బీట్రూట్ / Beetroot
From LTRC
| బీట్రూట్ / Beetroot | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Caryophyllales |
| Family | Chenopodiaceae |
| Genus | Beta |
| Scientific Name / Latin Name | Beta vulgaris L. |
బీట్రూట్లను భారతదేశమంతటా పండిస్తున్నారు. చూడటానికి మనోహరంగా ఉండటమేకాక ఎన్నో పోషక విలువలతో కూడి ఉన్నాయి. విజెటబుల్ సలాడ్ యందు బీట్రూట్దే అగ్రస్థానం.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : బీటా వల్గారిస్ ;
- హిందీ : చుకందర్ ;
- తెలుగు : బీట్రూట్ ;
- కన్నడ : రక్తద్ గడ్డ్ ;
- కుటుంబము : Chenopodiaceae ;
- ఆంగ్లం : Beetroot *(పుస్తక పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)*
పోషక విలువలు
100 గ్రాముల బీట్రూట్నందు:
- ప్రొటీన్లు : 1.7 గ్రా
- కార్బోహైడ్రేట్లు : 7 గ్రా
- క్రొవ్వు : 0.1 గ్రా
- ఖనిజలవణాలు : 0.8 గ్రా
- ఫైబర్ (నార) : 0.2 గ్రా
- కాల్షియం : 200 మి.గ్రా
- ఐరన్ : 0.8 మి.గ్రా
- మెగ్నీషియం : 9 మి.గ్రా
- సోడియం : 59.8 మి.గ్రా
- సల్ఫర్ : 14 మి.గ్రా
- పొటాషియం : 300 మి.గ్రా
- కాఫర్ : 0.20 మి.గ్రా
- ఆగ్జాలిక్ ఆసిడ్ : 40.4 మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్ : 0.4 మి.గ్రా
- విటమిన్ - బి1 : 0.5 మై.గ్రా
- విటమిన్ - బి2 : 91 మై.గ్రా
- విటమిన్ - సి : 90 మై.గ్రా
- మరియు విటమిన్ ఎ లు కొద్దిమోతాదులలో ఉన్నాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- మూత్ర శుద్ధి & రక్తహీనత: బీట్రూట్ తినడం వలన మూత్రం సాఫీగా వెదలుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తహీనత, మూత్రాన్ని ఎక్కువ చేస్తుంది.
- హైపర్టెన్సన్ & మధుమేహం: బీట్రూట్ ప్రతిదినము తినడం వలన హైపర్టెన్సన్ క్రమంగా తగ్గి నార్మల్కు వస్తుంది. మధుమేహము మరియు ఒబేసిటీ రోగులు బీట్రూట్ను నిరభ్యంతరంగా వాడొచ్చు.
- శరీర పోషణ & నివారణ: బీట్రూట్ నందు తేనె కలిపి ప్రతిరోజు వాడితే శరీరానికి కావలసినంత విటమిన్ - సి దొరుకుతుంది. బీట్రూట్ తినడం వలన రక్తహీనత, నీరసం, లివర్ వ్యాధులు మరియు కిడ్నీ జబ్బులు నివారించబడతాయి. కామెర్లు మరియు అర్శమోదల రోగులకు కూడా మంచిది.
- గ్యాస్ట్రిక్ అల్సర్: బీట్రూట్నందు తేనె కలిపి ప్రతిదినము తినడం వలన గ్యాస్ట్రిక్ అల్సర్ క్రమక్రమంగా తగ్గుతుంది. బీట్రూట్ ఆకులతో కూరవండుకుంటారు. ఆకుల రసం నందు నిమ్మరసం కలిపి త్రాగిన కామెర్లు, అర్శమోసులు, గ్యాస్ట్రిక్ అల్సర్లు నయమవుతాయి.
- సెక్స్ సామర్థ్యం: బీట్రూట్ గింజలను మెత్తగా నూరి అందులో తేనె కలిపి త్రాగిన సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 560-561)
- రచయిత: డా|| టి. భిక్షపతి
