దానిమ్మపండు / Pomegranate
From LTRC
| దానిమ్మపండు / Pomegranate | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Myrtales |
| Family | Punicaceae |
| Genus | Punica |
| Scientific Name / Latin Name | Punica granatum |
దానిమ్మపండు (Punica granatum) పునికేసి (Punicaceae) కుటుంబానికి చెందిన ఒక మొక్క. ఇది సుమారు 6 మీటర్లు ఎత్తు పెరిగెపెద్ద (పొద) మొక్క శాఖలు గుండ్రంగా, ముండ్లవలే వాడిగా ఉంటాయి. పువ్వులు ఎర్రగా ఉంటాయి. దానిమ్మను తోటలలో, ఇళ్లలో పెంచుతున్నారు. దానిమ్మ కషాయమధుర ఆమ్ల రసము లఘు స్నిగ్ధ గుణము ఉష్ణవీర్యము మధుర ఆమ్ల విపాకములను కలిగి ఉంది. ఇది త్రిదోషహరము, హృద్యము, దీపనము గ్రాహి శుక్రలము తర్పణము అనే కర్మలను కలిగి ఉంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: దాడిమ
- హిందీ పేరు: ఆనార్
- తెలుగు పేరు: దానిమ్మ
- లాటిన్ పేరు: ప್ಯೂనికా గ్రనేటమ్ లిన్నెయ్స్
- కుటుంబము: Punicaceae
- ఆంగ్ల పేరు: Pomegranate
పోషక విలువలు
దానిమ్మ గింజలు లేత గులాబిరంగు లేదా ఎరుపు లేదా తెల్లగా లేక ఎర్రగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల దానిమ్మలో:
- ప్రొటీన్లు: 1.6 గ్రాములు
- కార్బోహైడేట్లు: 15 గ్రాములు
- క్రొవ్వు: 0.1 గ్రాములు
- కాల్షియం: 10 మి.గ్రా
- మెగ్నీషియం: 12 మి.గ్రా
- పాస్పరస్: 70 మి.గ్రా
- పొటాషియం: 171 మి.గ్రా
- సోడియం: 4 మి.గ్రా
- ఇరన్: 0.3 మి.గ్రా
- కాపర్: 0.2 మి.గ్రా
- సల్ఫర్: 0.12 మి.గ్రా
- క్లోరిన్: 2.0 మి.గ్రా
- నియాసిన్: 0.3 గ్రా
- విటమిన్ - ఎ: 280 ఆం.యు
- విటమిన్ - బి1: 120 మై.గ్రా
- విటమిన్ - బి2: 36 మై.గ్రా
- విటమిన్ - సి: 5 మి.గ్రా
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- జ్వరములు మరియు రోగనిరోధక శక్తి: దానిమ్మపండును జ్వరములలో ఇచ్చిన రోగికి చక్కని మూత్రవిసర్జన కలుగుతుంది. ఇది గుండె, కిడ్నీలు మరియు లీవర్ యొక్క సామర్థ్యమును చక్కగా పెంచి బలమును చేకూర్చుతుంది. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. అనేక రోగాలనుండి కోలుకునేందుకు దోహదము చేస్తుంది.
- రక్తార్షస్సు: దానిమ్మకాయ బెరడు రసము త్రాగిన రక్తస్రావము తగ్గి రోగికి ఉపశమనము కలుగుతుంది.
- టేప్‌వర్్ మరియు క్రిములు: దానిమ్మ పట్టతో కషాయము కాచి అందు నువ్వుల నూనె కలిపి 3 రోజులు తిన్న యెడల కడుపులోని క్రిములు పడిపోతాయి. దానిమ్మ పట్టయందు పెల్లిటరిన్ టానిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉన్నాయి: ఇది టేప్‌వర్్లను నిరోధిస్తుంది.
- యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు: దానిమ్మవేళ్ళు, కాండము, ఆకుల యొక్క ఎక్స్‌ట్రాక్ట్నకు బ్యాక్టీరియాలను వైరస్లను చంపే గుణము ఉంది.
- రక్తవిరేచనాలు - విరేచనాలు: దానిమ్మపండు బెరడును చూర్ణము చేసి 3 గ్రాముల చొప్పున రోజుకు 3 సార్లు ಸೇವించిన విరేచనాలు కదతాయి. రక్తస్రావము తగ్గుతుంది. అమిబియాసిస్ రోగులకు ఇది చాలా మంచిది.
- బ్రాంకైటిస్ (దగ్గు): దానిమ్మ పువ్వులను చూర్ణం చేసి తిన్న యెడల దగ్గు తగ్గుతుంది. రసాన్ని ముక్కులోనాసల్డో డ్రాప్స్ లాగ వేసిన రక్తం కారటం తగ్గుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 477-479)
- రచయిత: డా|| టి. భిక్షపతి
