మాదీఫలము / Citron
From LTRC
| మాదీఫలము / Citron | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Sapindales |
| Family | Rutaceae |
| Genus | Citrus |
| Scientific Name / Latin Name | Citrus medica |
మాదీఫలము (Citrus medica) అనేది రూటేసి (Rutaceae) కుటుంబానికి చెందినది. ఇది సుమారు నాలుగు మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షము. దీని ఫలాలు మధుర ఆమ్లరసము కలిగి ఉండి, వివిధ ఆయుర్వేద మరియు ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడతాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : మాయలుంగా
- హిందీ : తురంజ్ / బీజార
- తెలుగు : మాదీఫలము
- లాటిన్ : సిట్రస్ మెడికా లిన్నೆಯెస్
- కుటుంబము : Rutaceae
- ఇంగ్లీష్ : Citron
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల మాదీఫలము నందు లభించే పోషక విలువలు:
- ప్రొటీన్లు: 11 గ్రా
- కార్బోహైడేట్లు: 11 గ్రా
- క్రొవ్వు: 0.9 గ్రా
- ఐరన్: 2.3 మి.గ్రా
- కాల్షియం: 70 మి.గ్రా
- భాస్వరస్: 10 మి.గ్రా
- విటమిన్ - బి1: 20 మై.గ్రా
- విటమిన్ - బి2: 4 మై.గ్రా
- విటమిన్ - సి: 40 మి.గ్రా
- మరియు విటమిన్ ఎ కొద్ది శాతములో కలవు. మాదీఫలము యొక్క తొక్కల (పై చర్మము) యందు లైమోనిన్, డిపెంటిన్ మరియు సిట್ರಾಲ್ లు కలవు.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- వాంతులు మరియు వికారము: మాదీఫల రసాయనము అను సిరఫ్ను మార్నింగ్ సిక్నెస్, వికారము, వాంతులు, వాంతి వచ్చినట్లుండుట, తలతిరుగుట లాంటి లక్షణము లందు ఉపయోగిస్తారు.
- ఆకలి మరియు జీర్ణ సమస్యలు: మాదీఫలము నందు తేనె కొద్దిగా ఉప్పు కలిపి త్రాగిన ఆకలి లేకపోవటము, వాంతులు, తలతి్రిస్పూట తగ్గుతుంది. కడుపుబ్బరం తొలుగుతుంది.
- గుండె మరియు ఇతర ఆరోగ్య సమస్యలు: గుండెదడ తగ్గుతుంది. మరియు ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ తగ్గుతుంది. దీనిని ప్రతిరోజు సేవించడం వలన మధుమేహము మరియు మూత్రశ్చరీ రోగాలు నివారించబడతాయి.
- మద్యం ప్రభావం: మాదీఫల రసాయనము అధిక మద్యసేవనము వలన కలిగే బాధలను నివారిస్తుంది.
- తేలు కుట్టు మరియు న్యుమోనియా/బుతుదోషాలు: మాదీఫలము గింజలను మెత్తగా నూరి తేలు కుట్టిన చోటపెట్టిన మంట పోటు తగ్గుతుంది. దీని గింజలు తేనె మరియు ఉప్పు కలిపి రోజుకు 2-3 గ్రాములు చొప్పున ఇచ్చిన బుతుదోషాలు తొలుగును.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- ఉష్ణవీర్యము మరియు ఆమ్లవిపాకములను కలిగి ఉంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 566-567) - రచయిత: డా|| టి. భిక్షపతి
