తోటకూర / Amaranth

From LTRC
Revision as of 11:02, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | తోటకూర / Amaranth |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Caryophyllales |- ! Family | Amaranthaceae |- ! Genus | Amaranthus |- ! Scientific Name / Latin Name | Amaranthus paniculatus |} త...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
తోటకూర / Amaranth
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Caryophyllales
Family Amaranthaceae
Genus Amaranthus
Scientific Name / Latin Name Amaranthus paniculatus

తోటకూర (Amaranthus paniculatus) అమరాంథేసి (Amaranthaceae) కుటుంబానికి చెందినది. వేసవి మరియు వర్షాకాలములో లభించేది తోటకూర. తోటకూర పోషకవిలువలు కలిగిన బలమైన ఆహారం. దీనిలో ఎన్నో రకాల అమైనో ఆసిడ్స్ కూడా ఉన్నాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • హిందీ పేరు: చాలే
  • తెలుగు పేరు: తోటకూర
  • లాటిన్ పేరు: అమరాంథస్ పానికులేటా
  • కుటుంబము: Amaranthaceae
  • ఆంగ్ల పేరు: Amaranth

పోషక విలువలు

తోటకూరలో ఈక్రింది పోషక విలువలు కలవు:

  • తేమ: 85.7 గ్రాములు
  • క్రొవ్వు: 0.5 గ్రాములు
  • కార్బోహైడేట్లు: 6 గ్రాములు
  • ప్రొటీన్లు: 40 గ్రాములు
  • నార్ (ఫైబర్): 1.0 గ్రాములు
  • కెలోరీలు: 50 గ్రా
  • కాల్షియం: 397 మి.గ్రా
  • పాస్పరస్: 25.5 మి.గ్రా
  • మెగ్నీషియం: 247 మి.గ్రా
  • పొటాషియం: 341 మి.గ్రా
  • సోడియం: 230 మి.గ్రా
  • ఇరన్: 25.5
  • విటమిన్ - ఎ: 10.970 I.U
  • విటమిన్ - బి1: 36 మై.గ్రా
  • విటమిన్ - బి2: 2.5 మై.గ్రా
  • విటమిన్ - సి: 150 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • రక్తహీనత మరియు గర్భిణీ స్త్రీలకు: తోటకూరలో ఐరన్ మరియు విటమిన్ - ఎ శాతం ఎక్కువ ఇది గర్భిణీ స్త్రీలకు మరియు రక్త హీనతతో బాధపడు రోగులకు చాలా మంచిది.
  • కంటి ఆరోగ్యం మరియు దృష్టి లోపాలు: తోటకూర తినటం వ లన కంటికి మేలు జరుగుతుంది. దృష్టి లోపం నివారించబడుతుంది.
  • వృద్ధాప్య ఛాయలు మరియు రోగనిరోధక శక్తి: రక్తహీనత, కామెర్లు మరియు పోషకాహారలోపం కల రోగులకు తోటకూర జ్యూస్ ఎంతో ఉపయుక్తము. వృద్ధాప్య ఛాయలు కనబడుతున్నా తోటకూర జ్యూస్ త్రాగటం వలన వాటిని నివారించవచ్చు.
  • తెల్లబట్ట మరియు మలబద్ధక నివారణ: తోటకూర జ్యూస్ నందు తేనె కలిపి ಸೇವించిన తెల్లబట్ట తగ్గుతుంది. శీఘ్రస్ఖలనం తగ్గుతుంది. మలబద్ధత తొలగుతుంది.
  • శ్వాస సంబంధిత వ్యాధులు: ఆస్తా, బ్రాంకైటీస్, ట్యూబర్ క్లోసిస్ రోగాలకు ఎంతో ఉపయోగకరము. తోటకూర జ్యూస్ మరియు తేనె కలిపి త్రాగిన గర్భిణీస్త్రీలకు ఎన్నో రకాల ఉపయోగం.
  • అర్శమోగులు మరియు రక్తస్రావం: అర్శమోల రోగులకు, చిగుళ్ళవాపురోగులకు ముక్కునుండి రక్తం కారుతున్న రోగులకు అధిక రక్తస్రావంతో బాధపడు స్త్రీలకు ఇది ఎంతో ఉపయోగం.
  • హైపర్ టెన్షన్ మరియు కొలెస్ట్రాల్: హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడు రోగులు తోటకూర జ్యూస్ మరియు నిమ్మరసం కలిపి సేవించిన మూత్రం సాఫీగా అయి శరీరంలోని ఎక్కువ శాతం లో ఉన్న సోడియం బయటికి వెళుతుంది.
  • సౌందర్య పోషణ: తోటకూర రసమునకు పసుపు కలిపి ముఖనకు రాసి గంట తరువాత కడిగినిన ముఖవర్చస్సు పెరుగుతుంది. మొటిమలు నివారించబడతాయి.
  • నలిపురుగులు నివారణ: తోటకూర కషాయం 10-20 మి.లీ రోజుకు 3 సార్లు త్రాగిన నలిపురుగులు నివారించబడతాయి.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్న రోగులు తోటకూరను సేవించరాదు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 474-475)
  • రచయిత: డా|| టి. భిక్షపతి