జొన్నలు / Sorghum

From LTRC
Revision as of 10:24, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | జొన్నలు / Sorghum |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Liliopsida |- ! Order | Poales |- ! Family | Poaceae |- ! Genus | Sorghum |- ! Scientific Name / Latin Name | Sorghum bicolor |} జొన్నలు (Sorghum...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
జొన్నలు / Sorghum
Kingdom Plantae
Division Tracheophytes
Class Liliopsida
Order Poales
Family Poaceae
Genus Sorghum
Scientific Name / Latin Name Sorghum bicolor

జొన్నలు (Sorghum bicolor) గ్రామినేసి (Poaceae) కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన ఆహార ధాన్యపు పంట. జొన్నలను మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. జొన్నలు మంచి బలమైన ఆహారం.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృత పేరు: యువనస, యవనల
  • హిందీ పేరు: జవార్
  • తెలుగు పేరు: జొన్నలు
  • లాటిన్ పేరు: ఆండ్రోపోగాన్ సార్గమ్
  • కుటుంబము: Gramineae (Poaceae)
  • ఆంగ్ల పేరు: Sorghum

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల జొన్నలలో:

  • కార్బోహైడేట్లు: 73 గ్రాములు
  • ప్రొటీన్లు: 10.5 గ్రాములు
  • క్రొవ్వు: 1.7 గ్రాములు
  • కాల్షియం: 28 మి.గ్రా
  • పాస్పరస్: 286 మి.గ్రా
  • ఇనుము (ఇరన్): 6 మి.గ్రా
  • సోడియం: 7 మి.గ్రా
  • నియాసిన్: 1.7 మి.గ్రా
  • పొటాషియం: 131 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 140 I.U
  • విటమిన్ - బి1: 344 మై.గ్రా
  • విటమిన్ - బి2: 363 మై.గ్రా
  • ఇంకా అర్జినైన్, హిస్టిడిన్, ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, సిస్టిన్, మిధియోనిన్, ఫినైలనిన్, త్రియోనిన్, ట్రిప్టోఫాన్, వాలిన్ మొదలగు అమైనో ఆసిడ్స్ కూడా ఇందులో కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • జీర్ణక్రియ మరియు మలబద్ధక నివారణ: జొన్నలలో బి.కాంప్లెక్స్, సెల్యులోజ్ మరియు ఫెటైల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మలమును చక్కగా జారీచేస్తాయి. జొన్నలతో చేసిన రొట్టెను మెత్తగా నమిలి తినాలి. లేనిచో మలబద్ధకము కలుగుతుంది. కఫపైత్యములను తొలగిస్తుంది.
  • అర్ధ్ధ మొలలు మరియు విటమిన్ లోపాలు: చక్కగా చేసిన జొన్నపిండిని పాలతో కలిపి సేవించిన అర్ధ్ధ మొలల రోగులకు మరియు విటమిన్ బి1 మరియు విటమిన్ బి2 తో బాధపడు రోగులకు చాలా మంచిది.
  • శరీర బలానికి: కష్టపడి పనిచేసే వారికి దేహ పరిశ్రమ చేసే వారికి ఇది చాలా మంచి ఆహారం.
  • జాండిస్, మధుమేహం మరియు ఇతర సమస్యలు: జొన్నల యొక్క కాండము నుండి రసం తీసి ఉపయోగించిన జాండిస్, మధుమేహము, జలుబు మరియు కడుపునొప్పి మొదలగునవి ఉపశమిస్తాయి. శరీర బరువును పెంచుతాయి. విరిగిన ఎముకలు అతుకుటలో ఉపయోగకరం.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • జొన్నలతో చేసిన రొట్టెను మెత్తగా నమిలి తినాలి, లేనిచో మలబద్ధకము కలుగుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 461)
  • రచయిత: డా|| టి. భిక్షపతి