బియ్యము / Rice

From LTRC
Revision as of 07:46, 11 September 2026 by Abhinaya (talk | contribs) (→మూలాలు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
బియ్యము / Rice
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Poales
Family Graminae
Genus Oryza
Scientific Name / Latin Name Oryza sativa L.

ప్రపంచ దేశాలన్నింటిలో సాగుచేయబడుతున్న పంట వరి. వీటిని గ్రైండ్ చేసి పాలిష్ చేసి బजारంలో బియ్యముగా లభ్యమౌతున్నాయి. వరిలో అనేక రకాలు ఉన్నాయి. వరిలో ప్రొటీన్లు, క్రొవ్వు మరియు మినరల్స్ చాలా తక్కువలో ఉన్నాయి.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృతం : శాలిధాన్యము ;
  • హిందీ : చావల్ ;
  • తెలుగు : వరి ;
  • ఇంగ్లీష్ : రైస్ ;
  • లాటిన్ : ఒరిజా సెటైవా ;
  • కుటుంబము : Graminae ;

పోషక విలువలు

ప్రతి 100 గ్రాముల బియ్యం నందు:

  • కార్బోహైడ్రేట్లు : 78 గ్రా
  • ప్రొటీన్లు : 8.5 గ్రా
  • క్రొవ్వు : 0.6 గ్రా
  • కాల్షియం : 14 మి.గ్రా
  • ఐరన్ : 4.0 మి.గ్రా
  • పొటాషియం : 280 మి.గ్రా
  • పాస్పరస్ : 18 మి.గ్రా
  • విటమిన్ - ఎ : 4.1 I.U
  • విటమిన్ - బి 1 (థైమిన్) : 170 మై.గ్రా
  • విటమిన్ - బి 2 (రైబోఫ్లేవిన్) : 118 మై.గ్రా మరియు
  • నికోటినిక్ ఆసిడ్ : 3.5 మి.గ్రా కలవు.

ఇంకా ఆర్జినిన్, హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, సిస్టిన్, మిధియోనిన్, ఫినైలనిన్, ట్రియోనిన్, ట్రిప్టోపాన్ మరియు వాలిన్ అనే ఎమినో ఆసిడ్స్ కలవు.

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • శరీర శక్తి & జీర్ణక్రియ: పూర్వకాలంలో వరిగింజలను రోలులో వేసి చక్కగా దంచి ఆ బియ్యాన్ని వాడటం వలన తౌడు కూడా ఉండేది. అది శరీరానికి ఎంతో శక్తినిచ్చేది. బియ్యాన్ని కడుగుట వలన అందులోని విటమిన్లు పోతాయి. విటమిన్ - బి లోపం వలన బెరిబెరి అనే వ్యాధి వస్తుంది.
  • రకాలు & ఆయుర్వేద విశేషాలు: ఆయుర్వేద సంహితల యందు 60 దినములలో పండే షష్టికా ధాన్యమును చాలా శ్రేష్టమైనవిగా పేర్కొన్నారు. బియ్యం తెల్లనివి, ఎ红నివి ఉన్నాయి. ఎ红బియ్యం సర్వశ్రేష్టమైనవి. ఇవి మధురరసమును కలిగి ఉంటాయి. శుక్రాన్ని పెంచుతాయి. దప్పికను తీరుతాయి. కొంచెము మలబద్ధకాన్ని కలిగిస్తాయి. మూత్రంను సాఫీగా వెదలనట్లు చేస్తాయి.
  • బాసుమతి & వంటకాలు: చక్కని సువాసనను కలిగి ఉండే బాసుమతి రైస్ దేశవిదేశాల్లో ఎంతో పేరు ప్రతిష్టలు పొందినది. బియ్యం కొత్త వాటిలో సెల్యులోజ్ ఎక్కువ. అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.
  • కేరళ ఉడికించిన బియ్యం: కేరళ ప్రజలు ఉపయోగించే ఉడికిన బియ్యం చక్కని పోషక విలువలను కలిగి ఉంటుంది. అందులో రైబోఫ్లేవిన్ మరియు నియాసిన్లు నష్టపోకుండా ఉంటాయి. అది చాలా మంచి ఆహారమే.
  • వివిధ వంటకాలు & ప్రయోజనాలు: బియ్యంతో పంచదార లేదా బెల్లం, కొబ్బరి కలిపి తయారుచేసే పరమాన్నం చక్కని రుచిని కలిగి ఉంటుంది. అదسసారం, విరేచనాలు మరియు అర్శమోసులతో బాధపడే వారికి అన్నమునందు మజ్జిగ కలుపుకొని తింటే చక్కని ఉపశమనము కలుగుతుంది. బియ్యాన్ని వేయించి దానితో కాచే గంజి జ్వరంతో బాధపడే వారికి ఎంతొ హాయినిస్తుంది. ఇడ్లీ తేలికగా జీర్ణమౌతుంది. రోగులకు మంచి ఆహారము. ఇది లివర్ కూడా మంచిదే.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 548-549) - రచయిత: డా|| టి. భిక్షపతి