చెర్రి ఫ్రూట్స్ (చెర్రీ ఫలాలు) / Cherries

From LTRC
Revision as of 14:02, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | చెర్రి ఫ్రూట్స్ (చెర్రీ ఫలాలు) / Cherries |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Rosales |- ! Family | Rosaceae |- ! Genus | Prunus |- ! Scientific Name /...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
చెర్రి ఫ్రూట్స్ (చెర్రీ ఫలాలు) / Cherries
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Rosales
Family Rosaceae
Genus Prunus
Scientific Name / Latin Name ప్రూనస్ సిరాసస్ (Prunus cerasus L.)

చిన్నగా చూడ చక్కగా ఉండే ఫలాలు చెర్రీలు. చెర్రీలను ఎక్కువగా మనము ఫ్రూట్ సలాడ్స్ యందు, ఐస్‌క్రీముల యందు వేయటం చూస్తుంటాం. ఎంతో రుచిగా ఉండే ఫలాలు చెర్రీలు.

వివిధ భాషల్లో పేర్లు

  • ఇంగ్లీష్: చెర్రీలు
  • లాటిన్: ప్రూనస్ సిరాసస్
  • కుటుంబము: Rosaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల చెర్రీ ఫలముందు:

  • కాల్షియం: 15.9 గ్రాములు
  • ప్రొటీన్లు: 1.1 గ్రాములు
  • క్రొవ్వు: 0.5 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 11.9 గ్రాములు
  • సోడియం: 2.4 మి.గ్రా.
  • పొటాషియం: 275 మి.గ్రా.
  • మెగ్నీషియం: 9.6 మి.గ్రా.
  • సల్ఫర్: 5.9 మి.గ్రా.
  • కాఫర్: 0.6 మి.గ్రా.
  • ఐరన్ (ఇనుము): 0.36 మి.గ్రా.
  • భాస్వరస్: 16.8 మి.గ్రా.
  • క్లోరిన్: 1 మి.గ్రా.
  • విటమిన్ - ఎ: 100 I.U
  • విటమిన్ - బి1: 10 మై.గ్రాములు
  • విటమిన్ - బి2: 10 మై.గ్రా.
  • విటమిన్ - బి6: 0.05 మి.గ్రా.
  • విటమిన్ - సి: 62 మి.గ్రా.
  • ఫోలిక్ ఆసిడ్: 6 మి.గ్రా.
  • పాంతోతానిక్ ఆసిడ్: 0.12 మి.గ్రా.
  • బయోటిన్: 0.08 మి.గ్రా. ఉన్నాయి

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • కీళ్ళ జబ్బులు: చెర్రీ ఫలాలు తినటం వలన కీళ్ళ జబ్బులు నివారించబడతాయి.
  • నరముల బలహీనత: చెర్రీ ఫలాలు నరముల బలహీనత రోగులకు ఎంతో ఉపయుక్తం.
  • చర్మ వ్యాధులు: చెర్రీ ఫలాలను మెత్తగా నూరి రాసిన కాళ్ళ పగుళ్ళు మరియు రింగ్ వర్మ్ లాంటి రోగాల్లో ఉపయుక్తంగా ఉంటుంది.
  • జలుబు నివారణ: చెర్రీ ఫలాలను సేవించటం వలన జలుబు నివారించబడుతుంది.
  • బాధ నివారణ: చెర్రీ ఫలాలలో బాధ నివారణగా పనిచేయు రసాయన పదార్థములు ఉన్నాయి. వీటిని సేవించటం వలన ఆస్పిరిన్ సేవిస్తే కలిగే ఫలితాలు కలుగుతాయని పరిశోధకులు అంటున్నారు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 440)
  • రచయిత: డా|| టి. భిక్షపతి