దొండకాయ / Ivy Gourd

From LTRC
Revision as of 09:55, 11 September 2026 by Abhinaya (talk | contribs) (→మూలాలు)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
దొండకాయ / Ivy Gourd
Kingdom Plantae
Division Tracheophytes
Class Magnoliopsida
Order Cucurbitales
Family Cucurbitaceae
Genus Coccinia
Scientific Name / Latin Name Coccinia grandis

దొండకాయ పాదు సుమారు 6 మీటర్ల వరకు నులుతీగలతో ఎగబ్రాకు బహువార్షిక పాదు. ఈ పాదు దారి ప్రక్క కంచెల మీద అడవి ప్రాంతాలలో పొదలపైన పెరుగుతుంది. దీనిని చాలా ప్రాంతాల్లో పెంచుతున్నారు. దొండకాయ తిక్రరసము ఉష్ణవీర్యము లఘురూక్ష గుణాలు కటువిపాకములను కలిగి ఉంది. ఇది కఫపిత్తహారము.

వివిధ భాషల్లో పేర్లు

  • సంస్కృత పేరు: బింబి
  • హిందీ పేరు: కుందరు
  • తెలుగు పేరు: దొండకాయ
  • లాటిన్ పేరు: కొక్సినియా గ్రాండీస్ (లిన్నెయ్స్) వాయిట్
  • కుటుంబము: Cucurbitaceae
  • ఆంగ్ల పేరు: Ivy Gourd

పోషక విలువలు

  • (ప్రస్తుత పుస్తక పేజీలలో పోషక విలువల వివరాలు ప్రత్యేకంగా పేర్కొనబడలేదు)

ఔషధ ఉపయోగాలు & గుణాలు

  • మధుమేహం మరియు ఇతర వ్యాధులు: ఇది లేఖనము, స్తంభనము మరియు గురుగుణములు కూడా కలిగి ఉంది. దీనిని మధుమేహము, వాపులు, కామెర్లు రక్తహీనత, మరియు రక్తపిత్తము అనే వ్యాధుల్లో ఉపయోగిస్తున్నారు.
  • మధుమేహ నియంత్రణకు వేరు చూర్ణం: చేదుదొండ వేరు చూర్ణము చేసి 3-5 గ్రాములు ఉదయం - సాయంత్రం భోజనానికి అరగంటముందు సేవించిన మధుమేహం అదుపులో ఉంటుంది.
  • శరీర కొవ్వులు తగ్గించుట: దొండకాయ శరీరంలోని క్రొవ్వులు తగ్గిస్తుంది.

జాగ్రత్తలు / ప్రతికూలతలు

  • దొండకాయ ఎక్కువ తిన్న కడుపుబ్బరమును మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

మూలాలు

  • పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 490) - రచయిత: డా|| టి. భిక్షపతి