మాదీఫలము / Citron

From LTRC
Revision as of 07:41, 11 September 2026 by Abhinaya (talk | contribs) (→మూలాలు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
మాదీఫలము / Citron
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Sapindales
Family Rutaceae
Genus Citrus
Scientific Name / Latin Name Citrus medica

మాదీఫలము (Citrus medica) అనేది రూటేసి (Rutaceae) కుటుంబానికి చెందినది. ఇది సుమారు నాలుగు మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షము. దీని ఫలాలు మధుర ఆమ్లరసము కలిగి ఉండి, వివిధ ఆయుర్వేద మరియు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : మాయలుంగా
  • హిందీ : తురంజ్ / బీజార
  • తెలుగు : మాదీఫలము
  • లాటిన్ : సిట్రస్ మెడికా లిన్నೆಯెస్‌
  • కుటుంబము : Rutaceae
  • ఇంగ్లీష్ : Citron

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల మాదీఫలము నందు లభించే పోషక విలువలు:

  • ప్రొటీన్లు: 11 గ్రా
  • కార్బోహైడేట్లు: 11 గ్రా
  • క్రొవ్వు: 0.9 గ్రా
  • ఐరన్: 2.3 మి.గ్రా
  • కాల్షియం: 70 మి.గ్రా
  • భాస్వరస్: 10 మి.గ్రా
  • విటమిన్ - బి1: 20 మై.గ్రా
  • విటమిన్ - బి2: 4 మై.గ్రా
  • విటమిన్ - సి: 40 మి.గ్రా
  • మరియు విటమిన్ ఎ కొద్ది శాతములో కలవు. మాదీఫలము యొక్క తొక్కల (పై చర్మము) యందు లైమోనిన్, డిపెంటిన్ మరియు సిట್ರಾಲ್ లు కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • వాంతులు మరియు వికారము: మాదీఫల రసాయనము అను సిరఫ్‌ను మార్నింగ్ సిక్‌నెస్, వికారము, వాంతులు, వాంతి వచ్చినట్లుండుట, తలతిరుగుట లాంటి లక్షణము లందు ఉపయోగిస్తారు.
  • ఆకలి మరియు జీర్ణ సమస్యలు: మాదీఫలము నందు తేనె కొద్దిగా ఉప్పు కలిపి త్రాగిన ఆకలి లేకపోవటము, వాంతులు, తలతి్రిస్పూట తగ్గుతుంది. కడుపుబ్బరం తొలుగుతుంది.
  • గుండె మరియు ఇతర ఆరోగ్య సమస్యలు: గుండెదడ తగ్గుతుంది. మరియు ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ తగ్గుతుంది. దీనిని ప్రతిరోజు సేవించడం వలన మధుమేహము మరియు మూత్రశ్చరీ రోగాలు నివారించబడతాయి.
  • మద్యం ప్రభావం: మాదీఫల రసాయనము అధిక మద్యసేవనము వలన కలిగే బాధలను నివారిస్తుంది.
  • తేలు కుట్టు మరియు న్యుమోనియా/బుతుదోషాలు: మాదీఫలము గింజలను మెత్తగా నూరి తేలు కుట్టిన చోటపెట్టిన మంట పోటు తగ్గుతుంది. దీని గింజలు తేనె మరియు ఉప్పు కలిపి రోజుకు 2-3 గ్రాములు చొప్పున ఇచ్చిన బుతుదోషాలు తొలుగును.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • ఉష్ణవీర్యము మరియు ఆమ్లవిపాకములను కలిగి ఉంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 566-567) - రచయిత: డా|| టి. భిక్షపతి