మెంతులు / Fenugreek
From LTRC
| మెంతులు / Fenugreek | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Fabaceae |
| Genus | Trigonella |
| Scientific Name / Latin Name | Trigonella foenum-graecum L. |
మెంతులు (Trigonella foenum-graecum) ఫాబేసి (Fabaceae) కుటుంబానికి చెందినది. మెంతికూర / మెంతి గింజల కోసం దీనిని భారతదేశమంతటా సాగుచేస్తున్నారు. మెంతి ఆహారంగా, ఔషధంగా అనేక విలువలను కలిగి ఉంది. మెంతి కటురసము ఉష్ణవీర్యము లఘుస్నిగ్ధ గుణము కటువిపాకములను కలిగి ఉంది. మెంతి దీపనము కఫవాతశామకము మరియు అనే కర్ణలను కలిగి ఉంది. మెంతి గింజలు మధుమేహమును అదుపులో ఉంచునని పరిశోధనలో గమనించడమైనది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : మేధికా
- హిందీ : మేధి
- తెలుగు : మెంతులు
- లాటిన్ : ట్రైగోనెల్లా ఫైనంగ్రీకంలిన్నెయెస్
- కుటుంబము : Fabaceae
- ఇంగ్లీష్ : Fenugreek
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల మెంతియందు:
- తేమ: 86.1 గ్రా
- ప్రొటీన్లు: 4.4 గ్రా
- కార్బోహైడేట్లు: 10 గ్రా
- క్రొవ్వు: 0.9 గ్రా
- ఫైబర్ (నార): 1.1 గ్రా
- ఖనిజలవణాలు: 1.5 గ్రా
- ఐరన్: 17.2 గ్రా
- కాల్షియం: 455 మి.గ్రా
- నియాసిన్: 0.7 మి.గ్రా
- సోడియం: 76.1 మి.గ్రా
- పాస్ఫరస్: 51 మి.గ్రా
- క్లోరిన్: 165 మి.గ్రా
- కాపర్: 165 మి.గ్రా
- మెగ్నీషియం: 67 మి.గ్రా
- పొటాషియం: 51 మి.గ్రా
- సల్ఫర్: 167 మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్: 0.7 మి.గ్రా
- ఆక్సాలిక్ ఆసిడ్: 13 మి.గ్రా
- విటమిన్ - ఎ: 6,450 I.U
- విటమిన్ - బి1: 49 మై.గ్రా
- విటమిన్ - బి2: 165 మై.గ్రా
- కేలరీలు: 48 కలవు.
మరియు మెంతిగింజల యందు ఆల్కలాయిడ్ ట్రైగనెల్లా, కొలిన్ ఎసెన్షియల్ ఆయిల్, మిధైలమిన్, ట్రైమిధైలమిన్, బీపేన్ డి - డైలామిన్, లాసిటిన్, సపోనిన్, పాస్ఫోరిక్ ఆసిడ్ మరియు పొలామిన్లు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు & మెంతికూర ఉపయోగాలు: మెంతికూర స్వాధుగా, చిరు చేదుగా ఉంటుంది రుచిని పుట్టిస్తుంది. త్రిదోషహరమైనది. మూత్రమును సాఫీగా అయ్యేట్లు చేస్తుంది. ఋతుశూల రోగులకు చాలా మంచిది. మెంతికూర వేడిచేసి కట్టిన గడ్డలు మెత్తగవుతాయి. మెంతికూర ఎండుమిరపకాయలను నూనెతో వేయించి దానిని మిక్సీలో వేసి మెత్తగా చేసి తాలింపు వేసుకొని తింటే రుచిగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు రోగులకు, మధుమేహరోగములకు కీళ్ళవాతము రోగులకు మంచిది. మెంతి కూర పప్పు, పులుసు కూడా మంచిదే.
