బెల్లం / Jaggery
From LTRC
| బెల్లం / Jaggery | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Poales |
| Family | Poaceae |
| Genus | Saccharum |
| Scientific Name / Latin Name | Saccharum officinarum |
పర్యదినాల్లో బెల్లం పానకం మనకు ఎనలేని సంతృప్తినిస్తుంది. కదూ! ఈ బెల్లను పెద్దపెద్ద ఇనుప బాణళ్లలో తాజా చెరుకు రసమును బాగా మరిగించి చిక్కని పాకాన్ని తయారుచేసి అందులో కాల్షియంక్లోరైడ్ మరియు బ్లీచింగ్ ఏజెంట్స్ కలిపి చక్కని సైజుల్లో తయారుచేస్తారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : గుఢం ;
- ఇంగ్లీష్ : జాగ్రీ ;
- తెలుగు : బెల్లం ;
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల బెల్లంనందు:
- శక్తి (కేలరీలు) : 383
- ఇనుము : 11.4 మి.గ్రా
- విటమిన్ - బి1(థైమిన్) : 0.02 మి.గ్రా
- రైబోఫ్లేవిన్ (బి2) : 0.5 మి.గ్రా ఉన్నాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు & శక్తి: పంచదార కంటే బెల్లం మంచిది. దీనిలో కావల్సినన్ని పోషకవిలువలున్నాయి. దేవాలయాలలో ప్రసాదంగా బెల్లం, వడపప్పు కలిపి నైవేద్యంగా ఇస్తారు. ఇది శక్తిని ప్రసాదిస్తుంది. అలసటను తీరుస్తుంది.
- నీరసం & వడదెబ్బ నివారణ: బెల్లం పానకం మరియు కొద్దిగా మిరియాలపొడి కలిపి త్రాగటం వలన నీరసం తగ్గుతుంది. వడదెబ్బ తొలుగుతుంది.
- వాత రోగాలు & కఫహరం: బెల్లంతో తయారుచేసే పూర్ణాలు, గరిజెలు, ఎన్నో రకాల పిండివంటలు తృప్తిని బలాన్ని కలిగిస్తాయి. బెల్లం శుంటి కలిపి తిన్నయెడల వాతరోగాల యందు ఎంతో ఉపయోగకరము. బెల్లం మరియు అల్లం కలిపి తిన్నయెడల కఫహరంగా ఉంటుంది.
- చర్మవ్యాధులు & రక్తహీనత: దద్దుర్లు తగ్గుతాయి. బెల్లం, కొబ్బరి, బాదం మరియు అరటిపండు కలిపి తిన్నయెడల విటమిన్ల లోపం వలన జరిగే వ్యాధులు తగ్గుతాయి. రక్తహీనత తొలుగుతుంది.
- పిత్తహరం & శ్రమ నివారణ: బెల్లం కరక్కాయ (హరీతకీ) కలిపి తిన్న యెడల పిత్తహరంగా ఉంటుంది. చక్కని రతి సుఖం పొందిన తర్వాత బెల్లం తింటే నీరసం తొలుగుతుంది. శ్రమను పోగొడుతుంది. తాపము తగ్గుతుంది. గుండెదడ తగ్గుతుంది.
- ఆయుర్వేద గుణాలు: బెల్లం వాతహరము బలమును పెంచుతుంది. మూత్రమును కావిస్తుంది. క్రిములను, క్రొవ్వును పెంచుతుంది. అంతరాగ్నిని వృద్ధిచేస్తుంది. పాత బెల్లము తేలికగా జీర్ణమౌతుంది. వాత పిత్తాన్ని హరిస్తుంది. మధురంగా ఉంటుంది. రక్తదోషాలను నివారిస్తుంది. పాతబెల్లం వాడడం చాలా మంచిది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- ఎదైనా అతిగా తినటానికి పనికి రాదు. బెల్లంతో తయారుచేసే బూరెలు రుచిని గురుత్వమును కలిగిམును శరీరానికి పుష్టిని, శుక్రవృద్ధిని, కలిగిಂಚును. శ్లేష్మమును పెంచును.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 550)
- రచయిత: డా|| టి. భిక్షపతి
