చెఱుకు / Sugarcane

From LTRC
Revision as of 13:53, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | చెఱుకు / Sugarcane |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Liliopsida |- ! Order | Poales |- ! Family | Graminaceae |- ! Genus | Saccharum |- ! Scientific Name / Latin Name | సాఖ్చరమ్ ఆఫిసిన...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
చెఱుకు / Sugarcane
Kingdom Plantae
Division Tracheophytes
Class Liliopsida
Order Poales
Family Graminaceae
Genus Saccharum
Scientific Name / Latin Name సాఖ్చరమ్ ఆఫిసినారమ్ (Saccharum officinarum L.)

చెఱుకు భారతదేశమంతట సాగుచేస్తున్నారు. చెఱుకు రసము సత్వర శక్తినిస్తుంది, బలాన్ని కలుగజేస్తుంది, నీరసాన్ని తొలగించి నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: ఇక్షు
  • హిందీ: ఫున్నా
  • తెలుగు: చెఱుకు
  • ఇంగ్లీష్: షుగర్‌కేన్ జ్యూస్
  • లాటిన్: సాఖ్చరమ్ ఆఫిసినారమ్
  • కుటుంబము: Graminaceae

పోషక విలువలు

చెలుకులో ప్రతి 100 గ్రాములలో ఉండే పోషక విలువలు:

  • కార్బోహైడ్రేట్లు: 54 గ్రాములు
  • ప్రొటీన్లు: 0.2 గ్రాములు
  • క్రొవ్వు: 0.2 గ్రాములు
  • కాల్షియం: 74 మి.గ్రా.
  • భాస్వరస్: 22 మి.గ్రా.
  • ఇరన్: 6.4 మి.గ్రా.
  • సిలికా: 5.3 మి.గ్రా.
  • పొటాషియం: 20 మి.గ్రా.
  • సోడియం: 20 మి.గ్రా.
  • క్లోరిన్: 5.1 మి.గ్రా.
  • విటమిన్- ఎ: 188 I.U
  • విటమిన్ - బి2: 12 మై.గ్రాములు
  • విటమిన్ - డి: 176 మై.గ్రాములు
  • నికోటినిక్ ఆసిడ్: 0.6 మి.గ్రా.
  • బయోటిన్: 22 మి.గ్రా.
  • నియాసిన్: 49 మి.గ్రా.
  • పాంతోతానిక్ ఆసిడ్: 2.180 మై.గ్రా.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • దంత ఆరోగ్యం: చెఱుకు గెడలను నమిలి తింటు రసాన్ని ఆస్వాదిస్తుంటే ఆ ఆనందమే వేరు, ఇది దంతములను గట్టిపరుస్తుంది, బ్యాక్టీరియాలను దంతముల నుండి బయటికి పంపిస్తుంది.
  • దీర్ఘకాలిక జబ్బులు: దీర్ఘకాలిక జబ్బులతో బాధపడు రోగులకు, కామెర్ల రోగులకు, ఆర్థ్రైటిస్, గౌట్ మరియు బలహీన రోగులకు చెఱుకు రసము చాలా ఉపయోగకరము.
  • కళ్ళ మంటలు: చెఱుకు చెట్టుఆకుల రసమును కళ్ళ మంటలతో బాధపడురోగులకు డ్రాప్స్ లా వాడిన మంట తగ్గుతుంది.
  • శరీర కాంతి & వీర్యం: ఇది శరీరకాంతి పెంచుతుంది, వీర్యపుష్టి కలిగిస్తుంది, కఫవాత పైత్యాలను తొలగిస్తుంది.
  • ఆరోగ్య ప్రయోజనాలు: చెఱుకు రసం ఆమాశయము, కిడ్నీ, లివర్, గుండె, మెదడు, కళ్ళకు మంచిది.
  • జ్వర రోగులకు: చెఱుకు రసం నందు అల్లం, నిమ్మకాయ, కొబ్బరి నీళ్ళు కలిపి త్రాగించిన జ్వరరోగ పీడితులకు సత్వర శక్తి కలుగుతుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • చెఱుకు గెడలను శుభ్రంగా కడగాలి, తియు యంత్రమును పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
  • చెఱుకు గెడలపై ఈగలు దోమలు క్రిమి కీటకాలు చేరి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి, చెఱుకురసరి త్రాగేవాళ్ళు వీటిని గమనించడం మంచిది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 435-436)
  • రచయిత: డా|| టి. భిక్షపతి