పచ్చపెస్సలు / Green Gram
From LTRC
| పచ్చపెస్సలు / Green Gram | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Fabales |
| Family | Fabaceae |
| Genus | Vigna |
| Scientific Name / Latin Name | Vigna radiata (L.) R. Wilczek |
మనము నిత్యం ఉపయోగించే ఆహార ధాన్యాలలో పెసలు ముఖ్యమైనవే. పెసలు చాలా శ్రేష్టమైన ఆహారం. పెసలు శీత గుణము కలిగిఉంటాయి. వాతము చేస్తాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : ముద్గ ;
- హిందీ : మూంగ్ ;
- తెలుగు : పచ్చపెస్సలు ;
- ఇంగ్లీష్ : గ్రీన్గ్రామ్ ;
- లాటిన్ : పేజియోలస్ ముంగో ;
- కుటుంబము : Fabaceae *(వ్యాసంలో కుటుంబం పేజీలో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు, బాటానికల్ వర్గీకరణ ప్రకారం జోడించబడింది)*
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల పెసల యందు:
- ప్రొటీన్లు : 24 గ్రాములు
- క్రొవ్వు : 57.3 గ్రాములు
- కార్బోహైడ్రేట్లు : 57.3 గ్రాములు
- కాల్షియం : 140 మి.గ్రా
- పొటాషియం : 583 మి.గ్రా
- సోడియం : 59 మి.గ్రా
- భాస్పరస్ : 280 మి.గ్రా
- ఐరన్ : 8.4
- విటమిన్ - ఎ : 158 I.U
- విటమిన్ - బి 1 : 465 మై.గ్రో
- విటమిన్ - బి 2 : 387 మై.గ్రో
- నియాసిన్ : 2 మి.గ్రా కలవు.
ఇందులో అనేక రకాల ఎమినో ఆసిడ్స్ కూడా అవి.
- ల్యూసిన్ : 7.7 గ్రా
- లైసిన్ : 7.0 గ్రా
- సిస్టిన్ : 0.6 గ్రా
- ఐసోల్యూసిన్ : 6.3 గ్రా
- ఆర్జಿನಿన్ : 6.3గ్రా.
- హిస్టిడిన్ : 2.7
లాతో పాటు మిథియోనిన్, ఫినైలనిన్, ట్రియోనిన్, ట్రిప్టోపాన్ మరియు వాలిన్ కూడా ఇందులో ఉన్నాయి.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- బలవర్ధక ఆహారం: పెసల యందు కావల్సినన్ని విటమిన్లు మరియు ఎమినోఆసిడ్ ఉన్నాయి. ఇవి చాలా బలమైన ఆహారము పిల్లలు, వృద్ధులు మరియు గర్భణీస్త్రీలు నిర్వయంగా తినొచ్చు.
- మలబద్ధకం & జీర్ణ సమస్యలు: ఎక్కువ తింటే కొంచెము మలబద్ధకము కలగుతుంది. వాంతులు విరేచనాలతో బాధపడు రోగులకు, కామెర్లు, కంటిజబ్బుల రోగులకు చాలా మంచి ఆహారం.
- தாக హారిణి & ఉబ్బసం: మనకు ఇప్పటికి దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పెసరపప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఆకులు, తురిమిన పచ్చికొబ్బరి, నిమ్మరసము, ఉప్పు మొదలుగువానిని కలిపి తిన్నయెదల ఎంతో మధురంగా ఉంటుంది. వేసవి తాపాన్ని హరిస్తుంది. దప్పికను తీరుస్తుంది.
- మూత్ర విసర్జన: మూత్రాన్ని సాఫీగా వెடలునట్లు చేస్తుంది.
- జ్వరాలు & అసిడిటీ: పెసలను కలరా, మీసీల్స్, స్మాల్పాక్స్, టైపాయిడ్ రోగులు తినవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అసిడిటీ, కడుపులో మంట, కామెర్లు అర్శమోలల రోగులకు కూడా ఉపయోగకరమే.
- చర్మ దుర్వాసన నివారణ: పెసలు, చందనము, కచ్చురాలు, వట్టివేళ్ళు, పసుపులను కలిపి, చూర్ణము (పాడర్) చేసి దానితో స్నానము చేస్తే చెమట దుర్గంధము తొలగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 535-536)
- రచయిత: డా|| టి. భిక్షపతి
