కాఫీ గింజలు / Coffee Beans

From LTRC
Revision as of 10:51, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" |కాఫీ గింజలు / Coffee Beans |- !Kingdom |Plantae |- !Division |Tracheophytes |- !Class |Magnoliopsida |- !Order |Gentianales |- !Family |Rubiaceae |- !Genus |Coffea |- !Scientific Name / Latin Name |కాఫీ అరబికా కాఫ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
కాఫీ గింజలు / Coffee Beans
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Gentianales
Family Rubiaceae
Genus Coffea
Scientific Name / Latin Name కాఫీ అరబికా కాఫీ రోబోస్టా (Coffea arabica / Coffea canephora)

కాఫీ తోటలకు ఎక్కువగా ఇండియా (సౌత్ ఇండియా), బ్రెజిల్, అరేబియా మొదలగు దేశాల్లో వాణిజ్య పంటగా పెంచుతున్నారు. మన దక్షిణ భారత దేశంలో కూర్గు మరియు నీలగిరి తోటల్లో దీని సాగు ఎక్కువ. చాలా మందికి కాఫీ గొంతుదిగందే పని జరగదు. కాఫీలో కొద్దిగా పోషక విలువలు కూడా ఉన్నాయి. కాఫీ అంత చిక్కగా ఉండటానికి కారణం అందులో చికోరి కలుస్తుంది. మన ఇంటికి అతిథులోస్తే కాఫీ ఇవ్వటం మన స్టేటస్ సింబల్‌గా మారింది. కాఫీ ఇవ్వకపోతే మనుల్ని ఒక కల్లరెస్ వ్యక్తులుగా పరిగణిస్తారు కదా!

వివిధ భాషల్లో పేర్లు

  • ఇంగ్లీష్: కాఫీ
  • లాటిన్: కాఫీ అరబికా కాఫీ రోబోస్టా
  • కుటుంబము: Rubiaceae

పోషక విలువలు

  • ప్రతి 100 గ్రాముల కాఫీ గింజలలో పోషకాలు మరియు ఇతర ఘటకాలు:
  • ప్రొటీన్లు: 2.2 గ్రాములు
  • క్రొవ్వు (ఫ్యాట్): 1.8 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 17.8 గ్రాములు
  • కాల్షియం: 68 మి.గ్రా
  • పాస్పరస్: 50 మి.గ్రా
  • విటమిన్ - ఎ: 102 I.U
  • తేమ: 2.5
  • కెఫిన్: 1.47
  • టానిన్: 2.33
  • బూడిద (యాష్): 4.2 శాతముతో పాటు ఎడినిక్, క్యాంటిన్, హైపోకాంటిన్, గ్వానోసిన్ ప్రొటీడ్, షుగర్, గ్లూకోజ్, లెగ్గుమిన్, డెక్స్టిన్ మొదలగునవి కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • కాఫీ ఎందుకు త్రాగాలి?: నర్వ్ స్టిమ్యులేట్ మరియు సెరిబ్రోస్టిమ్యులేట్ - కాఫీ ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. బద్ధకాన్ని తొలగిస్తుంది. కడుపులో పెరిస్టాలిక్ మూవ్‌మెంట్స్‌ను కలుగజేస్తుంది. యూరియாவை ఎక్కువ శాతంలో వెదలకుండా చేస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. చలిని దూరం చేసి వెచ్చందనాన్ని కలిగిస్తుంది. మూత్రాన్ని ఎక్కువగా వచ్చేట్లు చేస్తుంది. టెన్షన్‌ను తగ్గిస్తుంది. నీరసాన్ని తొలగిస్తుంది. హాయిగా, ఆనందంగా ఉంటుంది. స్త్రీలకు ప్రసవించు సమయమున కాఫీ ఇస్తే బాధ తెలియకుండా ఉంటుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • కాఫీ చేసే చెడు ఏమిటి?: ఎక్కువగా కాఫీ త్రాగకూడదు కాఫీ యందు "Caffene" అనే పదార్థముంది. ఇది నరాలను మరియు గుండెను ఎక్కువ ఉత్తేజానికి లోనుచేస్తుంది. గుండె అతి ఎక్కువగా కొట్టుకునేట్లు చేస్తుంది.
  • కడుపులో ఎక్కువగా ఆమ్లాలు ఉత్పత్తి చేసి ఎసిడిటిని కలిగిస్తుంది. కడుపులో పుండ్లు రావడానికి కారణమవుతుంది. ఆకలి తగ్గిస్తుంది. రక్తపోటు ఎక్కువ అవుతుంది. అతిమూత్రం కలుగుతుంది. నిద్ర రాకుండా చేస్తుంది. నరాల బలహీనతకు కారణమవుతుంది.
  • నొప్పిని భరించే శక్తి పోతుంది. తలనొప్పి వస్తుంది. బాగా చెమట పడుతుంది. సెక్స్‌లో సామర్థ్యము లోపించి నపుంసకత్వానికి కారణమవుతుంది. వీర్య నష్టము కలుగుతుంది. కాబట్టి అధికంగా కాఫీ త్రాగటం వలన అనర్థాలే గాని ఉపయోగాలు లేవు. చాలామందికి Bed Coffee త్రాగే అలవాటు ఉంటుండి. దీనిని కూడా మానివేస్తే మంచిది.
  • చిన్నపిల్లలకు, ఎడుగుతున్న పిల్లలకు కాఫీ అసలు ఇవ్వకూడదు. ఇది Metabolism మీద ప్రభావాన్ని చూసిస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 417-418)
  • రచయిత: డా|| టి. భిక్షపతి