చామదుంపలు / Taro
From LTRC
| చామదుంపలు / Taro | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Alismatales |
| Family | Araceae |
| Genus | Colocasia |
| Scientific Name / Latin Name | కొలకేసియా యాంటి క్వోమ్ (Colocasia esculenta L.) |
చామదుంపలను దేశమంతటా సాగుచేస్తున్నారు. దీనిలో స్టార్చ్ ఎక్కువ. ఇది జిగురు జిగురుగా ఉంటుంది. దీనితో తయారయ్యే పులుసు చాలా రుచిగా ఉంటుంది. అధికంగా తింటే అజీర్ణము చేస్తుంది. ఇందులో పోషక విలువలు ఎక్కువై, నికోటినిక్ ఆసిడ్ 0.4 మి.గ్రా చొప్పున కలవు.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: కచు, వితంద
- హిందీ: అర్వీ
- తెలుగు: చామదుంపలు
- ఇంగ్లీష్: టారో (Taro)
- లాటిన్: కొలకేసియా యాంటి క్వోమ్
- కుటుంబము: Araceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల చామదుంపలలో:
- తేమ: 73.1 గ్రాములు
- కేలరీలు: 97 గ్రాములు
- ఖనిజలవణములు: 1.7 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు: 22 గ్రాములు
- ప్రొటీన్లు: 3 గ్రాములు
- క్రొవ్వు: 0.1 గ్రాము
- ఫైబర్ (నార): 1.0 గ్రాము
- సోడియం: 25 మి.గ్రా.
- పొటాషియం: 464 మి.గ్రా.
- కాల్షియం: 40 మి.గ్రా.
- భాస్వరస్: 140 మి.గ్రా.
- ఇరన్: 1.7 మి.గ్రా.
- విటమిన్ - ఎ: 40 I.U
- విటమిన్ - బి1: 90 మై.గ్రా.
- విటమిన్ - బి2: 31 మై.గ్రా.
- విటమిన్ - సి: 0.4 మి.గ్రా.
- ఆగ్జాలిక్ ఆసిడ్: 133.4 మిగ్రాములు
- నియాసిన్: 0.4 మి.గ్రా.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- వాజీకరణ & బరువు: చేమ దుంపలు వాజీకరణ గుణాలను కలిగి ఉంది. ఇది వీర్యమును వృద్ధిచేసి చిక్కబరుచును. ఇది బరువును పెంచుతుంది.
- ఆస్తమా & అర్షమోలు: ఆస్తమా రోగులలో అధికంగా కఫము వెడలటమును నిరోధిస్తుంది. అర్షమోలల రోగులకు ఉపయోగము.
- మూత్రకృచ్ఛము & అగ్నిమాంద్యం: చేమ ఆకు కాడలకూర మూత్రకృచ్ఛము, అర్షమోలు, అగ్నిమాంద్యములను తగ్గించును. నల్ల చేమదుంపలు వాతాన్ని చేస్తాయి, చెమట మొదలగు వానిని శోషింపచేస్తాయి.
- రక్తస్రావాలు & గాయాలు: చేమదుంపల కూర రుచిని పుట్టిస్తుంది, రక్తమును వృద్ధి చేస్తుంది. దీనిని ఆకులు, మరియు కాడల రసము రక్తస్రావాలను ఆపుతాయి. చేమ కాడలను నూరి కట్టిన గాయములు త్వరగా మానును.
- చెవి నొప్పి & తేలు విషం: చేమ కాడల రసమును చెవిలో చుక్కల లాగ వేసినే చెవినిొప్పి తగ్గుతుంది, అంతే కాక చీము కారటం కూడా తగ్గుతుంది. చేమదుంపల రసమును తేలుకుట్టిన చోట రాస్తే మంట తగ్గుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- అధికంగా తింటే అజీర్తి చేస్తుంది.
- మలబద్ధకము కడుపుబ్బరం కలిగిస్తాయి.
- బరువును పెంచుతాయి, వాతం చేస్తుంది.
- మధుమేహ రోగులు ఈ దుంపలు తినటం మంచిది కాదు.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 441-442)
- రచయిత: డా|| టి. భిక్షపతి
