గోంగూర / Roselle / Kenaf

From LTRC
Revision as of 11:05, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | గోంగూర / Roselle / Kenaf |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Malvales |- ! Family | Malvaceae |- ! Genus | Hibiscus |- ! Scientific Name / Latin Name | హిబిస్కస్ సబ్...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
గోంగూర / Roselle / Kenaf
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Malvales
Family Malvaceae
Genus Hibiscus
Scientific Name / Latin Name హిబిస్కస్ సబ్దారిఫా లిన్నెయిస్ (Hibiscus sabdariffa L.)

పుల్లగా రుచిగా ఉండే ఈ ఆకుకూరను ఆంధ్రులు చాలా ఇష్టంగా తింటారు. తెలుగువారు గోంగూర పచ్చడిని చాలా ఇష్టపడతారు.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: పీలు, అమ్మ్యీలు
  • హిందీ: లాల్ అంబారి
  • తెలుగు: గోంగూర / ఎజ్జి గోంగూర
  • లాటిన్: హిబిస్కస్ సబ్దారిఫా లిన్నెయిస్
  • కుటుంబము: Malvaceae

పోషక విలువలు

  • గోంగూర లేత ఆకులు మరియు స్టాక్స్ (100 గ్రాములలో):
  • తేమ: 86.2 గ్రా
  • ప్రొటీన్లు: 1.7 గ్రా
  • క్రొవ్వు (Fat): 1.1 గ్రా
  • కార్బోహైడ్రేట్: 10.0 గ్రా
  • మినరల్మేటర్: 1.0 గ్రా
  • కాల్షియం: 0.18 గ్రా
  • పాస్పరస్: 0.04 గ్రా
  • ఇనుము: 0.0054 %
  • విటమిన్ - ఎ: 2,900 I.U
  • థైమిన్: 0.02 మి.గ్రా
  • రైబోఫ్లోవిన్: 0.39 మి.గ్రా
  • నియాసిన్: 1.1 మి.గ్రా
  • విటమిన్ - సి: 20 మి.గ్రాములు
  • గోంగూర ఆకులలో మాలిక్ ఆసిడ్ 1.25% మరియు కాండమునందు 0.6% ఉండును.
  • గోంగూర పెటల్స్ నందు సిట్రిక్ ఆసిడ్ 3.74% మరియు పెక్టిన్ 3.19% లో ఉండును. దీనిని ఎక్కువగా జెల్లీల యందు చెట్టీల యందు మరియు కూరల్ని నిలువ ఉంచు పిసర్వేటివ్‌గా వాడుతారు.
  • గోంగూరఫలము నందు తేమ 76.4, సుగర్ 2.28, పెక్టిన్ 1.02, రెడ్యూజింగ్ సుగర్ 1.05, సిట్రిక్ ఆసిడ్ 1.03% ఉంటాయి. దీనిని కూడా జెల్లీలో ఉపయోగిస్తారు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • గోంగూరకు వేడిచేసే గుణముంది. రక్తమొలుల రోగులకు ఇది మంచిది కాదు.
  • చర్మవ్యాధులు మరియు ఉబ్బసం దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడువారికి కూడా మంచిది కాదు.
  • గోంగూర చూపునువృద్ధి పరుస్తుంది. గోంగూర వేప కలిపి సేవించిన వాపులు మేహ ప్రణాలు తగ్గుతాయి.
  • వాపులు మరియు గడ్డలు: గోంగూర ఆకులకు ఆముదము రాసి కొద్దిగా వేడి చేసి రాసిన అందవృద్ధి (Scrotal swelling) యొక్క వాపు తగ్గుతుంది. శరీరం మీద ఎక్కడైనా గడ్డలు వచ్చి ఇబ్బంది పెడుతున్నా గోంగూరను ఉడికించి ఆ గడ్డలపై కదితే అవి మెత్తబడి తొందరగా పగిలిపోతాయి.
  • గోంగూర ఆకులను మరియు పువ్వులను పప్పులో వేసి తిన్నగాని లేక మాంసములో వేసి తిన్న చాలా రుచిగా ఉంటుంది. గోంగూర లివర్‌కు బలాన్ని చేకూర్చుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. రేచీకటిని దూరం చేస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 428-429)
  • రచయిత: డా|| టి. భిక్షపతి