జాజికాయ (Nutmeg)

From LTRC
Revision as of 10:04, 11 September 2026 by Abhinaya (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
జాజికాయ (Nutmeg)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం (Kingdom): Plantae
కుటుంబం (Family): Myristicaceae
ప్రజాతి (Genus): Myristica
జాతి (Species): M. fragrans
ద్వినామ నామకరణము
Myristica fragrans

జాజికాయ అనేది మైరిస్టికేసి (Myristicaceae) కుటుంబానికి చెందిన ఒక సుగంధ ద్రవ్య వృక్షం. దీని శాస్త్రీయ నామం మిరిస్టికా ఫ్రాగ్రన్స్ (Myristica fragrans). ఇది సుమారు పది మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షము. దీనికి జాతిఫల (సుగంధ యుక్తఫలము), జాతి కోశ (సుగంధమైన కోశము కలది), మదశౌండ (మద్యము వలే మత్తును కలిగించునది) అను పేర్లు కలవు.

జాతి ఫలము అండాకారములో లేక గోళాకారములో ఉంటుంది. దీని ఫలము నందు, పత్రము నందు, త్వక్ నందు సుగంధిత తైలముండును. ఇందులో మిరిస్టిక్, మిరిస్టిసిన్ యాసిడ్ అనునవి ఉంటాయి. జాతి ఫలమునందు ఫిక్స్డ్ ఆయిల్ కూడా ఉండును.

వివిధ భాషల్లో పేర్లు

  • తెలుగు: జాజికాయ
  • సంస్కృతం: జాతిఫల
  • హిందీ: జాయఫల్
  • లాటిన్: మిరిస్టికా (ఫ్రాగ్రన్స్)
  • కుటుంబము: Myristicaceae

ఆయుర్వేద గుణాలు

  • రసము: కటుతిక్త రసము
  • గుణము: లఘుతీక్ష్ణ గుణము
  • వీర్యము: ఉష్ణవీర్యము
  • విపాకము: కటువిపాకము
  • దోష ప్రభావం: కఫవాతహరము
  • కర్మలు: దీపనము, రోచనము, గ్రాహి, స్వర్యము

ఆయుర్వేదంలో దీనిని అతిసారము, గ్రహణి, తృష్ణ, కాస, పీనసము, శోష, హృద్రోగము, చర్మవ్యాధులు, వాంతులు మరియు ముఖ వై రస్యము నందు ఉపయోగిస్తారు.

పోషక విలువలు

జాజికాయ నందు పెక్టిన్ కూడా ఉంది.

  • కార్బోహైడ్రేట్లు: 119 గ్రాములు
  • ప్రోటీన్లు: 7.5 గ్రా
  • క్యాల్షియం: 119 గ్రాములు
  • ఫాస్పరస్: 238 మి.గ్రా
  • ఐరన్: 4.5 గ్రాములు

ఔషధ ఉపయోగాలు

  • లైంగిక శక్తి: జాజికాయ చూర్ణమును పాలతో కలిపి సేవించిన లైంగికశక్తి పెరుగుతుంది.
  • నిద్రలేమి & తలనొప్పి: జాజికాయ పొడిని పాలతో కలిపి సేవించిన చక్కగా నిద్రపడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తలనొప్పి తగ్గుతుంది.
  • మొటిమలు & కాళ్ళ పగుళ్లు: జాజికాయ, చందనము, మిరియాలను కలిపి మెత్తగా నూరి రాసిన మొటిమలు తగ్గుతాయి. మెత్తగా నూరి ఆ గంధాన్ని రాసిన కాళ్ళపగుళ్లు తగ్గుతాయి.
  • అతిసారము & అజీర్ణము: ఇది ప్రోస్టాగ్లాండిన్ సింథసిస్‌ను నిరోధించి అతిసారాన్ని అరికడుతుంది. అరటిపండు లేదా ఆపిల్ జ్యూస్‌తో కలిపి వాడితే అతిసారము, అజీర్ణము తొలగును.
  • చర్మ వ్యాధులు: వ్యంగ్యం, నీలికా, ముఖకృష్ణత్వము మరియు చర్మ వ్యాధులు తగ్గుతాయి.
  • హృదయ ఆరోగ్యం: గుండెనొప్పిగా బరువుగా అనిపించినప్పుడు దీని పొడి కలిపి త్రాగితే ఉపశమనం లభిస్తుంది.
  • డిప్రెషన్ & బిపి: ఉసిరి రసముతో కలిపి సేవించిన డిప్రెషన్ తగ్గుతుంది. హైపర్ టెన్షన్ రోగులకు హితంగా ఉంటుంది.
  • కీళ్ల నొప్పులు: నువ్వుల నూనెలో జాజికాయ ముక్కలు వేసి కాచి ఆ తైలమును రాసిన కీళ్లజబ్బులు, తలనొప్పి, నరాల బలహీనత, సియాటిక్ పెయిన్ తగ్గుతాయి.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 452, 453) - రచయిత: డా|| టి. భిక్షపతి