శనగలు / Bengal Gram
From LTRC
| శనగలు / Bengal Gram | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Leguminoceae |
| Genus | Cicer |
| Scientific Name / Latin Name | Cicer arietinum L. |
శనగలను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు పಂಜాబ్ రాష్ట్రములలో పండిస్తున్నారు. శనగల్లో అనేక రకాలున్నాయి. అవి నల్లశనగలు, తెల్లశనగలు మరియు కాబూలి శనగలు అయితే పోషకవిలువలు అన్నింటిలో దాదాపు సమానంగానే ఉన్నాయి. శనగలు శీతగుణము కలిగి ఉంటాయి. వాతాన్ని కలిగిస్తాయి. శనగలు బలాన్ని కలిగిస్తాయి. పచ్చిశనగలు శుక్రాన్ని పెంచుతాయి. శనగలు బెంగాళీలకు మంచి ఆహారం.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : చణక
- హిందీ : చణా
- తెలుగు : శనగలు
- పంజాబీ : చోళే
- బెంగాలు : చోటాబుల్
- ఇంగ్లీష్ : బెంగాల్‌గ్రామ్ / చిక్‌పి
- లాటిన్ : Cocerarietinum
- కుటుంబము : Leguminoceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల శనగల యందు:
- తేమ: 7.8%
- ప్రొటీన్లు: 17.1 గ్రా
- క్రొవ్వు: 5.3 గ్రా
- కార్బోహైడేట్లు: 61.2 గ్రా
- మినరల్ మీటర్: 2.7 మి.గ్రా
- కాల్షియం: 189 మి.గ్రా
- పొటాషియం: 322 మి.గ్రా
- సోడియం: 71 మి.గ్రా
- పాస్ఫరస్: 238 మి.గ్రా
- ఇరన్: 9.1 మి.గ్రా
- విటమిన్ - ఎ: 270 అం.యు
- విటమిన్ - బి1: 90మి.గ్రా
- విటమిన్ - బి2: 507 మి.గ్రా
- నియాసిన్: 2.4 మి.గ్రా
కలవు. ఇంకా సుక్రోజ్, ప్రక్టోజ్, సాక్రోజ్ పాలిసాకరైడ్స్ తోపాటుస్టార్చ్ గాలక్టోజ్ మరియు లేవిలోజ్కలవు. శనగలు యందుఎన్నో రకాల ఎమినో ఆసిడ్స్ అయిన ఆర్జినైన్, హిస్టిడిన్, ల్యూసిన్, ఐసోలూసిన్, లైసిన్, సిస్టీన్, మిథినిన్, ఫినైలలనిన్, త్రియోనిన్, ట్రిప్టోపాన్ మరియు వాలిన్ మొదలగునివి కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- శరీర పుష్టి & క్వాషియార్కర్ నివారణ: శనగలను ఖర్జూరములను కలిపి మెత్తగా నూరిఅందులో వెన్నతీసిన పాలు పౌడర్కలిపి వాటిని క్వాషియార్కర్ తో బాధపడు పిള്ളలకు ఇచ్చిన మంచి ఆహారము. ఇది శీఘ్రస్కలనాన్ని కూడా నిరోధిస్తుంది.
- ముఖ సౌందర్యానికి: శనగపిండి, పాలమీదగ నిమ్మరసం కలిపి ముఖమునకు పట్టించి 1 గంట తర్వాత కడిగితే ముఖం ప్రకాశవంతమౌతుంది. శనగపిండి నారింజపండు చర్మము పసుపు మరియు ఆలివ్అయిల్, మజ్జిగ కలిపి ముఖానికి మెదకురాసుకుని 1 గంట ఉంచాలి. తర్వాత దానినివేళ్ళతో రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో మరియు చల్లటి నీటితో కడగాలి. దీనిద్వారా ముఖం కాంతివంతంగా అవుతుంది.
- కళావిహీనమైన చర్మం: కళావిహీనమైన చర్మము కలవారికి ఏదో తెలియని కళావిహీనమైన చర్మము కలవారికి శనగపిండి పసుపు 1 చంచా చొప్పున కొన్నిచుక్కల నిమ్మరసం అరసు్వ్ను.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- శనగలు ఎక్కువగా తింటే అజీర్ణము కడుపుబ్బరమును కలిగిస్తాయి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 604-605) - రచయిత: డా|| టి. భిక్షపతి
