నువ్వులు / Sesame: Difference between revisions
From LTRC
Created page with "{| class="infobox" style="float: right; width: 300px; border: 1px solid #a2a9b1; background: #f8f9fa; padding: 5px; font-size: 95%; margin-left: 10px;" ! colspan="2" style="background: #cee0f2; text-align: center;" | నువ్వులు / Sesame |- ! Kingdom | Plantae |- ! Division | Tracheophytes |- ! Class | Magnoliopsida |- ! Order | Lamiales |- ! Family | Pedaliaceae |- ! Genus | Sesamum |- ! Scientific Name / Latin Name | Sesamum indicum |} నువ్వు..." |
|||
| Line 77: | Line 77: | ||
== మూలాలు == | == మూలాలు == | ||
* పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 492-493) | * పుస్తకం: ''సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స'' (పేజీలు: 492-493) - రచయిత: డా|| టి. భిక్షపతి | ||
[[Category:Indian medicinal plant]] | [[Category:Indian medicinal plant]] | ||
[[Category:sciwiki plant]] | [[Category:sciwiki plant]] | ||
Latest revision as of 09:53, 11 September 2026
| నువ్వులు / Sesame | |
|---|---|
| Kingdom | Plantae |
| Division | Tracheophytes |
| Class | Magnoliopsida |
| Order | Lamiales |
| Family | Pedaliaceae |
| Genus | Sesamum |
| Scientific Name / Latin Name | Sesamum indicum |
నువ్వులు (Sesamum indicum) పెడాలియేసి కుటుంబానికి చెందిన ఒక ఏకవార్షిక క్షుపము. ఇది సుమారు 1 మీటరు ఎత్తు వరకు పెరిగే మొక్క. నిత్యజీవితంలో నువ్వులను ఏదో రూపేనా మన ఆహారంలోవాడటం విశేషము. నువ్వులు తెలుపు, ఎరుపు, నలుపు అనే భేదములున్నాయి. అందులో నల్లనువ్వుల చాలా శ్రేష్టమైనవి. నువ్వులు మధుర కషాయ తిక్తరసములు, ఉష్ణవీర్యము గురుస్నిగ్ధ గుణము మధురవిపాకములను కలిగి ఉంది. ఇది వాత హరము కఫపిత్తకరము కశ్యము త్వచ్యము బలము గ్రాహి శుక్రలము మరియు ప్రణరోపణము అనుకర్మలను కలిగి ఉంది. దీనిని అగ్నిమాంద్యము గ్రహిణి వాత రోగములందు విరివిగా ఉపయోగిస్తారు. నువ్వులు ఎన్నో పోషకవిలువలను కలిగి ఉన్నాయి.
వివిధ భాషల్లో పేర్లు
- సంస్కృత పేరు: తిల
- హిందీ పేరు: తిల్
- తెలుగు పేరు: నువ్వులు
- ఆంగ్ల పేరు: జింజీలీ సీడ్స్
- లాటిన్ పేరు: సిసేమస్ ఇండికమ్ డి కండోవ్
- కుటుంబము: Pedaliaceae
పోషక విలువలు
ప్రతి 100 గ్రాముల నువ్వుల యందు:
- శక్తి: 563 కేలరీలు
- ప్రొటీన్లు: 18.2
- క్రొవ్వు: 42.1
- కాల్షియం: 1435 మి.గ్రా
- పాస్పరస్: 560 మి.గ్రా
- ఐరన్: 7.3 మి.గ్రా
- నియాసిన్: 4.5 మి.గ్రా
- ఆర్గ్యాలిక్ ఆసిడ్: 1908 మి.గ్రా
- విటమిన్ - ఎ: 100 మై.గ్రా
- విటమిన్ - బి1: 1001 మి.గ్రా
- విటమిన్ - బి2: 0.34 మి.గ్రా
- అమైనో ఆసిడ్స్ ఆర్జಿನಿన్: 8.8 గ్రాములు
- హిస్టిడిన్: 1.9 గ్రా
- లూసిన్: 7.7 గ్రా
- ఐసోలూసిన్: 4.1 గ్రా
- లైసిన్: 3.6 గ్రా
- సిస్టిన్: 2.2 గ్రా
- వాలిన్: 3.9 గ్రా
- మిధియోనిన్: 2.8 గ్రా
- ఫినైలనిన్: 6.4 గ్రా
- త్రియోనిన్: 3.1 గ్రా
- ట్రిప్టోఫాన్: 1.5 గ్రా
ఔషధ ఉపయోగాలు & గుణాలు
- చర్మ మరియు క్రిమి రోగాలు: దీనిని చర్మవ్యాధులు క్రిమిరోగాలు వాతవ్యాధులందు ఉపయోగిస్తారు. నువ్వుల నూనె తలకు రాసుకున్న వెంట్రుకల కుదుళ్ళు గట్టి పడతాయి. వెంట్రుకలు నల్లబడతాయి. నువ్వుల నూనె 1,2 చంచాలు ప్రతిరోజు సేవించిన గనేరియా, అర్శమోలు మరియు అల్సర్ యందు ఉపయుక్తంగా ఉంటుంది.
