గోధుమలు / Wheat
| గోధుమలు / Wheat | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Poales |
| Family | Graminaeccae |
| Genus | Triticum |
| Scientific Name / Latin Name | ట్రిటికమ్ సెటైసమ్ (Triticum aestivum) |
దాదాపు అన్ని దేశాల్లో గోధుమలను సాగు చేస్తున్నారు. గోధుమను చాలా దేశాల్లో ఆహారంగా వాడుతున్నారు. గోధుమ చాలా బలమైన ఆహారము. ఇందులో విటమిన్లు ఎక్కువ.
గోధుమలు స్నిగ్ధముగ, గురువుగా, మధురముగా, శీతలముగా నుండును. ధాతుపుష్టి, శరీర అవయవము అనుసంధానము చేయును. దృఢత్వమును కలుగజేసే బలకరముగా ఉండును. ఇది వాతము, పైత్యము, మూత్ర దోషములను తొలగించును. ఇది శరీరానికి మంచి వర్ణమును కలిగిస్తుంది. గోధుమలను ఆడించి పిండిగా చేసుకొని రొట్టెలు / చపాతీలు, పుల్కాలుసుకొని గ్రుడ్డుతో లేక మాంసాహారముతో లేక కూరతో తింటారు.
గోధుమలతో చేసిన చపాతి / పుల్కాలు తినే వారి దంతాలు బలంగా ఉంటాయి. ఈ వ్యక్తులు దృఢంగా ఉంటారు. శ్రమపడే గుణముతో పాటు కష్టాలు సహించే తత్వము కలవారుగా ఉంటారు. చపాతీలను తాజాగా వేడివేడిగా తినడం మంచిది. అంతేకాని నిలువ ఉంచుకొని కుళ్ళిపోయి వాసన వేస్తున్న చపాతీలను తినకూడదు. ఇవి అనారోగ్యమును కలగజేస్తాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం: గోధుమ
- హిందీ: గేహూ
- తెలుగు: గోధుమలు
- లాటిన్: ట్రిటికమ్ సెటైసమ్
- కుటుంబము: Graminaeccae
పోషక విలువలు
- ప్రతి 100 గ్రాముల గోధుమలలో:
- కార్బోహైడ్రేట్లు: 71 గ్రాములు
- ప్రొటీన్లు: 18 గ్రాములు
- క్రొవ్వు: 1.5 గ్రాములు
- చక్కెర: 3 గ్రాములు
- కాల్షియం: 50 మి.గ్రా
- పాస్పరస్: 318 మి.గ్రా
- ఐరన్ (ఇనుము): 6 మి.గ్రా
- మెగ్నీషియం: 138.0 మి.గ్రా
- సోడియం: 17.1 మి.గ్రా
- పొటాషియం: 284.0 మి.గ్రా
- సల్ఫర్: 133 మి.గ్రా
- కాఫర్: 0.49 మి.గ్రా
- క్లోరిన్: 47.0 మి.గ్రాములు
- విటమిన్ - ఎ: 108 I.U
- విటమిన్ - బి1: 534 మై.గ్రాములు
- విటమిన్ - బి2: 119 మై.గ్రాములు
- నికోటినిక్ ఆసిడ్: 5 మి.గ్రా
- ఇంకా అమినో ఆసిడ్స్ ఆర్జినిన్ (5.2), హిస్టిడిన్ (1.9), ఐసోలూసిన్ (6.0), లూసిన్ (8.0), త్రైసిన్ (3.9), సిస్టిన్ (1.8), మిథియోనిన్ (2.2), ఫినైలాలానిన్ (4.6), త్రియోనిన్ (3.3), ట్రిప్టోసాన్ (1.2), వాలిన్ (6.1) మొదలగునవి గోధుమలలో ఉన్నాయి. ఇంకా విటమిన్ మరియు టోకోఫిరాల్స్ కూడా గోధుమలలో మనకు లభిస్తాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- శక్తి మరియు బలం కోసం: బ్రెಡ್డ్ / చపాతీలను ప్రతిరోజు తేనేతో పాటు గ్రుడ్డును సగం ఉడికినది కలిపి తిన్న యెడల ఇది శక్తిని కలగజేస్తుంది. నరముల బలహీనతను తొలగిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంకా రక్తహీనత రోగులకు, పోషకవిలువలు లోపించి బాధపడు చిన్నపిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా మంచి ఆహారం.
- గోధుమ జావ: గోధుమలతో చేసే జావ తేలికగా ఉండి బలమునిచ్చును ఇది శీత పిత్తములను హరించును. జ్వరములందు ఇవ్వవచ్చును.
- పాయసం మరియు పిండి వంటలు: గోధుమ నూకతో చేసిన పాయసము రుచిగా ఉండును. బలమును కలిగించును. గోధుమ పిండిమరియు నేతితో చేసి పిండి వంటలు చాలా రుచిగా ఉండి బలము కలిగిస్తాయి.
- ఇతర ఉపయోగాలు: గోధుమలతో చేసే ఆహారం వాపుతో బాధపడు రోగులకు, వాతరోగలకు దెబ్బలు తగిలిన వారికి ఎంతొ ఉపయోగకరము.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 425-427)
- రచయిత: డా|| టి. భిక్షపతి
