సీతాఫలము / Custard Apple
From LTRC
| సీతాఫలము / Custard Apple | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Magnoliales |
| Family | Annonaceae |
| Genus | Annona |
| Scientific Name / Latin Name | Annona squamosa L. |
సీతాఫలము (Annona squamosa L.) అనొనేసి (Annonaceae) కుటుంబానికి చెందినది. ఇది చిన్నవృక్షము. దీనిని భారతదేశమంతటా పెంచుతున్నారు. సీతాఫలము చాలా రుచిగా మధురంగా చక్కని సువాసన కలిగి ఉంటుంది. ఎంత తిన్న తనివి తీరని పండు సీతాఫలము. సీతాఫలము మధురరసము శీతవీర్యము గురుగుణము మధుర విపాకములనే గుణాలను కలిగి ఉంది. సీతాఫలము బల్యము బృంహణము వాతపిత్తహరము అను కర్ణలను కలిగి ఉంది. దీని మూలము విరేచన గుణము కలిగి ఉంది. సీతాఫలము గింజలుగర్భపాతక గుణాలను కలిగి ఉంది.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : సీతాఫల
- హిందీ : షరీఫా
- తెలుగు : సీతాఫలము
- ఇంగ్లీష్ : కస్టర్డ్ ఆపిల్
- లాటిన్ : అనోనా స్క్యామోసా లిన్నెయెస్
- కుటుంబము : Annonaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రా సీతాఫలము నందు:
- ప్రొటీన్లు: 2 గ్రా
- కార్బోహైడేట్లు: 29 గ్రా
- క్రొవ్వు: 0.6 గ్రా
- సోడియం: 13.8 మి.గ్రా
- ఇరన్: 1 మి.గ్రా
- సల్ఫర్: 13.8 మి.గ్రా
- మెగ్నీషియం: 23.9 మి.గ్రా
- క్లోరిన్: 40 మి.గ్రా
- కాఫర్: 0.15 మి.గ్రా
కలవు. ఇందులో విటమిన్ సి కూడా ఉంది సీతాఫలములో సుక్రోజ్, గ్లూకోజ్‌లు ఎక్కువ కలవు. సీతాఫలము గింజలయందు రెసిన్ మరియు ఆయిల్ కలదు. సీతాఫలము గింజలయందుహైడ్రోసయానిక్ ఆసిడ్ కలదు. సీతాఫలము Annonaine అను అంశములు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు & ఆరోగ్య ప్రయోజనాలు: సీతాఫలమును పేలు, దాహము, రక్తపిత్తము క్రిమిరోగాలు మరియు విథ్రది యందు ఉపయోగిస్తారు. సీతాఫలము హృదయానికి మంచిది. కడుపులో మంటను తగ్గిస్తుంది.
- తలలోని పేలు & చుండ్రు: సీతాఫలము గింజలను / ఆకులను మెత్తగా నూరి తలకు పట్టినించిన తలలోని పేలు చచ్చిపోతాయి. సీతాఫలము గింజలను తలకు రాసుకున్న షాంపులా పనిచేస్తుంది చుండ్రును తొలగిస్తుంది.
- గడ్డలు: సీతాఫలము ఆకులను మెత్తగా నూరి సెగగడ్డల మీద లేపనం చేసిన గడ్డలు మెత్తబడిపగిలి స్రావము బయటికి వెలుబడుతుంది.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- సీతాఫలగింజలను ಸೇವించిన గర్భస్రావము కలుగుతుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 607-608) - రచయిత: డా|| టి. భిక్షపతి
