల వ్యాధులు: బెండకాయ సేవనము స్త్రీల వ్యాధులలో ఎంతో ఉపయోగకరం.
  • ప్రతికూలతలు: బెండకాయ / బెండకాయ జిగురు ఎక్కువగా తిన్న యెడల అజీర్ణము కలుగుతుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • బెండకాయ ఎక్కువగా తింటే మలబద్ధకము చేస్తుంది.
  • బెండకాయ జిగురు ఎక్కువగా తిన్న యెడల అజీర్ణము కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 541-542) - రచయిత: డా|| టి. భిక్షపతి