బీరకాయ / Ridge Gourd
From LTRC
| బీరకాయ / Ridge Gourd | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Cucurbitales |
| Family | Cucurbitaceae |
| Genus | Luffa |
| Scientific Name / Latin Name | Luffa acutangula (L.) Roxb. |
భారతదేశమంతటా పండించే బీరకాయలు చక్కని ఆహార వస్తువు. బీరపువ్వులు పసుపు పచ్చగా ఉండి బీరపాదుకే అందాన్ని తెస్తాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృతం : కోశాతకీ ;
- హిందీ : తోరాయ్ ;
- ఇంగ్లీష్ : రిడ్జ్గార్డ్ ;
- తెలుగు : బీరకాయ ;
- లాటిన్ : లూఫా అక్కుటాంగులా ;
- కుటుంబము : Cucurbitaceae ;
పోషక విలువలు
బీరకాయలో (ప్రతి 100 గ్రాములకు):
- తేమ : 95.2 గ్రా
- ప్రొటీన్లు : 0.5 గ్రా
- క్రొవ్వు : 0.4 గ్రా
- కార్బోహైడ్రేట్లు : 4.2 గ్రా
- ఖనిజలవణము : 0.3 గ్రా
- కాల్షియం : 40 మి.గ్రా
- మెగ్నీషియం : 11 మి.గ్రా
- సోడియం : 2.9 మి.గ్రా
- పొటాషియం : 50 మి.గ్రా
- ఐరన్ : 2 మి.గ్రా
- సల్ఫర్ : 13 మి.గ్రా
- కాఫర్ : 0.16 మి.గ్రా
- పాస్పరస్ : 40 మి.గ్రా
- క్లోరిన్ : 7 మి.గ్రా
- విటమిన్ - ఎ : 57.5 I.U
- విటమిన్ - బి 1 : 66 మై.గ్రా
- విటమిన్ - బి 2 : 10 మై.గ్రా
- విటమిన్ - సి : 5 మి.గ్రా
- నికోటినిక్ ఆసిడ్ : 0.2 మి.గ్రా
- ఆగ్జాలిక్ ఆసిడ్ : 27 మి.గ్రా మరియు కేలరీలు : 18 కలిగి ఉంది.
ఇంకా బీరకాయ గింజల యందు 20% సపోనిన్ గ్లైకోసైడ్, ఎంజైమ్, మరియు ఫిక్స్డ్ ఆయిల్స్ కలవు. ఈ తైలము జంతువులపై జరిపిన పరిశోధనలో అధిక లాలా స్రావము, వాంతులు మరియు విరేచనములను కలిగిస్తుంది. బీరకాయ లంసు ఉండే రసాయన పదార్థము ఎమిలిన్నకు దగ్గర పోలికలు కలిగి ఉంటుంది.
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- అమీబియాసిస్ నివారణ: అమీబియాసిస్ రోగులకు అమీబిక్ డిసెంట్ర్ మంచిది.
- సాధారణ గుణాలు & ఆకలి: బీరకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. చలువ చేస్తుంది. తేలికగా జీర్ణమౌతుంది. ఆకలిని పెంచుతుంది. కడుపులో మంట తగ్గుతుంది.
- వివిధ వ్యాధులు: జ్వరము, ఆయాసము దగ్గు, క్రిమి రోగులకు పథ్యకరమైనది. మధుమేహ రోగులకు చాలా మంచిది.
- పచ్చడి తయారీ & ప్రయోజనాలు: బీరకాయను చక్కని కడిగి దాని మీద ఉన్న తౌక్కును పైచర్మ్యాన్ని పీలర్తో చక్కని తీసి అందులో పచ్చి మిరపకాయలు కలిపి ఈ రెండింటిని నూనెలో వేయించి తీసి దానికి కొంత చింతపండు, కొంచెము ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు కలిపి నూరుకొని తాలింపు వేసుకొని దానిని తిన్న యెడల చక్కని రుచి మీ సొంతం. జ్వరం నందు యాంటీబయోటిక్స్ వాడి రుచి తెలియక ఇబ్బందిపడురోగీలకు ఈ పచ్చడి ఎంతో రుచిని కలిగిస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణశక్తి కలిగిస్తుంది. అయితే ఎక్కువ తింటేవేడి చేస్తుంది.
- మధుమేహం & శ్లేష్మం: బీరకాయ మరియు పాలు కలిపి వండితే ఆ రుచి చెప్పలేనది. బీరాకుల రసము ప్రతిరోజు త్రాగిన మధుమేహ రోగులకు ఉపయోగకరము. బీరకాయ లేత ఆకుల కషాయము ಸೇವించిన శ్లేష్మమును హరిస్తుంది.
- కంటి సమస్యలు & చర్మ వ్యాధులు: బీర ఆకులను మెత్తగా నూరి రసము తీసి దానిని కళ్ళలో వేసిన కండ్లమంటలు, కంజెక్టివైటిస్ తగ్గుతుంది. దీని ఆకుల రసమును చర్మవ్యాధులు, అర్శమోసుల యందు రాసిన చక్కని ఉపశమనము కలుగుతుంది.
- పుండ్లు & మలబద్ధకం: బీర ఆకులను వెల్లుల్లిపాయలతో కలిసి మెత్తగా నూరి పుండ్లపై పట్టువేస్తే లేప్రసి రోగులకు ఉపశమనంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజు కూర చేసుకొని తినటం వలన మలబద్ధకము తొలగుతుంది.
- పిల్లల ఆరోగ్యం & గింజల గుణాలు: బీరకాయ కూర ప్రతిరోజు వాడటం వలన పిల్లలకు కావల్సిన పోషకవిలువలు అంది ఆక్షేపక వాతము మొదலగునవి నిరోధించబడతాయి. బీరకాయ గింజలయందు కోలిసింథిన్ ఉంటుంది. ఇది చక్కని విరేచన కారి గుణము కలిగి ఉంటుంది.
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 543-544) - రచయిత: డా|| టి. భిక్షపతి