- గడ్డలు: మెంతి ఆకును మెత్తగా నూరి కొద్దిగా నెయ్యి చేర్చి ఉడికించి గడ్డలపై కడితే అవి మెత్తబడి పగిలిపోతాయి. ఆ వ్రణానికి పసుపు మరియు లేత చిగుళ్ళు కలిపి మెత్తగా నూరి రాసిన గడ్డలు మెత్తబడతాయి.
- మధుమేహము: మెంతి చూర్ణమును 3 గ్రాములు ఉదయం సాయంత్రం టీఫిన్ చేయటానికి మరియు భోజనానికి అరగంట ముందు తిన్న యెడల మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది పరిశోధనలో గమనించడమైనది.
- మూత్రంలో రాళ్ళు: మెంతిపిండి, ఉలవల చూర్ణాలను సమాన భాగములుగా తీసుకొని వేయించి ఒక గ్లాసును ఉదయం సాయంత్రం తిన్న యెడల మూత్రంలో రాళ్ళు కరుగుతాయి.
- చెమట దుర్గంధానికి: విజయవాడ, విశాఖపట్నం, లాంటి ప్రాంతాల్లో హ్యూమిడిటీ, విపరీతమైన వేడి, దానికి తోడు ఉక్కపోత చెమట, చెమట దుర్గంధం. ఒక కిలో మీటర్ వరకు వ్యాపించి ఆ వ్యక్తులంటేనే భయమేసే పరిస్థితి. ఇలాంటి స్థితిలో మెంతులు, చందరము, కచ్చురాలు, పెసరు పిండి, నల్ల కలువలు, పసుపు సమభాగాలుగా చేసుకుని మెత్తగా దంచి దానితో నలుగు పెట్టుకొని స్నానము చేస్తే హోయిగా, సుగంధ భరితంగా ఉంటుంది. చెమట కంపు తొలుగుతుంది.
- స్త్రీలవ్యాధులు: స్త్రీల గర్భాశయ వ్యాధులు మరియు అధిక రక్తస్రావము లాంటి సమస్యలలో మెంతిపిండి మేడి పండ్ల గుజ్జు సమంగా కలిపి దానిలో 2 గ్రాములు త్రిఫలా చూర్ణము చేర్చి తినిపించిన గర్భాశయ వ్యాధులు తొలుగుతాయి.
- రక్తగ్రహణి: మెంతులను వెన్నతో కలిపి తినిపించిన లేదా నీళ్ళతో తినిపించిన రక్తగ్రహణి తగ్గుతుంది. మెంతులను వేయించి దానిని మజ్జిగతో కలిపి త్రాగిన కడుపుబ్బరం, అజీర్ణము, అర్షమెములు, అతిసారం, జిగురు విరేచనాలు తొలుగుతాయి.
- మాతృస్తన్యము: మెంతులను వేయించి బెల్లం కలిపి దానిని పాలతో తిన్న యెడల స్త్రీలకు పాలు ఎక్కువగా పడతాయి.
- తెల్లబట్ట - ల్యూకోరియా: మెంతి చూర్ణముతో మరియు పసుపుతో కషాయం కాచి దానితో డూష్ ఇచ్చిన తెల్లబట్ట తగ్గుతుంది. యోని నుండి అధిక దుర్వాసన రావడం తగ్గుతుంది.
- సౌందర్య సాధనా: మెంతులను మెత్తగా నూరి పాలతో కలిపి ముఖానికి కాళ్ళు చేతు లకు రాసిన ముఖం ప్రకాశవంతమౌతుంది.
- చక్కని జుట్టుకోసం: మెంతులను మరియు ఉసిరికాయ చూర్ణమును కలిపి దానికి నువ్వుల నూనెను చేర్చి తలకు రాసిన వెంట్రుకలు గట్టిపడి తొందరగా రాలిపోవు. బట్టతల రాకపోవటం కూడా గమనించవచ్చు.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పేర్కొనబడలేదు)
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 579-580) - రచయిత: డా|| టి. భిక్షపతి
