చింతకాయలు / చింతచెట్టు / Tamarind
From LTRC
| చింతకాయలు / చింతచెట్టు / Tamarind | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | టామరిండసియే |
| Genus | Tamarindus |
| Scientific Name / Latin Name | టామరిండస్ ఇండికా లిన్నెయస్ (Tamarindus indica L.) |
చింత చెట్లు ఆంధ్రదేశమంతటా పెరుగుతాయి. నిత్య జీవితంలో మన ఆహారంలో ఎంతొ ఉపయోగపడేది చింతచెట్టు. చింతకాయ/పండును కూరలలో, రసములో, సాసులలో మరియు పచ్చళ్ళలో విరివిగా వాడతారు. ఆమ్లరసము ఉష్ణవీర్యము గురురూక్ష గుణము మరియు అమ్లవిపాకములను కలిగి ఉంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: మిచా/ అమ్లికా
- హిందీ: ఇమలీ
- తెలుగు: చింతకాయలు
- లాటిన్: టామరిండస్ ఇండికా లిన్నెయస్
- కుటుంబము: టామరిండసియే
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల చింతకాయ/పండులో:
- తేమ: 20.9%
- ప్రొటీన్లు: 3.1
- క్రొవ్వు: 0.5
- ఫైబర్: 5.6
- కార్బోహైడ్రేట్లు: 67.4
- మినరల్స్: 2.9%
- కాల్షియం: 170 మి.గ్రా.
- భాస్వరస్: 110 మి.గ్రా.
- ఇరన్: 108 మి.గ్రా.
- విటమిన్ - ఎ: 98 I.U
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు: ఇది కఫవాతహరము, దీపనము అను కర్మలను కలిగి ఉంది. దీనిని కడుపునొప్పి, గుల్మము, అగ్నిమాంద్యము, శోధ, కామల మరియు వాతవ్యాధులలో ఉపయోగిస్తారు. ఎక్కువ తింటే విరేచనం చేస్తుంది.
- మొటిమలు, దురద, దద్దుర్లు: చింతచిగురు, పసుపు, పచ్చకర్పూరము మొదలగు వానిని మెత్తగా నూరి కొబ్బరినీళ్ళలో కలిపి ముఖంనకు రాసిన మొటిమలు తగ్గిపోతాయి. దద్దుర్లు మరియు దురదం తగ్గిపోతాయి. చింత చిగురులో విటమిన్ - సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీనిని కూర చేసుకుని తింటే విటమిన్ - సి లోపం వలన వచ్చే జబ్బులు నివారించబడుతాయి. దద్దుర్లు, పైత్యవికారాలు నివారించబడతాయి.
- గజ్జి - దురద: చింతచిగురును మెత్తగా దంచి దీనిని శరీరమునకు రాసి కొన్ని నిమిషాలు ఎండలో కూర్చుని, తరువాత స్నానం చేస్తే గజ్జి, దురదలో ఉపయుక్తంగా ఉంటుంది.
- రోగనిరోధక శక్తి పెంపొందుటకు: చింతచిగురు మరియు వేప గుగ్గులు సేకరించి చక్కగా ఎండించి రోజు వాటిని సేవించిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- రక్తహీనత: చింతచిగురు రోజు సేవించిన రక్తహీనత సమస్య దూరమవుతుంది.
- వాంతి - తలతిప్పుట: చింతపండు, జీలకర్ర, సైందవలవణములను కలిపి 250 మి.లీ గ్రాములు చొప్పున ఉదయం, సాయంత్రం సేవించిన వాంతి వచ్చినట్టుంటుంది, ఒళ్ళు త్రిప్పినట్లు, తలతిరిగినట్లు అనిపించుట తగ్గుతుంది.
- ఆస్తమా: చింతబెరెడును భస్మం చేసి సేవిస్తే ఆస్తమా రోగుల్లో హితంగా ఉంటుంది.
- రక్తవిరేచనాలు: చింతచిగురును పప్పులో వేసుకొని తిన్న యెడల రక్తవిరేచనాలలో ఉపశమనము కలుగుతుంది.
- అధిక ఋతుస్రావము: చింతగింజల చూర్ణమును తేనెతో కలిపి వాడిన అధిక ఋతుస్రావము తగ్గుతుంది.
- ప్రణాలు - వాపులు - నొప్పి: చింతకకులను ఆముదముతో ఉడికించి కట్టిన యెడల గడ్డలు మెత్తబడతాయి. ప్రణాలు మానుతాయి. నొప్పి ఉన్నచోట కట్టిన నొప్పి తగ్గుతుంది. చింత ఆకును వేడి చేసి కట్టిన యెడల వాపు, నొప్పి తగ్గిపోతాయి.
- అగ్నిదీప్తి: చింతచిగురు పచ్చడి/చింతకాయ పచ్చడి తిన్న యెడల నోటికి రుచి కలిగి ఆకలి వెన్నుంది. దీని ద్వారా లాలాజల గ్రంధులు ఉత్తేజితకారకమౌతాయి.
- జ్వరతీవ్రత కామెర్లు: చింత చిగురు కషాయం త్రాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. చింతచిగురు రసము త్రాగిన కామెర్లు నివారించబడతాయి.
- కడుపుబ్బరం, ఆమ్లపిత్తము మరియు అల్సర్: చింతచిగురు కాల్చి ఆ భస్మాన్ని 1 గ్రాము ఉదయం, సాయంత్రం సేవించిన కడుపునాొప్పి, అల్సర్ మరియు కడుపుబ్బరములు తగ్గును.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 443-444)
- రచయిత: డా|| టి. భిక్షపతి
