మిరియాలు / Black Pepper
From LTRC
| మిరియాలు / Black Pepper | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Piperales |
| Family | Piperaceae |
| Genus | Piper |
| Scientific Name / Latin Name | Piper nigrum L. |
విషమును నశింపచేయును కాబట్టి దీనిని మరిచం (మిరియాలు) అంటారు. ఈ మొక్కను కేరళ ప్రాంతములో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖలాంటి ప్రాంతాలలో పెంచుతున్నారు. మిరియాలు కటుతీక్షముగా ఉంటుంది. మిరియాలను గుండెజబ్బులు, దగ్గు, కృశించిపోయిన శరీరూలకు జిగురు విరేచనాలతో బాధపగురోగలుకు, ఎముకలకువిరిగిన రోగులకు, జ్వరము అగ్నిమాంద్యము, మూత్రంలో అల్బుమిన్ ఎక్కువగా విసర్జించే రోగులందు వాడుదురు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : మరీచము ;
- హిందీ : కాలీమిర్చ్ ;
- తెలుగు : మిరియాలు ;
- లాటిన్ : పైపర్ నైగ్రామ్ లిన్నెయస్ ;
- కుటుంబము : Piperecae ;
- ఆంగ్లం : Black Pepper *(పుస్తక పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల మిరియాలందు:
- ప్రొటీన్లు : 11.5 గ్రా
- క్రొవ్వు : 8.8 గ్రా
- కార్బోహైడ్రేట్లు : 49.2 గ్రా
- మినరల్ మేటర్ : 4.4%
- నార (ఫైబర్) : 14.9 మి.గ్రా
- కాల్షియం : 460 మి.గ్రా
- పాస్పరస్ : 198 మి.గ్రా
- ఇనుము : 16.8 మి.గ్రా
- థైమిన్ (విటమిన్ బి1) : 0.09 మి.గ్రా
- రైబోఫ్లేవిన్ : 0.14 మి.గ్రా
- నికోటినిక్ ఆమ్లము : 104 మి.గ్రా
- విటమిన్ - ఎ : 1800 I.U
- విటమిన్ - సి : 25 మి.గ్రా
- నియాసిన్ : 1.8 మి.గ్రా కలవు.
మిరియాల యందు అల్కాయిడ్స్ పైపరిన్, పైపరిడిన్, చవిసిన్ లతోపాటు ఎసెన్షియల్ ఆయిల్ కూడా కలదు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- జిగురువిరేచనాలు & కలరా: చాలా కాలము నుండి ఇబ్బంది పెట్టె జిగురువిరేచనాల యందు మిరియాల చూర్ణమును తిన్నయెడల ఈ వ్యాధి తగ్గుతుంది. అలాగే కలరా వ్యాధి యందు కూడా మిరియాల చూర్ణము ఎంతొ ఉపయుక్తంగా ఉంటుంది.
- అల్బుమిన్: మూత్రంలో అల్బుమిన్ విసర్జిస్తున్న రోగులు మిరియాల పొడిని తినటం ద్వారా దీనిని నిరోధించవచ్చు.
- బక్కపలుచని బలహీనులు: ప్రతిరోజు 10 మిరియాలను తములపాకులో కలిపి 2 నెలలు తిన్నయెడల అతి బక్కపలచిన వారు చక్కని ఆరోగ్యాన్ని పొందుతారు.
- గొంతుగరగర మరియు జలుబు: గొంతు బొంగురుపోయి గొంతు గరగర లాడుతున్న రోగులు పాలలో మిరియాలను చిటికకొట్టి బాగాగా కాచి దానిని త్రాగిన గొంతునొప్పి గొంతుగరగర తగ్గుతుంది. మిరియాలు మరియు పసుపు కలిపి రోజుకు ఒక్కసారి 3 రోజులు త్రాగిన జలుబు తొలుగుతుంది.
- హృద్రోగము & కిడ్నీవ్యాధులు: మిరియాల చూర్ణము నందు గుడూచి(తిప్పతీగె) చూర్ణాన్ని కలిపి వేడి నీటితో వాడిన హృద్రోగ శమిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. మిరియాల చూర్ణమును ప్రతినిత్యం తినటం వలన కిడ్నీలు ఉత్తేజితమై మూత్రాన్ని చక్కగా సాఫీగా అవుతుంది.
- మలేరియా & రోగనిరోధక శక్తి: మూత్రాన్ని సేవించడవలన మలేరియా వ్యాధి నివారించబడతాయి. రోగనిరోధకశక్తి కోసం: - త్రికటు (శుంటి మిరియాలు పిప్పళీ) చూర్ణమును తినటం వలన జలుబు, దగ్గు అజీర్ణము తగ్గుతాయి. వీటిని తినటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి పెరుగుతుంది. తలత్రిప్పటం తగ్గుతుంది.
- అర్శమోసులు & జీర్ణశక్తికోసం: మిరియాలను సోపును కలిపి మెత్తగా నూరి దానికి తేనె కలిపి తినటం వలన అర్శమోసులు తగ్గుతాయి. మిరియాలు, ధనియాలు, జీలకర్ర మరియు చింతపండులను కలిపి తయారుచేసిన చారు రుచిగా ఉంటుంది. ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. విరేచనం సాఫీగా అవుతుంది.
- సైనస్ & పంటినొప్పి: మిరియాలు పంచదార తేనె నెయ్యి కలిపి తిన్న యెడల దగ్గు జలుబుతో పాటు సైనస్ వ్యాధిలో చక్కని ఉపశమనము కలుగుతుంది. మిరియాల పొడిలో ఉప్పుకలిపి నొప్పి ఉన్నచోట పెట్టటం వలన పంటినొప్పి తగ్గుతుంది.
- కీళ్ళజబ్బులు: ప్రతిరోజు మిరియాలను తినటం వలన జీర్ణక్రియ బావుంటుంది. విరేచనం సాఫీగా అవుతుంది. అనేక రకాల కీళ్ళజబ్బులు నివారించబడతాయి. మిరియాల చూర్ణము నందు నువ్వుల నూనె కలిపి బాగుగా వేడి చేసి దానిని కీళ్ళనొప్పులు మరియు కండరాల నొప్పులున్నచోట మర్దనచేస్తే నొప్పులు తగ్గిపోతాయి. ఇది పేనుకొరుకుడు, పక్షవాతము, తలనొప్పి లాంటి జబ్బులందు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 564-565) - రచయిత: డా|| టి. భిక్షపతి
