ఖీరాదోస / Cucumber

From LTRC
Revision as of 06:47, 24 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | ఖీరాదోస / Cucumber |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes (Magnoliophyta) |- ! Class | Magnoliopsida |- ! Order | Cucurbitales |- ! Family | Cucurbitaceae |- ! Genus | Cucumis |- ! Scientific Name / Latin Name | కుకుమి...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ఖీరాదోస / Cucumber
Kingdom Plantae
Division Tracheophytes (Magnoliophyta)
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Cucumis
Scientific Name / Latin Name కుకుమిస్ సెటైవస్ లిన్నెయిస్ (Cucumis sativus L.)

వేసవిలో మనకు ఎక్కువగా లభ్యమయ్యేవి ఖీరాదోస. ఇది మధుర రసము శీతవీర్యము లఘురూక్ష గుణాలు మరియు మధురవిపాకములను కలిగి ఉంది. దీనిని రక్త పిత్తము మూత్రకృచ్ఛము, వాపు మొదలగు వ్యాధులలో ఉపయోగిస్తారు.

ఖీరాదోసను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా తింటారు. ఖీరాదోస ముక్కలకు మిరియాల పొడి మరియు ఉప్పు కలిపి తింటాము. ఇది చల్లదనాన్ని కలిగిస్తుంది. హాయిని కలిగిస్తుంది.

ఖీరాదోస రసమునకు గ్లూకోజ్ లేదా తేనే కలిపి అందులో 1-2 చంచాలు నిమ్మరసము కలిపి త్రాగితే మూత్రం చక్కగా వెడలుతుంది. ఇది అధిక రక్తపోటు రోగులకు, మూత్రం రాకుండా ఉండే రోగులకు, ఎన్సెటీస్ రోగులకు పెగ్రేన్సి (టాక్సిమిక్ కండిషన్) రోగులకు చాలా మంచిది. ఖీరాదోస ముక్కలను యథాతథంగా తిన్న దప్పిక తీరుతుంది. మధుమేహ రోగులు ఖీరాదోస తినటం మంచిది.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం: త్రపుష
  • హిందీ: ఖకడీ
  • తెలుగు: ఖీరాదోస
  • ఇంగ్లీష్: కుకుంబర్
  • లాటిన్: కుకుమిస్ సెటైవస్ లిన్నెయిస్
  • కుటుంబము: Cucurbitaceae

పోషక విలువలు

  • ప్రతి 100 గ్రాముల ఖీరాదోస యందు:
  • కార్బోహైడ్రేట్లు: 2.8 గ్రా
  • ప్రొటీన్లు: 0.4 గ్రాములు
  • క్రొవ్వు: 0.5 గ్రాములు
  • కాల్షియం: 14 మి.గ్రా
  • పాస్పరస్: 28 మి.గ్రా
  • ఐరన్: 1.4 మి.గ్రా
  • సోడియం: 9 మి.గ్రా
  • పొటాషియం: 149 మి.గ్రా
  • విటమిన్ - బి2: 4 మైక్రోగ్రాములు
  • విటమిన్ - బి1: 28 మైక్రోగ్రాములు
  • విటమిన్ - సి: 8 మి.గ్రా
  • మరియు కొద్ది మోతాదులలో విటమిన్ - ఎ కలదు. ఇంకా క్లోరిన్ మరియు సల్ఫర్లు 5.60 % లో కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • కళ్ళమంటలు - మొటిమలు, ఫ్రెష్‌నెస్ కోసం: ఖీరాదోస ముక్కలను కోసి కళ్ళమీద పెట్టిన కళ్ళు ఎర్రబడటం, మంట మొదలగునవి తగ్గుతాయి. ఖీరాదోసను గుజ్జుగా చేసి ముఖంనకు మెడకు పట్టించి 1 గంట తర్వాత కడిగి వేస్తే చాలా ఫ్రెష్‌గా హోయిగా ఉంటుంది. ముఖ సౌందర్యము ఇనుమడిస్తుంది. దీనిని ప్రతి నిత్యం వాడటం వలన మొటిమలు తొలగిపోతాయి. ముడతలు తగ్గిపోతాయి. ముఖం గరుకుతనంపోయి సున్నితత్వము చోటుచేసుకుంటుంది. అందము పెరిగి అతి తక్కువ వయస్సు కల వారిగా కనిపిస్తారు.
  • శరీర మంటలు & మూత్ర సమస్యలు: ఖీరాదోస రసాన్ని కాళ్ళకు, చేతులకు రాస్తే మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి. నేల గుమ్మడి, కరదోస గింజలు, చెటుకు రసము కలిపి త్రాగితే మూత్రం సాఫీగా అవుతుంది. దీని Renal calculi రోగులకు చాలా మంచిది.
  • కలరా వ్యాధి: కలరా రోగులు దీని ఆకుల రసము కొబ్బరి నీళ్ళు కలిపి ప్రతి రోజు గంటకు ఒక్కసారి 3-4 చంచాలు త్రాగించిన కలరా రోగులకు ఉపయుక్తంగా ఉంటుంది. దీనిని గనేరియా రోగులకు కూడా ఇవ్వవచ్చు.
  • మూత్రంలో రక్తస్రావం: ఖీరాదోస గింజలు, కొద్దిగా ఉసిరికాయ రసము మరియు గులాబీ రేకులను కలిపి ఒక వారం రోజులు క్రమంగా వాడితే మూత్రంలో రక్తంపేటటం మూత్రంలో మంట తగ్గుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 413-414)
  • రచయిత: డా|| టి. భిక్షపతి