చిక్కుడుకాయ / Lablab Bean
From LTRC
| చిక్కుడుకాయ / Lablab Bean | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Legnninoceae |
| Genus | Lablab |
| Scientific Name / Latin Name | డాలికోస్ లాబ్లాబ్ (Lablab purpureus / Dolichos lablab L.) |
చిక్కుడుకాయలను వాణిజ్య పంటగా అన్ని రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. చిక్కుడుకాయల్లో అనేక రకాలున్నాయి. చిక్కుళ్ళు చాలా బలమైన ఆహారం. ఇవి శీతల గుణాన్ని కలిగి ఉంటాయి. వాతాన్ని తగ్గిస్తుంది. కఫాన్ని పెంచుతుంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: శీంబీ
- హిందీ: సేమ్
- తెలుగు: చిక్కుళ్ళు
- లాటిన్: డాలికోస్ లాబ్లాబ్
- కుటుంబము: Legnninoceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల చిక్కుళ్ళలో:
- తేమ: 86.1 గ్రాములు
- ప్రొటీన్లు: 3.8 గ్రాములు
- క్రొవ్వు: 0.7 గ్రా
- ఫైబర్ (నార): 1.8 గ్రా
- కేలరీలు: 48 గ్రాములు
- ఖనిజలవణము: 0.9 గ్రా
- కాల్షియం: 210 మి.గ్రా.
- మెగ్నీషియం: 34 మి.గ్రా.
- సోడియం: 55.4 మి.గ్రా.
- పొటాషియం: 74 మి.గ్రా.
- ఇరన్ (ఇనుము): 1.7 మి.గ్రా.
- డైమిన్: 0.1 మి.గ్రా.
- సల్ఫర్: 40 మి.గ్రా.
- కాఫర్: 0.13 మి.గ్రా.
- విటమిన్- ఎ: 312 I.U
- విటమిన్ - సి: 9 మి.గ్రా.
- రైబోఫ్లోవిన్: 0.06 మి.గ్రా.
- నికోటినిక్ ఆసిడ్: 0.7 మి.గ్రా.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- గుణాలు: చిక్కుడు గింజలు రూక్షత్వము, కషాయరసముతో కూడిన మధురరసము కటువిపాకములను కలిగి ఉండును. ఉష్ణవీర్యాన్ని కలిగిఉండును.
- స్త్రీలకు (బాలింతలకు): చిక్కుడు కాయల కూరను ప్రసవించిన స్త్రీలు తింటే పాలు ఎక్కువ పడతాయి.
- మూత్రం & ఊపిరితిత్తులు: మూత్రం చక్కగా జారి అవుతుంది ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.
- పుంసత్వము & తాపం: పుంసత్వమును పెంచుతుంది. తాపాన్ని పెంచుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- చిక్కుడు గింజలకూర ఎక్కువగా తిన్న అజీర్ణము కలుగుతుంది.
- కడుపునొప్పి వస్తుంది. మలబద్ధత కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 448-449)
- రచయిత: డా|| టి. భిక్షపతి
