మామిడి / Mango

From LTRC
Revision as of 07:42, 11 September 2026 by Abhinaya (talk | contribs) (→మూలాలు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
మామిడి / Mango
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Sapindales
Family Anacardiaceae
Genus Mangifera
Scientific Name / Latin Name Mangifera indica L.

పచ్చటి మామిడి తోరణాలు పరిసరాలకు వింతశోభను పవిత్రతను తెచ్చిపెడతాయి. శుభకార్యాలకు సాక్షిగా నిలుస్తాయి. మామిడి కాయలతో సంవత్సరం వరకు నిలవ ఉండే పచ్చళ్ళుపెట్టుకుంటారు. మామిడి పళ్ళతో జ్యూస్, జామ్ స్కాష్ జెల్లీలు, తయారుచేస్తారు. "తాజా పళ్ళలో రాజా ఎవరండీ ఇంకా చెప్పాలా మామిడేనండి" ఆహా ఏమి రుచి తినరా మైమరచి మామిడి కషాయరసము, శీతవీర్యము లఘురూక్ష గుణము మరియు కటువిపాకములను గుణములు కలిగి ఉంది. పండిన మామిడి యందు మధురరసము, మామిడి కాయ యందు ఆమ్లరసము, ప్రధానంగా ఉంటుంది. మామిడి వాతహరము. కఫపిత్తశామకము హృద్యము, గ్రాహి మొదలగు కర్మలను కలిగి ఉంది. మామిడిని అధికరక్తస్రావము జరుగు రక్త ప్రదరమునందు గుండెజబ్బులందు, వాంతులందు, అతిసారము మరియు ప్రమేహము లందు వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : ఆమ్ర ;
  • హిందీ : ఆమ్ ;
  • తెలుగు : మామిడి ;
  • లాటిన్ : మాంగి ఫెరా ఇండికాలిన్యైస్ ;
  • కుటుంబము : Anacardiaeal ;
  • ఆంగ్లం : Mango *(పుస్తక పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల తాజా మామిడి పండ్ల యందు:

  • తేమ : 90 గ్రా
  • ప్రొటీన్లు : 0.7 గ్రా
  • క్రొవ్వు : 0.1 గ్రా
  • కార్బోహైడ్రేట్లు : 12 గ్రా
  • మినరల్ మేటర్ : 0.4 గ్రా
  • ఐరన్ : 0.8 మి.గ్రా
  • కాల్షియం : 17 మి.గ్రా
  • పాస్పరస్ : 20 మి.గ్రా
  • పొటాషియం : 250 మి.గ్రా
  • సోడియం : 7 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 22,500 I.U
  • విటమిన్ - బి1 : 155 మై.గ్రా
  • విటమిన్ - బి2 : 30 మై.గ్రా
  • విటమిన్- సి : 150మి.గ్రా
  • నియాసిన్ : 150 మి.గ్రా
  • కేలరీలు : 50 కలవు.

