మినములు / Black Gram

From LTRC
Revision as of 04:12, 8 September 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | మినములు / Black Gram |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Fabales |- ! Family | Papilionaceae |- ! Genus | Vigna |- ! Scientific Name / Latin Name | Vigna mungo (L.) Hepper |} మిన...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
మినములు / Black Gram
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Fabales
Family Papilionaceae
Genus Vigna
Scientific Name / Latin Name Vigna mungo (L.) Hepper

మినములు (Vigna mungo) పాపిలియొనేసి (Papilionaceae) కుటుంబానికి చెందిన మొక్క. మినుములను వరి పంట తర్వాత ప్రత్యామ్నాయ పంటగా వేస్తారు మరియు భారతదేశమంతా వీటిని సాగు చేస్తున్నారు. మినుములు జిగురు చమురు కలిగి ఉంటాయి మరియు వీటిని ఎక్కువగా ఇడ్లీ, పాపడ్ లందు వాడుదురు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : మాష
  • హిందీ : ఊడద్
  • తెలుగు : మినములు
  • ఇంగ్లీష్ : బ్లాక్ గ్రామ్
  • లాటిన్ : ఫేసియోలస్ రేడియోటాస్
  • కుటుంబము : Papilionaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల మినములందు లభించే పోషక విలువలు:

  • తేమ: 10.9 గ్రా
  • ప్రొటీన్లు: 24 గ్రా
  • కార్బోహైడేట్లు: 60 గ్రా
  • క్రొవ్వు (ప్యాట్): 1.4 గ్రా
  • ఖనిజలవణాలు: 3.2 గ్రా
  • ఫైబర్ (నార): 0.9 మి.గ్రా
  • కాల్షియం: 210 మి.గ్రా
  • పాస్ఫరస్: 385 మి.గ్రా
  • ఐరన్ (ఇనుము): 9.1 గ్రా
  • సల్ఫర్: 174 మి.గ్రా
  • క్లోరిన్: 9 మి.గ్రా
  • పొటాషియం: 800 మి.గ్రా
  • మెగ్నీషియం: 185 మి.గ్రా
  • సోడియం: 39.8 మి.గ్రా
  • కాఫర్: 0.72 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 63 I.U
  • విటమిన్ - బి1: 417 మై.గ్రా
  • విటమిన్ - బి2: 387 మై.గ్రా
  • నియాసిన్: 2.1 మి.గ్రా
  • కేలరీలు: 350 కలవు.

మరియు మినముల యందు అమైనో ఆసిడ్స్ అయిన అర్జినైన్, హిస్టిడిన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, సిస్టీన్, మిథియోనిన్, ఫినైలలనిన్, ట్రిప్టోపాన్ మరియు వాలిన్లు కూడా ఉన్నాయి. ఇది గురుత్వ గుణము కలిగి మలమూత్రములను విడిపించును. స్నిగ్ధత, ఉష్ణవీర్యము కలిగి శుక్రోద్రేకమును కలిగించును.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీర పుష్టి & శక్తి: మినములు బలాన్ని శరీర పుష్టిని పెంచుతాయి. శరీరము యొక్క బరువు పెరుగుతుంది. ఇది క్రొవ్వును పిత్తాన్ని కఫాన్ని పెంచుతుంది. మినములు, పంచదార, నెయ్యి కలిపి చేసిన మినపపువులు శరీరానికి బలాన్ని శక్తిని కలిగిస్తాయి. బలహీనంగా ఉండే పిల్లలకు బలమైన ఆహారం.
  • నపుంసకత్వము & వాత రోగాలు: మినములను నానబెట్టి 6-7 గంటల తర్వాత నీటిని తీసివేసి ఆ మినములను చక్కగా ఆవు నెయ్యితో వేيించి దానిని గొధుమ ரொట్టె మరియు తేనేలో కలుపుకొని తిన్న యెడల నపుంసకత్వము తొలుగుతుంది. శుక్రు వృద్ధి అవుతుంది. శీఘ్రస్కలనము తొలుగుతుంది. ఇది ఆర్ధిత వాతము (Fasical paralysis) మరియు కటిశూల (Lumbago) మొదలు గు వ్యాధులందు అత్యంత ఉపయోగకరం.
  • కీళ్ళ జబ్బులు & కండరాల పెరుగుదల: మినములు మరియు నువ్వుల నూనెతో తయారయ్యే తైలంతో మర్దన చేసి కాపదం పెడితే కీళ్ళ జబ్బులు తొలగిపోతాయి. మినములు మరియు బియ్యం కలిపి వండి దానిని తిన్న యెడల శరీరంలోని మాంసము పెరుగుతుంది, బరువు పెరుగుతారు.
  • మధుమేహం & మూత్ర సంబంధిత సమస్యలు: మినములను ఉదయమే నానబెట్టి సాయంత్రం వాటిని తీసి గుడ్డలో కట్టుకొని ఉదయమే మొలకెత్తిన గింజలకు మెంతులను కలిపి పరగడుపున తిన్న యెడల మధుమేహము అదుపులో ఉంటుంది. దీనిని సాయంత్రం భోజనానికి ముందు కూడా వాడవచ్చు. మినిప ఆకులను శుభ్రంగా కదిగి చక్కగా కషాయం కాచి త్రాగినా మూత్రం సాఫీగా వెడలుతుంది.
  • జీర్ణ సమస్యలు & పక్షవాతం: మినములు ఎక్కువగా తింటే త్వరగా జీర్ణం కావు. అలాంటపుడు జీలకర్ర, మిరియాలు, శుండి మరియు హింగు கரிపి తిన్న యెడల చక్కగా జీర్ణమౌతుంది. కీళ్ళనొప్పులు, పక్షవాతం, సయాటికా లాంటి రోగములయందు మినములతో తయారయ్యే మహామೇಷ తైలమును కొద్దిగా వేడిచేసి వ్యాధి గ్రస్తమైన భాగమందు 1/2 గంట చక్కగా మర్దన చేసి తర్వాత వేడి కాపదం పెడితే నొప్పి తగ్గుతుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • మినములు ఎక్కువగా తింటే త్వరగా జీర్ణం కావు. ఇవి టీపి రుచి కలిగి వాతపరంగా ఉండును.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 569-571)
  • రచయిత: డా|| టి. భిక్షపతి