మిరపకాయలు / Chilli Pepper
From LTRC
| మిరపకాయలు / Chilli Pepper | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Solanales |
| Family | Solanaceae |
| Genus | Capsicum |
| Scientific Name / Latin Name | Capsicum annuum L. |
మిరపకాయలు (Capsicum annuum) సొలనేసి (Solanaceae) కుటుంబానికి చెందిన మొక్క. భారతదేశంలోని చాలా చోట్ల మిరపకాయలను పండిస్తున్నారు, ముఖ్యంగా గుంటూరు జిల్లా మిరపకాయలకు మరియు పొగాకుకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇవి ఆహారానికి రుచిని, ఘటును కలిగిస్తాయి మరియు వివిధ ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : కటువీరా
- హిందీ : లాల్మిర్చి
- తెలుగు : మిరప
- లాటిన్ : క్యాప్సికమ్ అన్న్యమ్ లిన్నెయెస్
- కుటుంబము : Solanaceae
- ఇంగ్లీష్ : Chilli Pepper
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల మిరపకాయలందు లభించే పోషక విలువలు:
- ప్రొటీన్లు: 18.2 గ్రా
- క్రొవ్వు: 15.1 గ్రా
- కార్బోహైడేట్లు: 36.2 గ్రా
- కాల్షియం: 480 మి.గ్రా
- పాస్ఫరస్: 390 మి.గ్రా
- ఇరన్ (ఇనుము): 30.5 మి.గ్రా
- నియాసిన్: 2.5 మి.గ్రా
- రైబోఫ్లోవిన్: 0.39 మి.గ్రా
- విటమిన్ - ఎ: 864 I.U
- విటమిన్ - సి: 3.5 మి.గ్రా
- సోడియం: 6.5 మి.గ్రా
- మెగ్నీషియం: 24 మి.గ్రా
- పొటాషియం: 217 మి.గ్రా
- ఫైబర్: 6.8 మి.గ్రా
- కేలరీలు: 157 గ్రా
- కాఫర్: 1.55 మి.గ్రా
- మెగ్నీషియం: 24 మి.గ్రా
- సల్ఫర్: 34 మి.గ్రా
- క్లోరిన్: 15 మి.గ్రా
- ఆక్సాలిక్ యాసిడ్: 67 మి.గ్రా
- నికోటినిక్ యాసిడ్: 0.9 మి.గ్రా
మరియు మిరపకాయల యందు క్యాప్సిక్యూటిన్ అనునది ముఖ్యమైన అంశము. దీని వలన దాని కంఠఘాటు మిరపకాయలందు ఫిక్‌్సడ్ ఆయిల్ కూడా ఉంటుంది. పచ్చి మిరపకాయలందు రూటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- సాధారణ గుణాలు: మిరప దీపనము, కఫవాతశామకము పిత్తవర్ధకమును అను గుణములు కలిగి ఉంది. మిరపను మేదోరోగము అజీర్ణము లందు ఉపయోగిస్తారు.
- వైద్యపరమైన ఉపయోగాలు: పచ్చిమిరపలోని రూటిన్ అనే పదార్థమును వేరుచేసి ఆపరేషన్‌కు ముందు, ఆపరేషన్ తర్వాత కాపిల్లరీషర్ నిరోధించడానికి, X - రే మరియు రేడియం దుష్పరిణామాలను నిరోధించడానికి, క్షయ వ్యాధి మందుల విష ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు.
- జుట్టు మరియు నొప్పుల నివారణ: మిరపకాయలోని క్యాప్సియిసిన్ మరియు కొబ్బరి నూనె కలిపి తలకు రాస్తే జుట్టు రాలిపోవటం తగ్గుతుంది. మిరపకాయ నుండి తీసిన ఆయిల్లో ఆముదం నూనె కలిపి కీళ్ళనొప్పులున్న చోట రాస్తే అనాల్జెసిక్ గుణంతో నొప్పులు తగ్గుతాయి.
- ప్రథమ చికిత్స & ఇతర చికిత్సలు: కొద్దిగా మిరపపొడి నీళ్లలో తడిపి పాముకాటు, కుక్కకాటుకు ప్రథమ చికిత్సగా వాడవచ్చు. అర్ధమోముల రోగాలు, హైపర్ టెన్షన్ రోగాలు మరియు అతిసారము రోగాలు బాగా తగ్గించి వాడాలి.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- ఎక్కువ తింటే అనేక వ్యాధులను కలిగిస్తుంది. అధికంగా కారం తింటే కడుపులో మంట మరియు అసిడిటీ ఎక్కువ కావటం జరుగుతాయి.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 568-569) - రచయిత: డా|| టి. భిక్షపతి
