తమలపాకులు / Betel Leaves
From LTRC
| తమలపాకులు / Betel Leaves | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Piperales |
| Family | Piperaceae |
| Genus | Piper |
| Scientific Name / Latin Name | Piper betle |
తమలపాకులు (Piper betle) పైపేసి (Piperaceae) కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన తీగ మొక్క. వివాహశుభకార్యాలలో, విందు వినోదాలలో తమలపాకులది అగ్రతాంబూలమే. ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల తమలపాకులను పెంచుతున్నారు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: తాంబూలి
- హిందీ పేరు: పాన్
- తెలుగు పేరు: తమలపాకులు / నాగవల్లరి
- ఆంగ్ల పేరు: బిటెల్ లీప్స్ (Betel leaves)
- లాటిన్ పేరు: పైపర్ బీటిల్
- కుటుంబము: Piperaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల తమలపాకుల యందు:
- తేమ: 85.4 గ్రాములు
- ప్రొటీన్లు: 3.1 గ్రా
- క్రొవ్వు: 0.8 మి.గ్రా
- కార్బోహైడేట్లు: 6.1 గ్రా
- మినరల్ మేటర్: 2.3 గ్రాములు
- పాస్పరస్: 40 మి.గ్రా
- ఇనుము (ఇరన్): 70 మి.గ్రా
- కాల్షియం: 230 మి.గ్రా
- నియాసిన్: 0.7 మి.గ్రా
- విటమిన్ - ఎ: 9600 I.U
- థైమిన్: 70 మి.గ్రా
- రైబోఫ్లేవిన్: 30.7 మి.గ్రా
- విటమిన్ - సి: 0.7 మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్: 0.7 మి.గ్రాములు
- మరియు ఎన్నో అమైనో ఆసిడ్లను కలిగి ఉంది.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- జీర్ణక్రియ మరియు ఉత్సాహం: భోజనం చేసిన తర్వాత సున్నం, వక్క కలిపి సేవిస్తారు. దీనిని నమలటం వలన ఎక్కువ సెలైవరి గ్లాండ్స్ విడుదల ఉత్టేజం కలుగుతుంది. ఉత్సాహం ఇనుమడిస్తుంది. సంతృప్తి మనసంతౌతుంది.
- నోటి దుర్వాసన మరియు క్రిములు: తమలపాకుల యందు లవంగాలు, సోంపు, పోక, వక్క కలిపి చక్కగా నమిలి తినటం వలన నోటి దుర్గంధము తొలుగుతుంది. నోటిలోని క్రిములు నశిస్తాయి. వాతకఫాలు హరిస్తాయి.
- సెక్స్‌లో సంతృప్తి: తమలపాకుల యందు జాజి (పుదీనా) జాపతి కలిపి ಸೇವించిన వీర్యస్తంభనము కలిగి సెక్స్‌లో తృప్తికలుగుతుంది.
- యాంటీసెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు: తమలపాకులు నుండి తీసే తైలము నందు సుగంధయుక్త స్థిరతైలములు కలవు. తమలపాకుల తైలము యాంటి సెప్టిక్ గుణాలను కలిగి ఉంది. తమలపాకుల తైలం యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉంది. తమలపాకులను నమలటం వలన పిప్పిపళ్ళు నిరోధించబడతాయి.
- దంతాల సంరక్షణ: తమలపాకులు మరియు పోకవక్క కలిపి నమిలి తినటం వలన చిగుళ్ళు గట్టిపడతాయి. మరియు దంతాలు తొందరగా పాడుకాకుండా ఉంటాయి.
- దగ్గు మరియు గొంతు సమస్యలు: తమలపాకు వేరు మెత్తగా నమిలి ఆ ఊటను మింగిన కంఠస్వరం బావుంటుంది. తమలపాకు తీగ వేర్లు యష్టిమధు చూర్ణం కలిపి తీసుకున్న దగ్గు తగ్గుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- తమలపాకులను అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్), అల్సర్ రోగులు, గుండె జబ్బులతో బాధపడు రోగులు వాడటం మంచిది కాదు.
- తమలపాకుల యందు సున్నం, జర్దా (పొగాకు) కలిపి వాడటం వలన గొంతు, నాలుక మరియు దవదలకు సంబంధించిన క్యాన్సర్ వస్తుంది.
- అధికంగా తమలపాకులను అడపనిగా నమలటం వలన పళ్ళు గార పట్టి నల్లగాఅవుతాయి. అంతేకాదు దీర్ఘకాలం తమలపాకులు అడపనిగా ఎక్కువగా సేవించడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది.
- దంతాలు పుచ్చిపోతాయి. చిగుళ్ళ నుండి రక్తం ಕಾರటం, ఆకలి మందగించడం, హృదయ స్పందన అధికము కావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 465-467)
- రచయిత: డా|| టి. భిక్షపతి
