చిర్రికూర / Chirrikura

From LTRC
Revision as of 11:19, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | చిర్రికూర / Chirrikura |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Caryophyllales |- ! Family | Amaranthaceae |- ! Genus | Amaranthus |- ! Scientific Name / Latin Name | అమరాంథస...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
చిర్రికూర / Chirrikura
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Caryophyllales
Family Amaranthaceae
Genus Amaranthus
Scientific Name / Latin Name అమరాంథస్ స్పైనోసన్ లిన్నెయస్ (Amaranthus spinosus L.)

చిర్రికూర అనేది భారతదేశమంతట పెరుగుతుంది. ఇది వర్షాకాలములో ఎక్కువ. ఇది శీతలముగా, రూక్షముగా ఉంటుంది. చలువ చేస్తుంది. విషదోషాల్ని పోగొడుతుంది. అగ్ని దీప్తిని కలిగిస్తుంది. చెడు రక్తాన్ని పోగొడుతుంది. మలమూత్రములు సాఫీగా అయ్యేట్లు చేస్తుంది. వాతమును హరిస్తుంది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: తండుాలియ
  • హిందీ: బోలై
  • తెలుగు: ఎర్రములు గోరింట లేక చిర్రికూర
  • లాటిన్: అమరాంథస్ స్పైనోసన్ లిన్నెయస్
  • కుటుంబము: Amaranthaceae

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • జ్వరము & అతిసారము: జ్వరము, అతిసారము మొదలుగ రోగములందు హితముగా ఉంటుంది.
  • దగ్గు & రక్త స్రావాలు: దగ్గు, రక్త స్రావాలలో పథ్యకరంగా ఉంటుంది.
  • గడ్డలు: శరీరం మీద గడ్డలు লেచి ఇబ్బంది పెడుతున్న చిర్రికూర రసము పసుపు మరియు కొంచెము ఉప్పు కలిపి మెత్తగా నూరి గడ్డలపై కట్టిన అవి మెత్తబడతాయి.
  • లివర్ వ్యాధులు: లివర్ వ్యాధులందు చిర్రికూర రసము ఎంతో ఉపయోగకరం.
  • బహిష్టు నొప్పి: దీని గింజలను నీళ్ళలో నానవేసి ఒక వారం రోజులిచ్చిన బహిష్టు నొప్పి తగ్గుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 433)
  • రచయిత: డా|| టి. భిక్షపతి