పసుపు / Turmeric

From LTRC
Revision as of 13:15, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | పసుపు / Turmeric |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Liliopsida |- ! Order | Zingiberales |- ! Family | Zingiberaceae |- ! Genus | Curcuma |- ! Scientific Name / Latin Name | Curcuma longa L. |} పసుపు మన...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
పసుపు / Turmeric
Kingdom Plantae
Division Tracheophytes
Class Liliopsida
Order Zingiberales
Family Zingiberaceae
Genus Curcuma
Scientific Name / Latin Name Curcuma longa L.

పసుపు మన జీవితంతో మన సంస్కృతితో విడదీయలేని బంధముంది. శుభకరమైన, మంగళకరమైన పవిత్రమైన ద్రవ్యంగా పసుపు ప్రాధాన్యతను సంతరించుకుంది. పెళ్ళి పేరంటాలలో పసుపు రాసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. పసుపు సుమారు 1 మీటరు ఎత్తువరకు పెరిగే బహువార్షిక మొక్క. దుంపవేరు అండాకృతిలో ఉంటుంది. పసుపును ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి మొదலగు ప్రాంతాల్లో పండిస్తున్నారు. పసుపు కటుతిక్తరసము రూక్షలఘుగుణము, ఉష్ణ వీర్యము అను కర్మలను కలిగి ఉంది. దీనిని చర్మవ్యాధులు ఆస్థ్మా దగ్గు, జలుబు, రక్తహీనత, క్రిమిరోగాలు, వ్రణాలు మధుమేహము కామెర్లు మరియు అరుచియందు ఉపయోగిస్తారు. పసుపు వంటింట్లో ఆహారంగా ఔషధంగా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. పసుపు నందు ఈ క్రింది విధంగా పోషక విలువలున్నాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: హరిద్రా ;
  • హిందీ: హలదీ ;
  • తెలుగు: పసుపు ;
  • లాటిన్: కర్కుమాలాంగా అన్న్యీస్ ;
  • కుటుంబము: Zingiberaceae ;

పోషక విలువలు

పసుపు నందు ఈ క్రింది విధంగా పోషక విలువలున్నాయి:

  • ప్రొటీన్లు: 6.2 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 68.1 గ్రాములు
  • క్రొవ్వు: 4.9 గ్రా
  • కాల్షియం: 151 మి.గ్రా
  • పాస్పరస్: 220 మి.గ్రా
  • ఐరన్ (ఇనుము): 22.9 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 50 I.U
  • విటమిన్ - బి2: 2.5 మి.గ్రా మరియు
  • నియాసిన్: కొద్దిమొత్తంలో ఉంది.
  • పసుపునందు 350 కేలరీలు కలవు.
  • పసుపు నందు సుగంధిత తైలము, కర్కుమీన్ ఉన్నాయి. పసుపునకు రోగ నిరోధక శక్తి కలదు. కాళ్ళు, చేతులకు, ముఖానికి పసుపు రాయటం వలన ముఖం సౌందర్యవంతమవుతుంది. అలాగే క్రిములు చేరకుండా చూస్తుంది. క్రిములను చంపుతుంది. పసుపు కొమ్ములను ఆడించి ఉపయోగించండి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • కామెర్లు: పసుపు నందు నాలుగురెట్లు పెరుగు కలిపి రోజు తిన్నయెడల కామెర్లు తగ్గుతాయి. పసుపు దుంప 10 గ్రాములు పెరుగుతో కలిపి సేవిస్తే కామెర్లు తగ్గుతాయి.
  • చర్మవ్యాధులు - (వ్రణాలు, శోభిమచ్చలు): పసుపు, వేపాకు చిగుళ్ళు, తులసీ రసములను సమభాగాలుగా తీసుకొని మెత్తగానూరి రాసిన దీర్ఘకాలంగా బాధిస్తున్న పుండ్ల (వ్రణాలు) శోభిమచ్చలు, గజ్జి మరియు ఇతర చర్మవ్యాధులు నయమనుతాయి.
  • కాళ్ళకు పాచి చేరుట: కరక్కాయల చూర్ణము మరియు పసుపు కలిపి రాసిన నీళ్ళలోనాణటం మూలాన ఏర్పడిన పాచి ఫంగస్, కాళ్ళు పగటం లాంటివి శమిస్తాయి.
  • చర్మసౌందర్యము / ముఖసౌందర్యము: కొబ్బరినీళ్ళయందు పసుపు, చందనము కలిపి ముఖానికి పట్టిస్తే ముఖం ప్రకాశవంతమౌతుంది. పాలమీగడ యందు పసుపు, నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టించి 1 గంట తరువాత నలుగు పిండితో కడిగితే ముఖసౌందర్య ఇనుమడిస్తుంది. పసుపు వట్టివేళ్ళు, చందనం కలిపి సేవిస్తున్న చెమట దుర్గంధం తొలుగుతుంది. చర్మం నిగనిలాడుతుంది.
  • కండ్లకలక: పసుపు నీళ్లలో తెల్లని వస్త్రాన్ని ముంచి కళ్ళమీద వేసిన కండ్లకలక తగ్గుతుంది.
  • పంటినొప్పి: పసుపు కొమ్మును నిప్పుల మీద కాల్చి దానిని నమలిన పంటిపోటు తగ్గుతుంది. నోట్లోపుండ్లు తగ్గుతాయి. నోరు శుభ్రమాతుంది.
  • మధుమేహము: మధుమేహముతో బాధపడు రోగులు పసుపు 1 1/2 గ్రాములు ఉసిరికాయ (అమలకీ) చూర్ణము 1 1/2 గ్రాములు కలిపి ఉపహారానికి అరగంట ముందు మరియు భోజనానికి అరగంటముందు ಸೇವించిన మధుమేహము అదుపులో ఉంటుందని ప్రయోగాలలో గమనించారు.
  • అల్బ్యుమినూరియా: మూత్రంలో అల్బ్యుమిన్ (తెల్లటి పదార్థము) లాంటివి విసర్జింపబడుతున్న యెడల పసుపును సేవింపటం వలన ఆ ఇబ్బందిని అధిగమించవచ్చు.
  • ఆస్థ్మా: పసుపు (హరిదా) 1/2 గ్రాము, ఒటిఓప్సన్ (గ్రాములు), ఉప్పు, వెల్లిపాయలు ఒకటిన్నర గ్రాములు వెల్లుల్లి పాయల్ని మెత్తగ దంచి చక్కగా ఎండించి చూర్ణం చేసి (250 మి.లీ అథపాలు (250మి.లీ) లో మరగించి అవి 1/4 వచ్చే వరకు కాచి వానిని ఉదయం సాయంత్రం ఆస్థ్మా (ఉన్నిససం) రోగికి త్రాగించిన ఆస్థ్మా వ్యాధి లక్షణాలు తగ్గి రోగికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో గమనించారు. (డా|| విశ్వనాథావు, డా|| పి.జె.టి.వి సుభ్రక, డా|| టి.భిక్షపతి, ప్రాంతీయ పరిశోధన కేంద్రము విజయవాడ, ఆంధ్రప్రదేశ్).
  • జలుబు: పసుపు చూర్ణాన్ని వేడి నీళ్లలో వేసి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది.
  • దగ్గు ఆయాసము: ఎలర్జీ రోగులు మరియు దగ్గు ఆయాసముతో బాధపడు రోగులు చిటికెడు పసుపు నందు తేనె కలిపి సేవిచిన దగ్గు ఆయాసము యొక్క వ్యాధి లక్షణాలు ఉపశమిస్తాయి.
  • మొటిమలు: పసుపు మరియు తులసీ ఆకుల రసము నందు ముద్దకర్పూరము కలిపి మెత్తగా నూరి ముఖానికి రాసిన మొటిమలు తగ్గుతాయి.
  • ఆటలమ్మ, మశూచి (స్మాల్‌పాక్స్ / చికెన్‌పాక్స్): పసుపు, వేపాకు చందనం కలిపి మెత్తగా నూరి అమ్మవారు పోసి బొబ్బలు వచ్చి రసికారుతున్న యెడలకు రోగులకు రాసిన మంట నొప్పి దురద తగ్గుతుంది ముఖం వికారంగా కావడం నివారించబడుతుంది.
  • గర్భకోశ వ్యాధులు, స్త్రీల వ్యాధులు: గర్భకోశ వ్యాధులు మరియు స్త్రీల వ్యాధులతో పాటు నెలసరి సరిగా రాని స్త్రీలు పసుపు వాడటంవలన గర్భకోశానికి బలం చేకూరుతుంది. పసుపు చూర్ణాన్ని 2-3 గ్రాములు ఉదయం - సాయంత్రం సేవించిన కడుపులోని నులిపురుగులు నశిస్తాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
  • అజీర్ణము: పసుపు, శోంటి పిప్పలీ మిరియాలు, సైందవ లవణము జీలకర్ర, ఇంగువ మరియు దానిమ్మ గింజలను మెత్తగా నూరి భోజనం నందు కలిపి సేవించిన ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. ఆకలి పెరుగుతుంది.
  • బోధకాలు: కరక్కాయ, పసుపు, బెల్లాలను గోమూత్రంలో కలిపి తిన్న యెడల బోధకాలు లక్షణాలు తగ్గుతాయి.
  • నీళ్ళవిరేచనాలు: పసుపులో ఉన్నగుణాల దృష్ట్యా దీనిని తిన్నయెడల నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 525, 526, 527)
  • రచయిత: డా|| టి. భిక్షపతి