ఇందులో కలవు. తీపి పులుపు కలయికలో ఉండేమామిడి పండ్లలో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్ లుకలవు. మామిడి కాయల యందు సిట్రిక్ఆసిడ్, మాలిక్ఆసిడ్, సక్సినిక్ఆసిడ్లు కలవు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులోఉన్నాయి. పచ్చి మామిడి కాయ తినటం వలన ఏ పందులో లేనంత విటమిన్ సి ఇందులో లభ్యమౌతుంది. ఇది మామిడి ప్రత్యేకత.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మామిడి ఆకులు మరియు పువ్వుల ఉపయోగాలు: మామిడికాయ ఆకుల్లో కూడ పోషకవిలువలున్నాయి. అందుకే నేమో జావా, ఫిలిపైన్స్ దీవులలో ప్రజలు లేత మామిడి ఆకులను కూరగా పులుసుగా చేసుకొని భుజిస్తారు. మామిడి పువ్వు (పూత)ను అతిసారము మరియు ప్రవాహిక (జిగురు విరేచనాలు) వ్యాధులలో ఔషధంగా ఉపయోగిస్తారు. మామిడి ఆకులను నమలటం వలన చిగురు నుండి రక్తం కారటము, నాలుకపై పుండ్లు రావటము మొదలగునవి నివారించబడతాయి. మామిడి త్వక్కు (బెర్డు) నందు టానిన్స్ ఎక్కువ. దీనిని కషాయముతో డూಷ್ ఇచ్చిన స్త్రీలకు వచ్చే తెల్లబట్టు (ల్యూకోరియా) తగ్గుతుంది.
  • బెర్డు మరియు చిగురు యొక్క గుణాలు: మామిడి బెరడు ను కషాయంగా కాచి డిప్థీరియా మరియు కీళ్ళ జబ్బులో వాడిన వ్యాధి లక్షణాలు తగ్గిపోతాయి. మామిడి చిగురును కాళ్ళు పగిలిన చోట గజ్జి, సిఫిలిస్ లాంటి వ్యాధులలో ఉపయోగించిన వ్యాధి లక్షణాలు తగ్గితాయి. మామిడి ఆకులు, బెరడు మరియు పచ్చిపాయలకు యాంటీబాక్టీరియాలు, మరియు యాంటీ ఫంగల్ గుణాలున్నట్లు పరిశోధనలో గమనించారు.
  • మామిడి గింజలు మరియు రసం యొక్క ఉపయోగాలు: బాగా ముదిరిన మామిడికాయ అందులోని లేత గింజ (జీడి) నందు కొద్దిగా ఉప్పు మరియు తేనే కలిపి తిన్న యెడల వేసవిలో వచ్చే అతిసారము, జిగురువిరేచనాలు అర్శమోసులు, మార్నింగ్ సిక్నెస్, అజీర్ణము మరియు మలబద్ధతలకు చక్కని ఔషధము. మామిడిలో ఉన్న ఆసిడ్ బైల్ యొక్క స్రావాలను ఎక్కువ చేసి ఇంటెస్టినల్ యాంటి సెప్టిక్గా పనిచేస్తాయి. గ్లాస్ మామిడి పండ్ల రసము నందు తేనె పాలు కలిపి త్రాగిన చక్కని బలవర్ధకమైన టానిక్లా పనిచేస్తుంది. ఇది ప్రతిరోజు త్రాగిన చక్కగా నిద్రపడుతుంది. నరాలజబ్బులు కయమవతాయి. రక్తహీనత తొలుగుతుంది. లివర్, గుండె మరియు ప్రేగులకు బలము చేకూరుతుంది.
  • ఆరోగ్య సంరక్షణ మరియు నివారణా చర్యలు: పచ్చిమామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలకు సాగే గుణాలను కల్పించి క్రొత్తరక్తకణాలు జనించటానికి సహకరిస్తుంది ఇది ఆహారం మరియు ఐరన్ యొక్క ఆబ్సార్ప్షన్కు సహకరిస్తుంది. రక్తస్రావము లాంటి వాటిని నిరోధిస్తుంది. స్క类似ర్వీలాంటి వ్యాధులలో ఉపయోగకరము. పచ్చి మామిడికాయను వేడి బూడిదలో ఉడికించి దానిని తిన్నయెడల వడదెబ్బనుండి రక్షణ కలుగుతుంది. మామిడి పళ్ళరసము మరియు క్యాారెట్ జ్యూసులను సమంగా తీసుకొని ప్రతిరోజు రెండుసార్లు త్రాగిన మూత్రపిండాల్లో రాళ్ళు చేరకుండా ఉంటాయి. మామిడి నిత్యం సేవించటం వలన విటమిన్ ఎ,బి,సి లు తక్కువయ్రై వచ్చే జబ్బులు నివారించబడతాయి.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • మామిడి కాయలతో చేసే పచ్చళ్ళు అధికరక్తపోటు అర్శమోసులు రోగుల తినకూడదు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 562-563) - రచయిత: డా|| టి. భిక్షపతి