బచ్చలి / Malabar Spinach

From LTRC
Revision as of 19:08, 26 August 2026 by Abhinaya (talk | contribs) (Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | బచ్చలి / Malabar Spinach |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Caryophyllales |- ! Family | Basellaceae |- ! Genus | Basella |- ! Scientific Name / Latin Name | Basella rubra L. |} భార...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
బచ్చలి / Malabar Spinach
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Caryophyllales
Family Basellaceae
Genus Basella
Scientific Name / Latin Name Basella rubra L.

భారతదేశములోనే కాక అనేక చోట్ల బచ్చలిని ఆకుకూర కోసం పెంచుతున్నారు. దీని తీగలు ఎరుపు తెలుపు రకాలున్న విలువలు మాత్రము ఒక్కటే. ఇది మాంసాహారముల కంటే చక్కని పోషకవిలువలను కలిగిఉంది. బచ్చలి శీతల గుణాన్ని కలిగి ఉంటుంది. బచ్చలి యందు

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : పోతకి ;
  • హిందీ : లాల్ బచ్చలు పోయ్ ;
  • తెలుగు : బచ్చలి ;
  • లాటిన్ : బసెల్లా రుబ్రా లిన్నెయస్ ;
  • కుటుంబము : Basellaceae ;
  • ఆంగ్లం : Malabar Spinach

పోషక విలువలు

బచ్చలి యందు (ప్రతి 100 గ్రాములకు):

  • తేమ : 92.1 గ్రా
  • ప్రొటీన్లు : 20 గ్రా
  • క్రొవ్వు : 0.7 గ్రా
  • ఫైబర్ (నార) : 0.6 గ్రా
  • ఖనిజలవణములు : 1.7 గ్రా
  • మెగ్నీషియం : 84 మి.గ్రా
  • పాస్పరస్ : 21 మి.గ్రా
  • సోడియం : 28.5 మి.గ్రా
  • కాఫర్ : 0.01 మి.గ్రా
  • ఐరన్ : 10.9 మి.గ్రా
  • పొటాషియం : 206 మి.గ్రా
  • సల్ఫర్ : 30 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 9,300 I.U
  • రైబోఫ్లేవిన్ : 0.07 యూనిట్స్
  • మరియు విటమిన్ సి : 23 యూనిట్స్ కలవు.

అయోడిన్ మరియు లెసిథిన్ 0.009 మి.గ్రాములు కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో ఎమినో ఆసిಡ್స్ అయిన ఆర్జినిన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైలనిన్, థిరోసిన్, ట్రిప్టోపాన్ మరియు వాలిన్లు కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • సాధారణ ఆరోగ్యం & రక్తస్రావ నివారణ: బచ్చలి కూర పప్పుతో కలిసి వండుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మాంసములంటే ఇష్టం లేని వారు బచ్చలిని తిన్న ఆ లోటుకు పూడ్చవచ్చు. బచ్చలి రక్తస్రావాన్ని ఆపుతుంది. బలాన్ని కలిగిస్తుంది. శుక్రాన్ని వృద్ధి చేస్తుంది. కఫాన్ని బరువును పెంచుతుంది.
  • పిల్లల్లో పోషకాహార లోపం & అతిసారం: ఐరన్ మరియు ప్రొటీన్ల తగ్గుదల వలన అనేక రకాల సమస్యలను మన చిన్నారి పసిపాపలు ఎదుర్కొంటున్నారు. అతిసారము విరేచనాలు మరొక సమస్య. ఇలాంటి వారందరికి రోజు బచ్చలి రసం 1-3 చంచాలు త్రాగించిన ఈ సమస్యలను అధిగమించవచ్చు. అలాగే రక్తహీనత రోగులకు కూడా బచ్చలి ఎంతో మేలు చేస్తుంది. మాంసము, గ్రుడ్లు, చేపలు తినలేని శక్తిలేని సేదవాళ్ళు బచ్చలిని రోజు తినటం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు ఇందులో ఎన్నో ఏమైనో ఆసిడ్స్ కలవు.
  • గర్భిణీ స్త్రీలకు ఉపయోగం: గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ ఆసిడ్ చాలా అవసరం. బచ్చలి కూర తినటం గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. దీనివలన అబార్షన్ కాకుండా అధిక రక్తస్రావము కాకుండా కూడా ఉపయోగపడుతుంది.
  • మూత్రపిండాల సమస్యలు & ప్రొస్టేట్: బచ్చలి ఆకులు, కులుద్ధ (ఉలవలు) మరియు నిమ్మరసం కలిపి చక్కని సూప్ చేసుకొని త్రాగిన మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి. ఇది పౌరుష గ్రంథి యొక్క పెరుగుదలను కూడా నిరోధిస్తుంది.
  • డైయూరిటిక్ గుణాలు & దీర్ఘకాలిక వ్యాధులు: బచ్చలి ఆకురసం మరియు పచ్చి కొబ్బరి నీళ్ళు కలిపి త్రాగిన డైయూరిటిక్గా పనిచేస్తుంది. హైపర్ టెన్సన్, టాక్సిమియా ప్రెగ్న్సీ, గుండె జబ్బులు, గనేరియా, మూత్రం కష్టంగా వెదలటం లాంటి జబ్బులు తగ్గుతాయి.
  • జ్ఞాపకశక్తి & నిద్రలేమి: బచ్చలి ఆకుల రసము బ్రాహ్మి ఆకులరసము కలిపి పిల్లలకు ఇచ్చిన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చక్కగా నిద్రపడుతుంది. అంతేకాక రుమాటాయిడ్ ఆర్ధ్రైటీస్ రోగుల నొప్పి తగ్గుతుంది.
  • దంతాలు & గొంతు సమస్యలు: బచ్చలి ఆకుల రసం నందు పంచదార కలిపి త్రాగిన పళ్ళునుండి రక్తం ಕಾರడం తగ్గుతుంది. బచ్చలి ఆకుల్ని నమిలి మింగిన దంత రోగాలు నిరోధించబడతాయి. బచ్చలి ఆకులను మెత్తగా నూరి గడ్డలపై కట్టిన గడ్డలు మెత్తబడి పగులుతాయి. బచ్చలి ఆకుల రసము మరియు ఉప్పు కలిపి డికాక్షన్ చేసుకొని గాలిలింగ్ చేసిన గొంతునొప్పి, టాన్సిల్స్ వాపు, జలుబు గొంతు గరగర తగ్గుతుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 539-540)
  • రచయిత: డా|| టి. భిక్షపతి