మొక్కజొన్నలు / Corn

From LTRC
Revision as of 04:23, 8 September 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | మొక్కజొన్నలు / Corn |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Liliopsida |- ! Order | Poales |- ! Family | Graminalec |- ! Genus | Zea |- ! Scientific Name / Latin Name | Zea mays L. |} మొక్కజొ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
మొక్కజొన్నలు / Corn
Kingdom Plantae
Division Tracheophytes
Class Liliopsida
Order Poales
Family Graminalec
Genus Zea
Scientific Name / Latin Name Zea mays L.

మొక్కజొన్నలు (Zea mays L.) గ్రాసినెల్ (Graminalec) కుటుంబానికి చెందినది. మంచి బలమైన ఆహారము మొక్కజొన్నలు. పచ్చి మొక్కజొన్న పొత్తులను నిప్పులపై కాల్చి దానికి కారము, ఉప్పు మరియు నిమ్మరసం పట్టించి తింటే ఆ రుచి అమోఘము లేదా మొక్కజొన్నలను వలిచి చక్కగా నూనెలో ఫ్రైచేసి అందులో ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కలిపి దానికి నిమ్మరసం చేర్చి తింటే ఇంకా తినాలనిపిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : కాయ
  • హిందీ : మక్కాజవారీ
  • తెలుగు : మొక్కజొన్నలు
  • లాటిన్ : Liamiaize
  • ఇంగ్లీష్ : కార్న్
  • కుటుంబము : Graminalec

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల మొక్కజొన్నల యందు:

  • తేమ: 14.9 గ్రా
  • ప్రొటీన్లు: 11.1 మి.గ్రా
  • ఫైబర్: 2.7 గ్రా
  • కార్బోహైడేట్లు: 15 గ్రా
  • మినరల్: 1.5%
  • కాల్షియం: 11 మి.గ్రా
  • పాస్ఫరస్: 340 మి.గ్రా
  • ఇనుము: 2మి.గ్రా
  • మెగ్నీషియం: 144 మి.గ్రా
  • క్లోరిన్: 33 మి.గ్రా
  • సోడియం: 16 మి.గ్రా
  • పొటాషియం: 286 మి.గ్రా
  • నియాసిన్: 14 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 50 I.U
  • విటమిన్ - బి1: 410 మై.గ్రా
  • విటమిన్ - బి2: 100 మై.గ్రా
  • ఆక్సాలిక్ యాసిడ్: 9.9 మి.గ్రా

మరియు మొక్కజొన్నల్లో అమైనో ఆసిడ్స్ అయిన అర్జినైన్, హిస్టిడిన్, లైసిన్, టైరోసిన్, ట్రిప్టోపాన్, ఫినైలలవిన్, సిస్టీన్, మిథియోనిన్, రియోనిన్, ల్యూసిన్, ఐసోಲ್ಯూసిన్, వాలిన్, కోలిన్, పైరిడాక్సిన్, పాంతోథెనిక్ ఆసిడ్, ఫోలిక్ ఆసిడ్, బయోటిన్‍లో కలవు. మొక్కజొన్నలు పచ్చగా ఉండటానికి అందులో విటమిన్ - ఎ క్లోంతోఫిల్, క్రిప్టోకాన్సిన్, అనేవి కారణము. ఇందులో విటమిన్ ఇ మరియు టోకోఫీరాల్ కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీర పుష్టి & శక్తి: మొక్కజొన్న పిండి బెల్లం కలిపి తింటే ఎంతో బలము కలుగుతుంది. శరీరం పుష్టిగా తయారవుతుంది. వీర్య వృద్ధి, నీరసం, బలహీనత తొలుగుతుంది. మధుమేహ రోగులకు మొక్కజొన్న రొట్టెలు చాలా మంచివి.
  • జీర్ణక్రియ & మూత్ర సంబంధిత సమస్యలు: మొక్కజొన్న తొందరగా జీర్ణము కాదు. ఎక్కువ తింటే కడు పుబ్బరము కలుగుతుంది. మొక్కజొన్నల నూనెను త్రాగిన మూత్రం సాఫీగా వస్తుంది. దీనిని రాసిన చర్మ వ్యాధులలో ఎంతో ఉపయోగకరము.
  • దంత ఆరోగ్యం: నమిలి తినటం వలన దంతాలకు బలము కలుగుతుంది. చిగుళ్ళు గట్టిపడతాయి.
  • శ్రమ శక్తి: జొన్న రొట్టెలు, మాంసము కలిపి తినే వ్యక్తులు చాలా శ్రమపడి పనిచేసిన అలసిపోరు. వారు దృఢంగా, బలంగా శక్తి కలిగి ఉంటారు. ఎలాంటి కష్టనైనా ఎదుర్కొనే ధైర్యస్థైర్యాలు కలిగి ఉంటారు. అంతటి బలమైన ఆహారము మొక్కజొన్నలు.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • మొక్కజొన్న తొందరగా జీర్ణము కాదు. ఎక్కువ తింటే కడుపుబ్బరము కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 583-584)
  • రచయిత: డా|| టి. భిక్షపతి