నిమ్మకాయ / Lemon
From LTRC
| నిమ్మకాయ / Lemon | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Sapindales |
| Family | Rutaceae |
| Genus | Citrus |
| Scientific Name / Latin Name | Citrus medica |
నిమ్మకాయ చెట్లను భారతదేశమంతా పెంచుతున్నారు. నిమ్మకాయల ఉపయోగం అంతా ఇంతా కాదు. వేసవి వచ్చిందంటే ప్రతి ఇంట్లో నిమ్మకాయలు ఉండాల్సిందే. అలాగే నిమ్మకాయలతో సంవత్సరం నిలువ ఉండే పచ్చళ్ళు పెట్టుకోవడం తెలుగు వారికి ఇష్టము. నిమ్మకాయ ఆమ్లకటు రసము, లఘుతీక్షగుణము, ఉష్ణవీర్యము పురియు ఆమ్ల విపాకములను కలిగి ఉంది. ఇది వాతకఫహరము దీపనము పాచనము చక్షుష్యము అనే కర్మలను కలిగి ఉంది. నిమ్మకాయలను చర్ది, గుల్మము, వాతరోగాలు అగ్నిమాంద్యము, శూల, దప్పిక్ష మరియు క్రిమి మొదலగు వ్యాధులలో ఉపయోగిస్తారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: నింభూకాము
- హిందీ పేరు: నింబూ
- తెలుగు పేరు: నిమ్మచెట్టు
- లాటిన్ పేరు: సిట్రస్ మెడికాఎరెటి ఎసిడా
- కుటుంబము: Rutaceae
- ఆంగ్ల పేరు: Lemon
పోషక విలువలు
తేమ: 84.6%
- క్రొవ్వు: 0.2 గ్రాములు
- కార్బోహైడేట్లు: 9 గ్రా
- ప్రొటీన్లు: 1.5 గ్రాములు
- కాల్షియం: 107 మి.గ్రా
- పాస్పరస్: 207 మి.గ్రా
- ఇరన్: 0.3 మి.గ్రా
- పొటాషియం: 163 మి.గ్రా
- సోడియం: 6.5 మి.గ్రా
- సల్ఫర్: 12.3 మి.గ్రా
- క్లోరిన్: 5.1 మి.గ్రా
- మెగ్నీషియం: 11.6 మి.గ్రా
- కాఫర్: 0.26 మి.గ్రా
- విటమిన్ - ఎ: కొద్దిశాతం
- విటమిన్ - బి1: 20 మి.గ్రా
- విటమిన్ - బి2: 2 మై.గ్రా
- విటమిన్ - బి6: 0.6 మి.గ్రా
- పొలిక్ ఆసిడ్: 7 మి.గ్రా
- నియాసిన్: 0.2 మి.గ్రా
- పాంతోథినిక్ ఆసిడ్: 0.20 మి.గ్రా
- విటమిన్ - సి: 63 మి.గ్రా ఇందులో కలవు.
తాజా నిమ్మరసం నందు మాలిక్ ఆసిడ్, సిట్రిక్ ఆసిడ్ పాస్పోరిక్ ఆసిడ్లు నాన్ రెడ్యూసింగ్ సుగర్స్ ఉంటాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- రక్త శుద్ధి మరియు యూరిక్ ఆసిడ్ నియంత్రణ: నిమ్మరసము సేవించటం వలన రక్తము శుద్ధి అవుతుంది. నిమ్మరసము తీసుకోవటం వలన uric acid న్యుట్రలైజ్ అవుతుంది.
- యాంటీసెప్టిక్ గుణం: నిమ్మరసము నందుండు citric acid నెచురల్ యాంటీ సెప్టిక్‌లాగా పనిచేసి కడుపులోని క్రిములను సంహరిస్తుంది.