- శరీర బలం మరియు ఇతర గుణాలు: నువ్వులు తీపి వగరు రుచి కలిగి ఉంటాయి. వేడి చేసే గుణము కలిగి ఉంటాయి. కళ్ళకు మంచివి. మూత్రంను జారీచేస్తాయి. వాతాన్ని తగ్గిస్తాయి. వీర్యాన్ని వృద్ధిచేస్తాయి. విరేచనాలను ఆరికడతాయి. ఋతు రక్తమును జారీ చేస్తాయి. రక్తవృద్ధి కలిగిస్తాయి. మూత్రమును జారీ చేస్తాయి. మేధస్సును పెంచుతాయి. జఠరాగ్నిని ఎక్కువ చేస్తుంది. చర్మరోగాలను హరిస్తాయి. ప్రణాలను మాన్పుతాయి.
- అశ్మరీ (మూత్రంలో రాళ్ళు): నువ్వు చెట్టును సమూలంగా కాల్చి దానిని పెరుగుతో కలిపి 3 రోజులుసేవించిన మూత్రంలో రాళ్ళు తొలగుతాయి.
- బట్టతల: నువ్వుల పుష్పములు, పల్లేరుకాయలు, తేనె, నెయ్యిమొదలగువానిన సమభాగములుగా కలిపి మెత్తగానూరి తలకు రాసుకున్న జుట్టు పెరుగుతుంది.
- రక్తహీనత, విటమిన్ల లోపము మరియు సిరోసిస్: నువ్వులను గోరువెచ్చని నీటిలో 2,3 గంటల తరువాత వానిని మెత్తగా రుద్ది 80 మి.లీ ఆవుపాలయందు కలిపి అందులో బెల్లం కలిపి తినిపించిన రక్తహీనత, విటమిన్ల లోపము మరియు సిరోసిస్ రోగులకు ఎంతో ఎంతో ఉపయోగము.
- అతిమూత్రం: 50 గ్రాముల నువ్వులను నానబెట్టి మెత్తగా రుబ్బి వానిని రాత్రి పడుకునే ముందు ಸೇವించిన అతి మూత్రం తగ్గుతుంది.
- అర్శమోలు: నువ్వులను చక్కగా వేయించి అందులో ఆవునెయ్యి రోజుకు 3 సార్లు మేకపాలతో కలిపి సేవించిన రక్త అర్శమోలు, జిగురు విరేచనాలు, మలబద్ధత మొదలగునవి తగ్గుతాయి.
- బుతుశూల: నువ్వులను పొడిగాచేసి 1/2 చంచాను గోరు వెచ్చని నీటితోకలిపి సేవించిన బుతుశూల తగ్గుతుంది.
- వీర్యవృద్ధికి పుంసత్వమునకు: నల్లనువ్వులు మరియు బెల్లము పాకము పట్టి వాటిని చక్కగా జాగ్రత్తచేసుకొని సేవించిన బలము, వీర్యవృద్ధి కలుగును. సెక్స్‌నందు హితంగా ఉండును. వాతమును హరించును.
- నేత్రరోగము: నువ్వుల పువ్వుల నుండి రసము తీసి కండ్లలో వేసిన నేత్రరోగము లందు హితంగా ఉండును.
- రక్తపుగడ్డలు: నువ్వుల ఆకులను మెత్తగా నూరి గడ్డలపై కట్టిన ఉపశమనం కలుగుతుంది. నువ్వుల ఆకులను మెత్తగా నూరి నీటితో కలిపి సేవించిన జిగురు విరేచనాలు కోష్ఠబద్ధత తొలగుతుంది.
- గండూషము: నువ్వుల నూనెను పుక్కిట పట్టి (గండూషము గార్గిలింగ్) 10-15 నిమిషాలు చేసి ఊచేసిన గొంతు వాధ్యులు తొలగతాయి. ఇది కంటికి మేధస్సుకు మంచిది. చిగుళ్ళ వ్యాధులు నిరోధించబడతాయి.
జాగ్రత్తలు / ప్రతికూలతలు
- (ప్రస్తుత పుస్తక పేజీలలో ప్రత్యేకమైన ప్రతికూలతలు పేర్కొనబడలేదు)
మూలాలు
- పుస్తకం: సంపూర్ణ ఆయుర్వేద వైద్య చికిత్స (పేజీలు: 492-493) - రచయిత: డా|| టి. భిక్షపతి
