ధనియాలు / Coriander
From LTRC
| ధనియాలు / Coriander | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Apiales |
| Family | Apiaceae |
| Genus | Coriandrum |
| Scientific Name / Latin Name | Coriandrum sativum |
ధనియాలు (Coriandrum sativum) అపియేసి (Apiaceae) కుటుంబానికి చెందినది. మన వంటగదిలో తప్పక ఉండే దినసులలో ధనియాలు ముఖ్యమైనవి చక్కని సువాసన కమ్మనిరుచి ధనియాల సొంతము. ధనియాలు పగటీగొట్టి శాకము లందు వాడిన చక్కని సుగంధము వెలువడుతుంది. ధనియాలు కషాయం తిక్త మధుర కటురసములను కలిగి ఉంటాయి. లఘుస్నిగ్ధ గుణములను, ఉష్ణవీర్యము మరియు మధుర విపాకములనుకలిగి ఉండును. విశేషముగా పిత్తహరము ఇది త్రిదోషహరము, గ్రాహి, దీపనము పాచనము అనే కర్మలను కలిగి ఉంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: ధాన్యక
- హిందీ పేరు: ధనియా
- తెలుగు పేరు: ధనియాలు
- లాటిన్ పేరు: కొరియాండమ్ సెటైవమ్ లిన్నెయ్స్
- కుటుంబము: Apiaceae
- ఆంగ్ల పేరు: Coriander
పోషక విలువలు
- ధనియాల యందు లభించే స్థిరతైలము నందుకొరియాండ్రాళ్, టర్పిన్ డిపనిన్లు ఉంటాయి ఇంకా ప్రొటీన్లు పాస్పరస్ కాల్షియం మరియు విటమిన్ - సి లు కూడా ధనియాల యందు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- అజీర్తి: ధనియాలను ఆహార పదార్థములలో కలిపి సేవిస్తే అజీర్తితొలగుతుంది. ఆకలి పుడుతుంది. ధనియాలు, జీలకర్ర వాడిన కూదా అజీర్తి తొలగి ఆకలి పుడుతుంది.
- తలనొప్పి: ధనియాలు చందనము కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది.
- మూత్రం కష్టంగా వెడలటం - మంట: ధనియాలను మెత్తగా దంచి కషాయంలో కాచి దానిని త్రాగిన దప్పిక్ష తీరుతుంది. మూత్రంలో మంటతగ్గి మూత్రం సాఫీగా అవుతుంది. పొత్తి కడుపునొప్పి తగ్గుతుంది.
- జ్వరము: ధనియాలు, శుంఠి, పిప్పళ్ళ మొదలు వానిని చక్కగా దంచి కషాయంకాచి సేవించిన జ్వరము తగ్గుతుంది.
- కడుపుబ్బరం: అపాన వాయువు మరియు వాతవ్యాధులు :- ధనియాలకు శుంఠి చేర్చి మెత్తగా చేసుకొని అందులో నెయ్యి మిరపకారము కలిపి తిన్నయెడల వాత రోగాలు తగ్గుతాయి. ఆకలిపుడుతుంది. గ్యాస్ తగ్గుతుంది. అపానవాయువు బయటికి వెడలుతుంది. విరేచనం కూడ సాఫీగా అవుతుంది.
- అతిసారము: వట్టివేర్లు మరియు ధనియాలను మెత్తగా దంచి కషాయం కాచుకొని ఉదయం సాయంత్రం సేవించిన అతిసారంచగ్గుతుంది.
- దద్దుర్లు - కడుపులోమంట: ధనియాలను చక్కగా చితకకొట్టి కషాయం కాచుకొని సేవించిన దద్దుర్లు తగ్గుతాయి. కడుపులో మంట ఉపశమిస్తుంది.
- ఎక్కిళ్ళు: కడుపులో ఎసిడిటి పెరిగిన మరియు ఇతర కారణల వలన అదే పనిగా ఎక్కిళ్ళు వస్తుంటే ధనియాలతో కషాయం కాచి సేవించిన లేదా ధనియాల రసాన్ని త్రాగిన ఎక్కిళ్ళు ఉపశమిస్తాయి.
- కామెర్లు: ధనియాలను మరియు చింతాకులను కలిపి నూరి దానిని 1-2 చెంచాలు రోజుకు 3 సార్లు సేవిస్తే కామెర్ల వ్యాధి లక్షణాలు తగ్గుతాయి. రక్తహీనత తొలగుతుంది.
- అధికరక్తపోటు (హైపర్టెన్షన్): అధికరక్తపోటు నందు తలతిరుగుట ఉక్క్తుతులుండే లక్షణాలు కనబడతాయి. ఈ రోగులు ప్రతిరోజు ధనియాల చూర్ణము గాని లేదా ధనియాల నుండి తీసిన రసమును గాని సేవించిన వ్యాధి లక్షణాలుతగ్గిపోతాయి. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
- శ్రీఘ్రస్ఖలనము మరియు మూత్రల గుణము: ధనియాలను మెత్తగా నూరి అందులో తేనె కలిపి ఒక నెల రోజులు ఉదయం - సాయంత్రం సేవించిన శ్రీఘ్రస్ఖలనము తగ్గుతుంది.
- దగ్గు, ఆయాసము: చిన్న పిల్లలకు వచ్చు దగ్గు, ఆయాసము లందు ధనియాలను మెత్తగా నూరి అందులో పంచదార వేసి తినిపించిన దగ్గు, ఆయాసము లందు ఎంతో ఉపయుక్తంగా హితంగా ఉంటుంది.
- నోటిదుర్గంధము: పచ్చిధనియాలను కొంచెము నమిలి మెల్లమెల్లగా ఆ ఊటను మింగిన నోటి దుర్గంధము పోతుంది. ఆహారానికి రుచి ఏర్పడుతుంది. హృదయానికి హితంగా ఉంటుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 480-481)
- రచయిత: డా|| టి. భిక్షపతి
