పుట్టగొడుగు / Mushroom

From LTRC
Revision as of 13:04, 22 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="wikitable" style="float: right; margin: 0 0 1em 1em; width: 300px;" |+ '''పుట్టగొడుగు / Mushroom''' |- ! colspan="2" style="background-color: #728C00; color: white; text-align: center;" | Scientific Classification |- | '''Kingdom''' | Fungi |- | '''Division''' | Basidiomycota |- | '''Class''' | Agaricomycetes |- | '''Order''' | Agaricales |- | '''Family''' | Agaricaceae |- | '''Genus''' | ''Agaricus'' |- | '''Scientific Name''' | ''Agaricu...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
పుట్టగొడుగు / Mushroom
Scientific Classification
Kingdom Fungi
Division Basidiomycota
Class Agaricomycetes
Order Agaricales
Family Agaricaceae
Genus Agaricus
Scientific Name Agaricus campestris L.

పచ్చిక బయళ్లలో మాత్రమేకాక ప్రస్తుతం వీటిని దేశంలోని అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. పుట్టగొడుగులు బలమైన శాఖాహారము.

పుట్టగొడుగులు మధురరసము, శీతవీర్యము, పిచ్ఛిల, గురు, స్నిగ్ధ గుణము మరియు మధురవిపాకములను కలిగి ఉంది. ఇది వాతపిత్తములను శమింపజేస్తుంది. కఫాన్ని పెంచుతున్నది. దీనిని ఆమ్ల పిత్తము, శోష, దాహములందు ఔషధంగా వాడుతున్నారు.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: పుట్టగొడుగులు
  • సంస్కృతం: ఛత్రక
  • హిందీ: ఖుమీ
  • లాటిన్: అగారికస్ కంపెస్ట్రిస్ లిన్నెయస్ (Agaricus campestris)
  • కుటుంబము: Agaricaceae

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల పుట్టగొడుగుల్లో ఉండే పోషక విలువల వివరాలు:

  • తేమ: 95.2%
  • ప్రోటీన్లు: 2.74 గ్రాములు
  • కార్బోహైడ్రేట్లు: 1.6 గ్రాములు
  • క్రొవ్వు: 0.37 గ్రాములు
  • బూడిద: 0.15 మి.గ్రా
  • అయోడిన్: 130-230 మైక్రోగ్రాములు

పుట్టగొడుగుల్లో విటమిన్ - బి కాంప్లెక్స్‌లు మరియు విటమిన్ - సి లు ఎక్కువగా ఉన్నాయి. నికోటినిక్ యాసిడ్ 5.85 మి.గ్రా, పాంతోలినిక్ యాసిడ్ 2.38 మి.గ్రా, బయోటిన్ 0.018 మి.గ్రా, విటమిన్ - కె మరియు విటమిన్ - డి 0.63 మైక్రోగ్రాములున్నాయి. ఇంకా మాల్టోజ్, ఆమైలేజ్, గ్లూకోజినేజ్, ప్రోటీనేజ్, ప్రోటీనిజ్లు కూడా పుట్టగొడుగుల్లో ఉన్నాయి. పుట్టగొడుగుల రసములో ప్రోటియోలైటిక్ ఎంజైములున్నాయి.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • వ్యాధి నిరోధకత: పుట్టగొడుగులు తినటంవలన గుండెజబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్‌లు నిరోధించబడతాయి. ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను కూడా పుట్టగొడుగులను సేవించడం వలన నిరోధించవచ్చు.
  • ఆహార జాగ్రత్తలు: బలమైన శ్రేష్ఠమైన ఆహారం ఈ పుట్టగొడుగులు లేదా Mushrooms. అయితే శ్రేష్ఠమైన వాటిని మాత్రమే ఎన్నుకొని తినాలి. అప్పుడే ఆనందం, ఆరోగ్యం మన సొంతమౌతుంది. కొన్ని రకాల పుట్టగొడుగులు నాణ్యత లేకుండా లభిస్తాయి.
  • విషపదార్థాలు & హెచ్చరికలు: కొన్ని రకాల పుట్టగొడుగుల్లో "ఫల్లైడిన్" (Phalloidin) అనే విషపదార్థముంది. పుట్టగొడుగుల్లో కాలిన్, మస్కరిన్ మరియు మస్కరిడిన్ అనే టాక్సిన్స్‌లను గమనించటం జరిగింది. వీటి వలన వాంతులు, విరేచనాలు, కామెర్లు కలుగుతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 398, 399)
  • రచయిత: డా|| టి. భిక్షపతి