- వేసవిలో దహం తీర్చుటకు: వేసవిలో నిమ్మరసం - నిమ్మరసం నందు పంచదార కలిపి చిటికెడు ఉప్పు చేర్చి అందులో చల్లని నీరు (ice water) కలిపి త్రాగటం వలన దాహం తీరుతుంది. తృప్తి కలుగుతుంది. ఆకలి పెరుగుతుంది. వాంతులు, వాంతి వచ్చినట్టు ఉండటం మరియు తలతిప్పుట మొదలగునవి తగ్గును. ఇది అర్శమోలల రోగులకు, జిగురు విరేచనాల రోగులకు మరియు స్లీన్ ఎన్‌లార్జ్‌మెంట్ రోగులకు చాలా ఉపయోగకరం.
- ఊబశరీరము: ఊబశరీరము :- గోరువెచ్చని నీటి యందు నిమ్మరసం, పాత తేనే కలుపుకొని త్రాగి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తూ ఆహారమును మితంగా భుజిస్తూ, క్రొవ్వు పదార్థాలు తగ్긴చిన ఊబ శరీరం తగ్గుతుంది.
- కడుపులో మంట: నిమ్మరసం, తినేసోడా (Sodabicorb) కలిపి త్రాగిన కడుపులో మంట తగ్గుతుంది.
- శరీరమంటలు: శరీరమంటలు :- నిమ్మరసం సేవించటం వలన వేడి తగ్గుతుంది. శరీర మంటలు తగ్గుతాయి. నోటి జిగురు తగ్గుతుంది. పొంగువ్యాధి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.
- మొటిమలు: నిమ్మకాయ త్వక్ (తొక్కలు) మరియు నారింజపండ్లలో త్వక్ తొక్కలను తీసుకొని మెత్తగా చేసుకొని మీగడ లేని పెరుగులో కలిపి ముఖానికి దట్టంగా పట్టించి അരగంట తరువాత కడిగిన మొటిమలు నివారించబడతాయి. ముఖం ప్రకాశవంతమౌతుంది. నిమ్మకాయ త్వక్ (పైచర్మము) తొక్కలతో మొటిమలను బాగా రుద్దిన కూడా చక్కని ఫలితాలు కనిపిస్తాయి.
- గౌట్: గౌట్‌లో యూరిక్ ఆసిడ్స్ ఎక్కువవుతుంది. గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ నిమ్మరసం మరియు తేనే కలిపి త్రాగిన యూరిక్ ఆసిడ్ శాతం తగ్గుతుంది.
- జిగురువిరేచనాలు: అరటిపండు మరియు నిమ్మరం కలిపి సేవించినక అర్శమోలు మరియు జిగురు విరేచనాలయందు చక్కని ఉపశమనము కలుగుతుంది.
- జర్నీ సిక్‌నెస్: నిమ్మకాయకు చిన్న రంధ్రముచేసి దాని యొక్క వాసన పీల్చిన యెడల జర్నీ సిక్‌నెస్ తొలుగుతుంది.
- జిడ్డుకారటం: నిమ్మరసం, దోసకాయరసం, చందనము పసుపులతోపాటు మీగడ లేని పెరుగును కలిపి పేస్ట్ తయారుచేసుకొని దానిని ముఖానికి దట్టంగా పట్టించి അരగంట తరువాత ముఖము కడిగిన జిడ్డుకారటం తగ్గుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- నిమ్మపండు రసము చాలా పులుపు ఉంటుంది. కావున దీనిని ఎక్కువగా సేవించిన పళ్ళమీద ఎనామిలిపోయి దంతాలకు ఇబ్బంది కలుగుతుంది. పుల్లటి రసాన్ని ఎక్కువగా తీసుకున్న ఆకలిని తగ్గిస్తుంది. మంట ఎక్కువవుతుంది. కాబట్టి అధికంగా నిమ్మరసము తీసుకోకూడదు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 498-500)
- రచయిత: డా|| టి. భిక్షపతి
