జీడిమామిడి / Cashew

From LTRC
Revision as of 10:19, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | జీడిమామిడి / Cashew |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Sapindales |- ! Family | Anacardiaceae |- ! Genus | Anacardium |- ! Scientific Name / Latin Name | Anacardium occidentale |}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
జీడిమామిడి / Cashew
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Sapindales
Family Anacardiaceae
Genus Anacardium
Scientific Name / Latin Name Anacardium occidentale

జీడిమామిడి (Anacardium occidentale) అనకార్డియేసి కుటుంబానికి చెందిన ఒక ముఖ్యమైన మొక్క. జీడిమామిడి చెట్లను ఆంధ్రప్రదేశ్ అరణ్యాలన్నింటిలో పెంచుతున్నారు. జీడి మామిడి పండు తియ్యగా, వగరుగా ఉంటుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృత పేరు: స్థూలచూత
  • హిందీ పేరు: కాజు
  • తెలుగు పేరు: జీడి మామిడి పండు
  • లాటిన్ పేరు: అనార్కార్డియమ్ యాక్సిడెంటెల్
  • కుటుంబము: Anacardiaceae
  • ఆంగ్ల పేరు: Cashew

పోషక విలువలు

ప్రతి 100గ్రాముల జీడి మామిడి యందు:

  • మినరల్ మేటర్: 0.6
  • తేమ: 5.9%
  • కార్బోహైడేట్లు: 11.1 గ్రాములు
  • ప్రొటీన్లు: 0.8 గ్రాములు
  • క్రొవ్వు: 49.9 గ్రాములు
  • కాల్షియం: 4మి.గ్రా
  • పాస్పరస్: 21 మి.గ్రా
  • ఐరన్: 5.0 మి.గ్రా
  • ఫైబర్: 1.3 మి.గ్రా
  • విటమిన్ - బి1: 288 మై.గ్రా
  • విటమిన్ - బి2: 234 మై.గ్రా
  • విటమిన్ - సి: 200 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 100 మి.గ్రా

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • అతిసారము మరియు మూత్ర సంబంధిత సమస్యలు: జీడిమామిడి పండు రసము నందు విటమిన్ - సి ఎక్కువగా ఉంటుంది. జీడి మామిడి పండు రసము నందు తేనె కలిపి రోజుకొక్కసారి తీసుకున్న యెడల అతిసారము, మూత్రకృచ్ఛత, మూత్రంలో మంట, నెలసరి కష్టంగా రావడం మొదలగు వానియందు ఉపయోగకరంగా ఉండును.
  • కీళ్లనొప్పులు మరియు ఇతర ఉపయోగాలు: జీడిమామిడి పండు రసాన్ని కీళ్ళనొప్పులున్న చోట రాసిన నొప్పులు తగ్గుతాయి. జీడిమామిడి పండ్లతో వైన్‌ను తయారుచేస్తారు.
  • చర్మవ్యాధులు మరియు పులిపిరికాయలు: జీడిమామిడి గింజల తైలం (oil) రాసిన యెడల పులిపిరికాయలు, చర్మవ్యాధులు, మొటిమలు, ఆనెలు, ప్రణములు తగ్గుముఖం పగుతాయి.
  • శరీరపుష్టి: జీడిమామిడి గింజలనుండి వచ్చే పప్పు (జీడిపప్పు) కమ్మగా రుచిగా ఉంటుంది. ఇది బలాన్ని, శరీరపుష్టిని కలిగిస్తుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 458-459)
  • రచయిత: డా|| టి. భిక్షపతి