తేయాకు (టీ) / Tea

From LTRC
Revision as of 10:39, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | తేయాకు (టీ) / Tea |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Ericales |- ! Family | Theaceae |- ! Genus | Camellia |- ! Scientific Name / Latin Name | Camellia sinensis |} తేయాకు...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
తేయాకు (టీ) / Tea
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Ericales
Family Theaceae
Genus Camellia
Scientific Name / Latin Name Camellia sinensis

తేయాకు (టీ) తేయేసి కుటుంబానికి చెందిన ఒక ప్రముఖ మొక్క. తేయాకు (టీ) ను నీలగిరి, డార్జిలింగ్, అస్సాం లాంటి ప్రాంతాలలో పెంచుతున్నారు. దీనికి చల్లని వాతావరణముతో పాటు చక్కని వర్షం కూడా ఎంతో అవసరం. టీ బద్ధకాన్ని తొలగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది, అలసటను తొలగిస్తుంది, శ్రమను దూరం చేస్తుంది మరియు నిద్రరాకుండా చేస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృత పేరు: చాహా
  • హిందీ పేరు: చాయ్ పతి
  • తెలుగు పేరు: టీ (తేయాకు)
  • లాటిన్ పేరు: కామెల్లియా సైనెన్సిస్
  • కుటుంబము: Theaceae
  • ఆంగ్ల పేరు: Tea

పోషక విలువలు

  • టీ (తేయాకు) నందు కఫీన్ 6%, టానిన్ 15-20% కొద్ది మోతాదులలో Volatile oils, థియోబ్రోమిన్ మరియు థియోఫైలిన్స్ ఉంటాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • ఆస్త్రా రోగులకు మరియు అతినిద్రకు: టీ ఆస్త్రా రోగులకు మరియు అతినిద్రతో బాధపడు వారికి చాలా ఉపయోగకరం. ప్రతిరోజు 2 కప్పుల టీ త్రాగటం వలన ఉత్సాహంగా, ఉత్తేజంగా గడపొచ్చు.
  • యాంటీ ఆక్సిడెంట్ గుణాలు: టీలో యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి గుండె జబ్బులు, కీళ్ళజబ్బులు, మధుమేహం లాంటివ్యాధులు రాకుండా చూస్తాయి.
  • మెదడు చురుకుదనం: టీ త్రాగటం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది, వెచ్చదనమును కలిగిస్తుంది. టీలో మెగ్నీషియం ఎక్కువ పాఠ్యలో ఉంటుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • టీని అధికంగా త్రాగటం వలన నిద్రలేమి కలుగుతుంది.
  • ఆకలి మందగించటం కాళ్ళు, చేతులు వణకటం, హృదయస్పందన అధికముకావటం, కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి కావటం తద్వారా అసిడిటీ, అల్సర్స్ రావటం, నరాలబలహీనత, నొప్పి భరించలేని శక్తి మూత్రం అధికంగారావటం రక్తపోటు పెరగటం, తలనొప్పి మొదలగునవి అధికంగా తేనీరు సేవించడం వలన కలుగుతాయి.
  • అధికంగా తేనీరు త్రాగటం వలన ఫ్లోరైడ్ ఎక్కువవుతుంది. అధికంగా తేనీరు త్రాగటం అనర్థము కూడా! ఎముకలకు హాని కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 469-470)
  • రచయిత: డా|| టి. భిక్షపతి