చంగేరి (పులిచెంచలి) / Creeping Woodsorrel

From LTRC
Revision as of 11:24, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | చంగేరి (పులిచెంచలి) / Creeping Woodsorrel |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Oxalidales |- ! Family | Oxalidaceae |- ! Genus | Oxalis |- ! Scientific Name / Latin Name...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
చంగేరి (పులిచెంచలి) / Creeping Woodsorrel
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Oxalidales
Family Oxalidaceae
Genus Oxalis
Scientific Name / Latin Name ఆక్సిలిస్ కార్న్యులటా (Oxalis corniculata L.)

చంగేరి (పులిచెంచలి) అనేది 20-30 సెంటీమీటర్లు నేల బారుగా పెరిగే బహువార్షిక కలుపు మొక్క. ఈ మొక్క భారతదేశమంతటా పెరుగుతుంది. దీని ఆకులు పులుపు చిన్నగా, పచగా, రుచిగా ఉంటాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: చంగేరి
  • తెలుగు: పులిచింత / పులిచెంచలి
  • ఇంగ్లీష్: క్రీపింగ్ వుడ్‌సోరెల్ (Creeping Woodsorrel)
  • లాటిన్: ఆక్సిలిస్ కార్న్యులటా
  • కుటుంబము: Oxalidaceae

పోషక విలువలు

  • చంగేరి ఆకుల యందు విటమిన్ ఎ మరియు విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉన్నాయి, ఇది రక్తహీనత రోగులకు ఎంతొ ఉపయోగకరం.
  • ఇంకా ఇందులో కాల్షియం, పొటాషియం, సిట్రిక్ మరియు టార్టారిక్ ఆసిడ్లు కూడా అధిక పాళ్ళలో ఉండటము విశేషము.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • సాధారణ గుణాలు: ఇది అమ్ల కషాయ రసము, లఘురూక్ష గుణము, ఉష్ణవీర్యము మరియు అమ్లవిపాకము అను గుణములను, కఫవాత హరము దీపనము గ్రాహి అనే కర్మలను కలిగిఉంది.
  • అతిసారము & అర్శమోలు: దీనిని అతిసారము, అర్శమోలు, చర్మ వ్యాధులు మరియు గ్రహణి రోగములందు ఉపయోగిస్తారు.
  • మూత్రము & వాత రక్తము: పులిచెంచలిని ఆకుకూరగానే కాకుండా పప్పులో వేసికొని భుజించిన మూత్రమును జారీ చేస్తుంది, వాత రక్తమును తగ్గిస్తుంది, అగ్నిమాంద్యమును తొలగిస్తుంది, నీరసమును కూడా తొలగిస్తుంది.
  • అర్శమోలలు (స్థానిక ప్రయోగం): రక్తఅర్శమోలలకు చంగేరి ఆకు, చిత్రమూలమును నేయ్యి మరియు తైలములో వేయించి గ్రింజల మీద నిత్యత్ చేర్చి సేవించిన అర్శమోలల రోగులకు హితంగా ఉంటుంది.
  • తేలువిషము: తేలు కుట్టిన ప్రదేశము నందు చంగేరి రసము సైందవ లవణమును చేర్చిరుద్దిన యెడల తేలువిషము తగ్గుతుంది.
  • మూత్రలగుణములు: చంగేరి క్లోరోఫాం ఎక్స్‌ట్రాక్ట్‌నకు మూత్రలమును జారీ చేసే గుణమున్నట్లు ప్రయోగముల యందు గమనించారు.
  • ప్రణశోధ - వేదనాహరగుణము: చంగేరి యొక్క ఇధర్ మరియు బెంజిన్ ఎక్స్‌ట్రాక్ట్‌నకు అనాల్జిసిక్ (నొప్పి లేకుండా చేయుట) యాంటి ఇన్ఫ్లమేటరీ (ప్రణశోధహరము) మరియు యాంటి ఫైరటిక్ (జ్వరహరగుణము) లునట్లు పరిశోధనలయందు గమనించారు.
  • చంగేరి ఘృతము: ఆయుర్వేద వైద్యులు చంగేరితో తయారుచేయు చంగేరి ఘృతమును అర్శమోలు, గ్రహణి దోషములు అనాహము, మూత్రకృచ్ఛము, ప్రవాహ మరియు గుధభ్రంశ రోగములందు ఉపయోగిస్తున్నారు.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 434)
  • రచయిత: డా|| టి. భిక్షపతి