చుక్కకూర / Bladder Dock

From LTRC
Revision as of 13:57, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | చుక్కకూర / Bladder Dock |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Caryophyllales |- ! Family | Polygonaceae |- ! Genus | Rumex |- ! Scientific Name / Latin Name | రూమేక్స్ వ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
చుక్కకూర / Bladder Dock
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Caryophyllales
Family Polygonaceae
Genus Rumex
Scientific Name / Latin Name రూమేక్స్ వెసికేరియస్ లిన్నెయస్ (Rumex vesicarius L.)

పుల్లగా రుచిగా ఉండే చుక్కకూర సుమారు 30 సె.మీ ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక క్షุปము. ఈ మొక్కను భారతదేశమంతట ఆకుకూర కొరకు సాగుచేస్తున్నారు. ఇది అమ్ల మధుర రసము, ఉష్ణ వీర్యము, లఘు గుణము మరియు అమ్ల విపాకములను కలిగి వాత హరము, పిత్తకరము దీపనము మరియు రుచ్యము అను కర్మలను కలిగి ఉంది. దీనిని అరుచి, అగ్నిమాంద్యము అతిసారము అను వ్యాధులలో ఉపయోగిస్తారు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: చక్ర
  • హిందీ: చూకా
  • తెలుగు: చుక్కకూర
  • ఇంగ్లీష్: బ్లాడర్ డాక్ (Bladder Dock)
  • లాటిన్: రూమేక్స్ వెసికేరియస్ లిన్నెయస్
  • కుటుంబము: Polygonaccale

పోషక విలువలు

ప్రతి 100 గ్రాములు చుక్కకూర యందు:

  • తేమ: 95.2
  • ప్రొటీన్లు: 1.6
  • క్రొవ్వు: 0.3
  • కార్బోహైడ్రేట్లు: 1.4
  • ఫైబర్ (నార): 0.6
  • మినరల్ మేటర్: 0.9%

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • వాంతులు & జాಂಡీస్ (కామెర్లు): చుక్కకూర రసము 1 చెంచా 5-10 మి.లీ గ్లాస్ మజ్జిగ (250 మి.లీ) రోజుకు 3 సార్లు సేవిచిన పైన పేర్కొన్న వ్యాధులలో చాలా ఉపయోగకరము.
  • కర్ణశూల: చెవి పోటు నందు చుక్కకూర రసమును కొద్దిగా వేడి చేసి చెవిలో వేసి కాటన్ పెట్టి ఉంచిన కొద్ది నిమిషాలలో నొప్పి తగ్గుతుంది.
  • శోధహరము (Swelling): చుక్కకూర ఆకులను మెత్తగా నూరి గడ్డలపై కట్టిన గడ్డలు మెత్తబడును.
  • ముక్కునుండి రక్తం కారిన: చుక్కకూర రసమును ముక్కులో వేసిన ముక్కునుండి రక్తం కారటం తగ్గుతుంది.
  • రక్తశుద్ధి: చుక్కకూర సేవించిన రక్తం శుద్ధి అవుతుంది.
  • కడుపునొప్పి: చుక్కకూర రసం నందు తినే సోడ కలిపి సేవిచిన కడుపునొప్పి తగ్గుతుంది.
  • కామెర్లు - చర్మవ్యాధులు: చుక్కకూర రసం, పాలు కలిపి సేవిచిన కామెర్లు చర్మవ్యాధులు తగ్గుతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 437)
  • రచయిత: డా|| టి. భిక్షపతి